కరీంనగర్

జలసాధనకై కదిలిన రైతాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రామగుండం నియోజక వర్గంకు సాగు, తాగునీరు సరఫరా చేయకుంటే... తాడోపేడో తేల్చుకుంటామని శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ గురువారం నాడు ఛలో కలెక్టరేట్ పేరుతో 30 కిలో మీటర్ల మేర తలపెట్టిన జలసాధన పాదయాత్రలో నియోజక వర్గ రైతులంతా దండుగా కదిలారు. అంతర్గాం మండల కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో 3వేల మందికి పైగా ప్రజలు భాగస్వామ్యులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యంపై గర్జిస్తూ సర్కారు విధానాలపై రైతాంగం గొంతెత్తి నినాదించింది. భూములు పోయినయి... ఊర్లూ మునిగినయి... ఉన్న భూములు నెర్రలువారినయి... పుణ్యం చేస్తే పాపం వచ్చిన్నట్లు... సాగు, తాగు నీరు ఇవ్వండి మహాప్రభో... అంటూ నెత్తి నోరు కొట్టుకుంటే ఇప్పించే దిక్కులేని క్రమంలో రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ చేపట్టిన జల సాధన పోరులో మేమంతా... మీ వెంటే ఉంటామంటూ... రైతులు, ప్రజలు ఈ సందర్భంగా ప్రమాణాలు చేశారు. మక్కాన్‌సింగ్ పాదయాత్ర ఊరూర చేరుకోగానే అక్కడ మహిళలు మంగలహారతులతో బ్రహ్మరథం పట్టారు. ఆట-పాటలు, డప్పుచప్పుల్లతో యాత్ర హుషారుగా కొనసాగింది. అంతర్గాం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బ్రాహ్మణపల్లి, సోమన్‌పల్లి, ఎక్లాస్‌పూర్, మద్దిర్యాల, కుక్కలగుడూర్ మీదుగా జయ్యారం, పుట్నూర్, కొత్తపల్లి, రాజారాంపల్లి, తక్కల్లపల్లి నుంచి పాలకుర్తి చేరింది. వేలాది మంది రైతులతో ఈ పాదయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకోబోతుంది. యాత్రలో వందలాది మంది మహిళా రైతులు భాగస్వామ్యులై నీరు ఇప్పించేంత వరకు జరిగే అన్ని ఉద్యమాల్లో ముందుంటామని పేర్కొన్నారు. పాదయాత్రలో నాయకులు గోపు కొంరయ్య యాదవ్, మేర్గు పోశం యాదవ్, అయోధ్య సింగ్, అక్షర కోట కుమార్, నర్సింహ రెడ్డి, గుంట బాపు, ముక్కెర శ్రీనివాస్, ముల్కల కొంరయ్య, అంజులుతోపాటు సర్పంచ్‌లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ రుణాల దరఖాస్తు గడువు పొడిగించాలి
గంగాధర: ఎస్సీ, ఎస్టీలకు రాయితీపై ఇచ్చే రుణాల దరఖాస్తు గడువును 25 వరకు పొడగించాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పొత్తూరి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాధరలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాయితీపై ఇచ్చే రుణాల దరఖాస్తు గడువు 15తో ముగిసినందున వరుస సెలవులు రావడంతో పలువురు దరఖాస్తు చేసుకోలేకపోయారని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నందున అదనపు యూనిట్లు పెంచి 25 వరకు గడువు పొడగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఎస్సీ కార్పోరేషన్ రుణాల లబ్ధిదారుల లోన్ అకౌంట్ బ్యాంక్‌లు లబ్ధిదారులకు జమ చేయకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే బ్యాంక్‌ల ఆన్‌లైన్ గడువును కూడా పొడగించాలని ఆయన కోరారు.

