హైదరాబాద్

రెచ్చిపోతున్న స్ట్రీట్ రైడర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: మహానగరంలో స్ట్రీట్‌రైడర్స్ రెచ్చిపోతున్నారు. గతంలో కేవలం సంపన్నులు నివసించే ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లతో పాటు నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, అవుటర్ రింగ్ రోడ్లలో మాత్రమే సాగిన రైడ్స్ ప్రస్తుతం గల్లీలో కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారులపై పోలీసుల నిఘా పెరగడంతో యువకులు గల్లీపై దృష్టిసారించారు. కాలనీలు, బస్తీ రోడ్లపై చిత్రవిచిత్రమైన బైక్‌లు, స్కూటర్లపై రయ్యమంటూ దూసుకుపోతూ పాదచారులను, తోటి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇరుకైన రోడ్లపై చెవులు బద్దలయ్యేలా హారన్స్ మోగిస్తూ వీరు చేసే ఫీట్లతో హడలిపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఖరీదైన బైక్‌లతో పాటు పనికిరాకుండా పోయిన వివిధ వాహనాల స్పేర్‌పార్ట్‌లతో రూపొందించిన వాహనాలతో రోడ్లపైకి వచ్చికి నానా హంగామా సృష్టిస్తున్నారని పేర్కొంటున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న వీరిని ఎవరైనా అడ్డగించి ప్రశ్నిస్తే చిన్న, పెద్ద తేడా లేకుండా దుర్భాషలాడుతూ వారిపై దాడికి సైతం వెనుకాడటం లేదు. పాతబస్తీతో పాటు నగరంలోని చాలా చోట్ల యువకులు వేగంగా ప్రయాణిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఎదురుగా ఉన్న వాహనాన్ని తపించేందుకు వీరు మోగించే హారన్ సౌండ్ల తోటి వాహనదారులు వణికి పోయేలా చేస్తున్నాయి. దీంతోపాటు నడిరోడ్డుపై వాహనాలను నిలిపి రాకపోకలకు సైతం అంతరాయం కలిగిస్తున్న పోకిరీ యువకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు, బస్తీల్లోకి ప్రవేశించే రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించి తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పాత నోట్ల మార్పిడికి యత్నం
ఇద్దరి అరెస్టు
రూ. 1.13 కోట్లు స్వాధీనం
ఖైరతాబాద్: పాతనోట్లు మార్చేందుకు యత్నించిన ఇదరిని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వైజాగ్‌కు చెందిన మంజుల, కృష్ణా జిల్లాకు చెందిన గౌరీశంకర్ గుప్తా ఒక కోటి 13 లక్షల రద్దయన పాత నోట్లను నగరానికి