కిరాయిదారుల వివరాలు తెలుసుకుని ఇళ్ళు అద్దెకివ్వాలి
* సిపి విబి కమలాసన్‌రెడ్డి
కరీంనగర్ టౌన్: తమ ఇళ్ళలోకి అద్దెకోసం వచ్చే వారి పూర్తి వివరాలు తెల్సుకున్న అనంతరమే కిరాయికి ఇవ్వాలని పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి సూచించారు. గురువారం ఉదయం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో సిపి ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా కాలనీవాసులతో సిపి మాట్లాడుతూ, ఇళ్ళలో పనిచేసే వారి వివరాలు కూడా తమకు తెల్పితే, గతంలో వారి చరిత్ర పరిశీలించి తెల్పుతామని, కిరాయిదారుల వివరాలు తెల్సుకోకుండా ఇళ్ళు అద్దెకిచ్చినట్లైతే సంఘ విద్రోహ శక్తులు ఆశ్రయం పొందే అవకాశముంటుందన్నారు. వారి ద్వారా జరిగే అనర్ధాలకు పరోక్షంగా మీరే బాధ్యులవుతారని, వాహనాలు ఇతరుల వద్దనుంచి కొనుగోలు చేసే సందర్భంలోసరైన ధృవపత్రాలు చూసుకోవాలన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసిన వారిపై తమకు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదైన వారికి భవిష్యత్‌లో పాస్‌పోర్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవన్నారు. గణేశ్ మంటపాల నిర్వాహకులు 15మందికి తక్కువ కాకుండా సేవకులను ఏర్పాటు చేసుకోవాలని, రాత్రివేళల్లో కనీసం 4గురు సేవకులు మంటపాల వద్ద కాపలాగా ఉండాలన్నారు. కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ వస్తువులపై ఉక్కుపాదం మోపుతున్నామని, వీటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలపాలన్నారు. త్వరలోనే కమీషనరేట్ పరధిలో ఈచలాన్ విధానం అమలు చేస్తామని, వాహనదారులు సరైన దృవపత్రాలు కలిగి ఉండాలని,కమీషనరేట్ పరిధిలో 10వేల సిసి కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. నేరాల నియంత్రణ, చేధనకు దోహదపడే సిసి కెమెరాల ఏర్పాటుకు నేను సైతం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈసందర్భంగా కాలనీవాసులకు హాక్ ఐ, టెనెంట్ సర్వేంట్ వెరిఫికేషన్, షీటీంల పనితీరుపై అవగాహన కల్పించారు. కార్డెన్ సెర్చ్‌లో సరైన దృవపత్రాలు లేని 64 ద్విచక్రవాహనాలు, కల్తీ అల్లం, వంట నూనెలు స్వాధీనం చేసుకుని పలు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్, బాదం మిల్క్ ప్లాంట్, కూల్ వాటర్ ప్లాంట్‌లు తనిఖీ చేశారు.
ఈకార్యక్రమంలో రూరల్ ఎసిపి తిరుపతి, ఇన్స్‌పెక్టర్లు తులా శ్రీనివాస్‌రావు, మహేశ్‌గౌడ్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు పలు విభాగాలకు చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు.

శాతవాహన సమస్యలపై స్పందించాలి
* టిఆరెస్వీ ఆధ్వర్యంలో ఎంపి వినోద్‌కు వినతిపత్రం
కరీంనగర్ టౌన్: నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలపై స్పందించాలంటూ టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు గురువారం ఎంపి వినోద్‌కు వినతిపత్రం అందజేశారు. ఎంపిని తన నివాసంలో కలిసిన విద్యార్థి నాయకులు వర్సిటీలో నెలకొన్న పలు సమస్యలపై ఏకరువు పెట్టారు. ప్రధానంగా బిఫార్మసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విశదీకరించారు. ఈకోర్సుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేకపోవటంతోగత ఐదేళ్ళుగా ఈకోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అయోమయంలో ఉన్నారని, విశ్వవిద్యాలయం ప్రారంభించి దశాబ్దకాలం గడిచినా ఇప్పటివరకు యుజిసి(12బి) గుర్తింపు రాకపోవటంతోకేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులతోనే నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ గుర్తింపు లభిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే అనేక పథకాలు ఎస్‌యూకు కూడా వర్తిస్తాయని, రిసెర్చ్ స్కాలర్స్‌కు అనుగుణంగా నిధులు విడుదలవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయ అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని బాహ్య ప్రపంచంతో పోటీపడే విధంగా ఉచిత వైఫై సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పై సమస్యలపై స్పందించిన ఎంపి ఈవిద్యాసంవత్సరంలోనే వీటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వర్సిటీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తెస్తే సంబంధితాధికారులతో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ఈసందర్భంగా ఎంపిని కలిసినవారిలోటిఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్లు ద్యావ మధుసూధన్‌రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, నాయకులు జక్కుల నాగరాజు, సుదగోని శ్రీనాథ్, సంపత్‌రెడ్డి,వేణుమాధవ్,శ్రావన్, శేఖర్, రోష్ని,రమ, మాధవి, ముత్యంరెడ్డితో పాటు పలువురు ఉన్నారు.

హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములవుదాం
* హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ఎల్కతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరం భాగస్వాములై విజయవంతం చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. గురువారం ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ ఎస్సారార్ ఫార్మసీ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని చెట్లను నాటి అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా హరితహారం కార్యక్రమం తలపెట్టిందని, దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోని ఇంటివద్ద మొక్కలు నాటాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకునే బాధ్యత మనపై ఉందన్నారు. హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల వారి నుం డి విశేష స్పందన లభిస్తుందని, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగు లు, స్వచ్ఛంద సంస్థ, మహిళా సం ఘాలు స్వచ్ఛందంగా మొక్కలు నాటుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంతో పాటు ప్రజాసంక్షేమం కోసం పలు అభివృద్ధి పథకాలు చేపడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆగయ్య, ఎంపిడిఓ ఇందుమతి, తహశీల్దార్ మల్లేశ్, ఎంపిపి శాలినీ-మహేందర్, సర్పంచ్ ఆనందం, నాయకులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలి
కరీంనగర్ టౌన్: వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రాకుండా చూడాలని, సమస్యలుంటే సత్వరమే స్పందించి వాటిని తొలగించి, స్వంత పిల్లల్లా చూసుకోవాలని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ సూచించారు. గురువారం నగరంలోని పలు సంక్షేమ వసతి గృహాలను అకస్మిక తనిఖీ చేశారు. సుభాష్‌నగర్‌లోని ప్రభుత్వ షెడ్యూలు కులాల బాలుర వసతి గృహం, కార్ఖానగడ్డ, ఎస్‌సి బాలికల వసతి గృహం, ఎస్సారార్ కళాశాల మహిళా వసతిగృహం, రాంనగర్లోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంతో పాటు పలు హాస్టళ్ళు తనిఖీ చేశారు. గదుల్లో ఉండే విద్యార్థుల సంఖ్య, వసతుల వివరాలు, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించటం తదితర వివరాలు అడిగి తెల్సుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలిగినా సత్వరమే స్పందించి వాటిని పరిష్కరించాలని వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. ప్రతి 15రోజులకోమారు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, హాస్టళ్లలో అదనపువసతులు, మరమ్మత్తులు అవసరమైనచో తగిన ప్రతిపాదనలు పంపాలని షెడ్యూలు కులాల శాఖ డిడికి సూచించారు. కలెక్టర్ వెంట ఎస్సీ వెల్ఫేర్ డిడి యాదయ్య, డిటిడబ్య్లువోఅంబాజీ, ఇఇ షఫీ మియా, తదితరులున్నారు.

ఎంఆర్ వాక్సిన్ పిల్లలకు వేయించే బాధ్యత తల్లిదండ్రులదే
* సిరిసిల్లలో మీజిల్స్, రూబెల్లా టీకా ప్రారంభోత్సవంలో కలెక్టర్ కృష్ణ్భాస్కర్
సిరిసిల్ల: తొమ్మిది నెలల నుండి 15 సంవత్సరాల మద్య పిల్లలందరికీ మీజిల్స్ రూబెల్ల వ్యాక్సిన్ వేయించడం తల్లి తండ్రుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం సిరిసిల్లలోని బివైనగర్ పాఠశాలలో మీజిల్స్ రూబెల్ల వాక్సిన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరు కాగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్.రమేశ్, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ శివప్రసాద్, డిఐవో డా.అరుణలు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇది రెండు వ్యాధులకు ఓకే టీకా అని, తల్లి తండ్రులు ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం కోల్డ్ చైన్ బాక్స్‌ను(వాక్సిన్ బాక్స్)ను రిబ్బన్ కట్ చేసి మూత తీసి ఎంఆర్ వాయిల్‌ను తీసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డిఎం అండ్ హెచ్‌వో డా.రమేశ్ మాట్లాడుతూ జిల్లాలో లక్షా 15 వేల మంది ఈ టీకాలు వేసుకోవడానికి అర్హులుగా చిన్నారులను గుర్తించినట్టు తెలిపారు. జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాలు, అవుట్ రీచ్ గ్రామాలలో హైరిస్క్ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో తెలిపారు. డిఐవో డా.అరుణ మాట్లాడుతూ వందన సమర్పణ చేయగా, కార్యక్రమంలో పివో డా.చంద్రశేఖర్, ఎంవో డా.అనిల్, డా.అరుణ్, డిప్యూటి డిఇఎంవో డా.కె. ఆనందభాస్కర్, హెచ్‌ఇ బాలయ్య, హెచ్‌ఇవో లిగన్న, లయన్స్ క్లబ్ సభ్యులు, టీచర్స్ తల్లితండ్రులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
కరీంనగర్ టౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు డా.రెడ్డీస్ ల్యాబ్స్‌లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎ. వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సెల్ప్ మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఖాళీలున్న 70 పోస్టుల్లో ఉద్యోగం పొందగోరే వారు ఇంటర్మీడియట్ సైన్స్‌గ్రూప్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై, 18నుంచి 20 ఏళ్ళు నిండిన వారై ఉండాలని, ఏడాదికి రూ.1.45లక్షల వేతనం ఇవ్వనున్నట్లు, ఎంపికైన సంస్థ ద్వారా రెగ్యులర్ డిగ్రీ చదివించబడుతుందని, సబ్సీడీతో కూడిన భోజన,వసతి సౌకర్యాలు రెండేళ్ళ వరకు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఔత్సాహికులు ఈనెల 19న నగరంలోని స్వశక్తి కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని, అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్‌కార్డు, విద్యార్హతల దృవీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులు వెంట తెచ్చుకుని, ఉదయం 10గంటలవరకు స్వశక్తి కళాశాలలోని ఈజిఎంఎం కార్యాలయంలో హాజరుకావాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
20నుంచి ఖేల్ భారత్ క్రీడోత్సవాలు
కరీంనగర్ టౌన్: ఈనెల 20నుంచి రెండు రోజులపాటు జిల్లాస్థాయి ఖేల్ భారత్ క్రీడోత్సవాలు నగరంలోనిర్వహిస్తున్నట్లు బిజెవై ఎం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రవీన్‌రావు తెలిపారు. యువమోర్చా ఆధ్వర్యంలోనిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఖబడ్డీ, ఖోఖో పోటీలు స్థానిక ఎస్సారార్ కళాశాల మైదానంలోకొనసాగుతాయని, జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన ఔత్సాహిక క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొనవచ్చని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్టస్థ్రాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. రాష్టస్థ్రాయిలో గెలుపొందిన విజేతలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా బహుమతులు అందిచనున్నట్లు, జిల్లాస్థాయిలో పాల్గొనే జట్ల వివరాలు ఈనెల 19 శనివారం ఉదయం 11గంటలవరకు 9885332720 అనే నెంబర్‌లోసంప్రదించి అందజేయాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
రుబెల్లా టీకాలను పిల్లందరికీ వేయించాలి
* ఎంపిపి భూక్య మంగ
హుస్నాబాద్: రుబెల్లా టీ కాలను 9నెలల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలందరికి వేయించాలని హుస్నాబాద్ ఎంపిపి భూక్య మంగ అన్నారు.గురువారం హుస్నాబాద్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తట్టుమ్రీజిల్స్) రుబెల్లా టీకాలను వేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.అనంతరం అమె మాట్లాడుతూ ఈ నెల 17నుండి 25వరకు 9నెలల నుండి 15 ఏళ్ల వయస్సున్న బాలబాలికలకు ఈ టీకాను వేయించాలన్నారు. ఒకే టీకాతో రెండు వ్యాధులు రాకుండ నివారించ వచ్చని ఈ లాంటి అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్డీవో శంకర్‌కుమార్,నగరపంచాయితీ చైర్మెన్ సుద్దాల చంద్రయ్య, ఆసుపత్రి వైద్యాధికారి కె.సౌమ్య కౌన్సిలర్లు, ఉపాద్యాయులు వైద్య సిబ్బంది పాల్గోన్నారు.
వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలి మృతి
వీణవంక: వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామ శివారు ఐలాబాద్‌కు చెందిన పురంశెట్టి రాజమ్మ (70) అనే వృద్ధురాలు గురువారం ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గేదెకు గడ్డికోయడానికి వ్యవసాయ బావి సమీపం వద్దకు వెళ్లిందని, ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ దేవారెడ్డి తెలిపారు.
రౌడీషీటర్ల బైండోవర్
వీణవంక: వీణవంక మండలంలోని పలు గ్రామాలకు చెందిన గుజ్జుల సారయ్య, కర్ర రవీందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, గాజుల శ్రావణ్, కొమ్ము సామిల్ అనే ఐదుగురు రౌడీషీటర్లను గురువారం తహశీల్దార్ సంపత్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎఎస్‌ఐ దేవారెడ్డి గురువారం తెలిపారు.
మీజిల్స్, రుబెల్లా టీకా మందు పంపిణీ
వీణవంక: మండలంలోని రెడ్డిపల్లి, చల్లూరు తదితర గ్రామాల్లో గురువారం తొమ్మిది నెలలు నిండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు రుబెల్లా టీకా మందు పంపిణీ చేసినట్లు పిహెచ్‌సి వైద్యులు సురేష్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 11 వేల మంది పిల్లలకు ఈ టీకా మందును పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పిల్లలకు ఎంఆర్ వ్యాక్సినేషన్
ఓదెల: ఎదుగుదల లోపానికి కారణమయ్యే పిల్లల్లో రుబెల్లా వ్యాధి నివారణకై తప్పనిసరిగా మండలంలో ఉన్న చిన్న పిల్లలందరికీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఓదెల ఎంపిపి గట్టు రమాదేవి పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. గురువారం మండలంలోని పొత్కపల్లిలో నిర్వహించిన ఎంఆర్ వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 17 సంవత్సరాల లోపు పిల్లలందరు తప్పనిసరిగా నివారణ మాత్రలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు టీకాలు వేసి మాత్రల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎం సుధారాణి, రజిద, హెచ్‌ఎ విద్యాసాగర్, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలను ప్రారంభించారు. సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా జీర్ణోద్ధారణ పునఃప్రతిష్ఠ
రామడుగు: మండలంలోని గుండి గ్రామంలో కాకతీయ కాలంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం జీర్ణోద్ధారణ పునఃప్రతిష్ట కార్యక్రమ ంలో భాగంగా చివరి రోజైన గురువారం విగ్రహాల పునఃప్రతిష్టతో పాటు ధ్వజ స్థంభం ప్రతిష్ట చేశారు. ప్రముఖ జ్యోతిష్యవాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీమా న్ నమిలకొండ రమణాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రా మస్థులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా మూ సుకున్న తలుపులు గ్రామస్థులు ముందుకు వచ్చి పునఃప్రతిష్ట గావించడంతో గ్రామంలో మళ్లీ పూర్వవైభవం సంతరించుకుందని పలువురు పేర్కొన్నారు.
వాసవిమాత దేవాలయం
నిర్మాణ పనులు ప్రారంభం
సుల్తానాబాద్: మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో గురువారం వాసవిమాత దేవాలయం నిర్మాణంకు గాను పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల రూరల్ అధ్యక్షుడు వెంకటనారాయణ, పట్టణ, మండల అధ్యక్షుడు కొమురవెల్లి రాంమ్మూర్తి, దైత రాజేశం, వాసవిమాత దేవాలయ నిర్మాణ చైర్మన్ చకిలం మారుతి, యువత అధ్యక్షుడు ఒల్లాల రాజు, మహిళా అధ్యక్షురాలు పల్లా అన్నపూర్ణ, ఎంపిటిసి పల్లా సురేష్, ఉపసర్పంచ్ అల్లెంకి శ్రీనివాస్, శివాలయం చైర్మన్ అల్లెంకి సత్యనారాయణ, ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్ అధ్యక్షుడు అల్లెంకి ఆనందం, కార్యదర్శి లింగమూర్తి, సిరిపురం రమేష్, కొమురవెల్లి వీరభద్రయ్య, మార్కెట్ డైరెక్టర్ పల్లా సుధాకర్, నాయకులు ముస్త్యాల కిషన్, ముస్త్యాల రాములు, కొమురవెల్లి అంజయ్య, లోక్ అదాలత్ సభ్యుడు పల్లా కిషన్, పల్లా శ్రీరాములు, అశోక్, ప్రసాద్ పలువురు ఉన్నారు.
క్రీడాకారులకు ఆట వస్తువుల పంపిణీ
కాల్వశ్రీరాంపూర్: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన వాలీబాల్ క్రీడాకారులు తమకు ఆట సామాగ్రి లేవని సోషల్ మీడియాలో పెట్టగా స్పందించిన మాజీ ఉపసర్పంచ్ జూకంటి అనిల్ గురువారం క్రీడాకారులకు వాలీబాల్, నెట్ తదితర సామాగ్రిని అందించారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ క్రీడాకారులు మంచిగా రాణించి గ్రామానికి పేరు తీసుకురావడంతో పాటు చదువుల్లో శ్రద్ధ చూపి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు మనోజ్, మహేష్, కోచ్ దుర్గాప్రసాద్ ఉన్నారు.
పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ
హుజూరాబాద్: హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం కింద రూ.13 లక్షల వ్యయంతో భవన నిర్మాణం చేయనున్నట్లు సర్పంచ్ తొగరు భిక్షపతి, పంచాయతీ రాజ్ ఎ ఈ దయాకర్‌చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సరేందర్, వార్డు సభ్యులు నీలమ్మ, గ్రామస్తులు సబ్బని రమేష్, చొక్కయ్య, భిక్షపతి, శివకృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి లోకమాత పోచమ్మ ఆలయ వార్షికోత్సవం
జగిత్యాల:ఆది పరాశక్తి అంశతో స్వయంభూగా వెలసిన లోకమాత పోచమ్మ తల్లి 55 వార్షికోత్సవం నేటి నుండి ప్రారంభమవుతున్నాయి. శుక్రవారం నుండి సోమవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు ఆలయ నిర్వహకులు ప్రత్యే క ఏర్పాట్లు చేసారు. కొలిచిన వారికి కొంగు బంగారమై, నిష్కల్మష మనసుతో ఆరాధించిన వారిని అక్కున చేర్చుకునే చల్లని తల్లిగా భక్తులచే 55 సంవత్సరాలుగా ఆరాధించబడుతున్న లోచమాత పోచమ్మ తల్లి 55వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పురాణిపేటలోని లోకమాత పోచమ్మ దేవాలయ ంలో వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లుఆలయ కమిటి సభ్యులు తెలిపారు.
ఆలయ పూరాణం...
1961లో గ్రామంగా ఉన్న జగిత్యాలలో కలరా వ్యాధి సోకి గ్రామస్థులందరు మృత్యువాత పడుతున్న విపత్కర సమయంలో గ్రామ శివారులో స్వయంభూ వెలసిన ఈ పోచమ్మ తల్లిని ఆరాధించి, శాంతి హోమం చేసి 3రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలను చేయాలని సత్సంకల్పంతో అంగడి మఠం మునెయ్య అనే అర్చకుడు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు పూర్వగాథ చెబుతుంది. అంతేకాకుండా 1962లో ఆనాడు తగ్గుముఖం పట్టిన కలరా వ్యాధి 55 ఎళ్లు గడిచిన ఈనాటి వరకు జగిత్యాలలో ఏ ఒక్కరికి సోకకపోవడం విశేషం. 1962 జనవరిలో 15న అష్టగ్రహ కూటమిచే మహా సంక్షోభం కలిగిన ఉపద్రవ సమయంలో ఈ పోచమ్మతల్లి అనుగ్రహంతోనే జగిత్యాల గ్రామస్థులు క్షేమంగా ఉన్నారనేది గమన్హరం. ఈ రెండు దృష్టాంతాలను దృష్టిలో ఉంచుకుని ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఉత్సవాలను ఆలయ నిర్వహకులు ఆత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల ప్రాముఖ్యత...
ప్రతి సంవత్సరం పొలాల అమావాస్యకు 3రోజుల ముందు నుండి ఈ పోచమ్మతల్లి ఉత్సవాలను ప్రారంభిస్తారు. మొదటి రోజు నుండి నిరంతరం భజన కార్యక్రమాలు, అమ్మవారి విశేషార్చనలు, భోగములు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి దూపదీప, నైవేద్యాలతో అమ్మవారిని స్తుతిస్తారు. చివరి రోజైన పొలాల అమావాస్య రోజున గోపాల కాలువలు నిర్వహించి చిన్న కృష్ణుని వేషాధారణలతో ఉట్టిని కొట్టే కార్యక్రమాన్ని చేపడుతారు. తదపరి వచ్చే ఆదివారం రోజున అమ్మవారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 20న బ్రహ్మశ్రీ తిగుళ్ల విష్ణుశర్మ ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తా రు. కాగా ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకుపాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

మీజిల్స్ టీకాలను వేయించాలి
ధర్మపురి: సెప్టెంబర్ 17నుండి 25వరకు ధర్మపురి మండలంలో మీజిల్స్ - రుబెల్లా టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున 9నెలల నుండి 15సంవత్సరాల మధ్య వయస్కులకు టీకాలు తప్పక వేయించాలని ధర్మపురి వైస్ ఎంపిపి అయ్యోరి రాజేశ్ కుమార్ కోరారు. గురువారం ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తట్టు-రుమెల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శ్రీపతి, మండల విద్యాధికారి రాజమహేందర్ రెడ్డి, ధర్మపురి సర్పంచ్ సంగి సత్తమ్మ, శేఖర్, పాఠశాల హెచ్‌ఎం రాజేందర్, ఉపాధ్యాయులు, ఎఎన్‌ఎంలు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. గురువారం ధర్మపురి లోని లక్ష్మీనరసింహ కాలనీ పాఠశాల, న్యూహరిజన వాడ పాఠశాల, గ్లోబల్ స్కూల్, లింబగిరి కానె్వంట్, చైతన్య భారతి, కస్తూర్బా, కేరళ ఆంగ్ల మాధ్యమ పాఠశాల, బుద్దోశిపల్లె, ఆకుసాయి పల్లె ప్రభుత్వ పాఠశాలలో టీకాలు వేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలలో నిర్ణీత తేదీలలో టీకాలు వేయడం జరుగుతుందని, సదవకాశాన్ని వినియోగించు కోవాలని డాక్టర్ శ్రీపతి వివరించారు.

పేదలకు వరం...కల్యాణలక్ష్మి పథకం
* ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ నేతృత్వంలో చేపడుతున్న విభిన్న ప్రజాహిత కార్యక్రమాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లు పేదలకు నిజమైన వరాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ధర్మపురి క్షేత్రంలో మండల తహశీల్‌దార్ కార్యాలయంలో బుగ్గారం మండలానికి చెందిన బుగ్గారం, గోపులాపూర్, సారికొండ, వెల్గొండ గ్రామాల అర్హులైన పేదలకు 11మందికి ఒక్కక్కరికి 51వేల చొప్పున ప్రభుత్వ సాయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, వరకట్నపు దురాచారాలకు పెళ్ళిళ్ళు చేయడం తలకు మించిన భారమతుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో లేని విధంగా కుల, మతాలకు అతీతంగా పేదలకు పెళ్ళిళ్ళ నిమిత్తం 51వేలు అందించడం కేసిఆర్ ప్రభుత్వ గొప్పతనమన్నారు.
ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించు కోవాలని సూచించారు. ధర్మపురి తహశీల్‌దార్ నవీన్, వైస్ ఎంపిపి అయ్యోరి రాజేశ్ కుమార్, ధర్మపురి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ అల్లం దేవమ్మ, ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాదినేని రాజేందర్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రంగారావు, రెవెన్యూ సిబ్బంది, లబ్దిదారులు పాల్గొన్నారు.

రూబెల్లా టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
* హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ఎల్కతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్ కోరారు. గురువారం ఎల్కతుర్తి హైస్కూల్ ఆవరణలో ఈ నెల 17 నుండి సెప్టెంబర్ 23 వరకు టీకా కార్యక్రమాన్ని సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తట్టు రుబెల్లా వ్యాధుల నుండి నివారించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమంపై సినిమా థియేటర్లలో, సిటీ కేబుళ్లలో, మహిళా సంఘాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా అవగాహన కల్పించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు రుబెల్లా వ్యాక్సీనేషన్ తప్పనిసరిగా వేసుకునేందుకు 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతీ ఒక్కరికి వేసుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శాలినీ-మహేందర్, సర్పంచ్ గొల్లె మాధవి-మహేందర్, ఎంపిటిసి లావణ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.

అందరికీ ఆరోగ్యం కోసం
ప్రభుత్వ కృషి
* నగరపంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి
* జమ్మికుంటలో రూబెల్లా, తట్టు టీకాలు
జమ్మికుంట: పుట్టిన బిడ్డనుండి పెద్దల వరకు అందరికి అరోగ్యం అందించడానికి ప్రభుత్వ కృషి చేస్తుందని నగరపంచాయితీ చైర్మెన్ పోడెటి రామస్వామి అన్నారు. గురువారం ప్రభుత్వ వైద్యా,అరోగ్య శాఖ అధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో రూబెల్ల,తట్టు టికాలు వేసే కార్యమ్రాన్ని ప్రారంభించారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలో ఒక సంవత్సరం నుండి 15 సంవత్సరాలలోపు పిల్లలకు టికాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సుపర్‌డెంట్ అనితరెడ్డి, కౌన్సిలర్లు చందరాజు,సుధకర్‌తోపాటు వైద్యా సిబ్బంది పాల్గోన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు భూమి కేటాయంపు
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ టౌన్: జిల్లాలో ప్రభుత్వం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలోజిల్లాపరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అవకాశాలు, ముడిసరుకులు, వనరుల లభ్యత పై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైద్రాబాద్ నాలెడ్జి బృందం మేనేజర్లు, జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్వేచేసి ఏజిల్లాల్లో ఏయే ఉత్పత్తులు లభిస్తాయి, ఏయే జిల్లాల్లో సహజ వనరులు అధికంగా ఉన్నాయో, ఆయా జిల్లాలకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం జిల్లాల వారీగా అధ్యయనం చేస్తుందని అందులో భాగంగా నగరంలో కూడా నేడు నాలెడ్జ్ టీమ్ అధ్యయనం చేస్తుందన్నారు. జిల్లాలో ఏ పరిశ్రమ స్థాపించినా విద్యుత్,నీటి వసతి, రవాణా సౌకర్యాలు ఉన్నాయని పరిశ్రమకు అవసరమైన ప్రభుత్వ భూమి కూడా కేటాయిస్తామని స్పష్టం చేశారు. నేదునూర్‌లో 400 ఎకరాలు, ఓగులాపూర్‌లో 200 ఎకరాలు, రామడుగులో 40 ఎకరాలు, చొప్పదండిలో 100 ఎకరాలు, రుక్మాపూర్‌లో 100 ఎకరాలు ప్రభుత్వ భూములున్నట్లు వెల్లడించారు. 5 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమైనచో ఎక్కడైనా కేటాయిస్తామన్నారు.
ఈసందర్భంగా నాలెడ్జ్ టీమ్ జిల్లాలో విద్యుత్ ఉత్పత్తి, ఇరిగేషన్ నీటి సామర్ధ్యం, మార్కెటింగ్, జిల్లాలో చేపల ఉత్పత్తి, గొర్లు, మేకల ఉత్పత్తి అందుకు తగిన ప్రాసెసింగ్ యూనిట్లు ఏవైనా నెలకొల్పవచ్చా అని అడిగి తెల్సుకున్నారు. అలాగే హర్టికల్చర్ పూలు, పండ్లు, రైసుమిల్లుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. జిల్లాలో వరిధాన్యం ఉత్పత్తి మార్కెటింగ్ వివరాలపై ఆరాతీశారు.
ఈకార్యక్రమంలో నాలెడ్జ్‌టీమ్ మేనేజర్లు అవినాష్, రమణ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రతాప్, వ్యవసాయశాఖాధికారి శ్రీ్ధర్, హర్టికల్చర్ డిడి శ్రీనివాస్, మత్య్సశాఖాధికారి దేవెందర్, పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ విక్రమ్‌కుమార్,తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు
* ఆర్డీవో పాండురంగ
ఎల్లారెడ్డిపేట: గూడు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తోందని సిరిసిల్ల ఆర్డీవో పాండురంగ అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులోని పాల శీతలీకరణ కేంద్రం ఎదుట కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన తలపెట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆయన గురువారం భూమి పూజ చేశారు. ఆర్డీవో పాండురంగ మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా 160 మంది లబ్ధిదారులకు మంజూరు చేశామని అన్నారు. 3.04 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. పనులను వేగవంతం చేసి పేదవాళ్ల స్వంత ఇంటి కళ చేరవేర్చుతామని ఆర్డీవో పాండురంగ అన్నారు. జడ్పిటిసి సభ్యుడు ఆగయ్య మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సర్కారు కృషి చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీ ఎం కెసి ఆర్ నెరవేర్చుతున్నారని ఆగయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సుజాత, సర్పంచ్ నేవూరి మమత, ఇంచార్జీ తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు పర్శరాంరెడ్డి, ఎమ్పిటిసి సభ్యుడు బాల్‌రాజ్‌యాదవ్, నాయకులు వెంకట్‌రెడ్డి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.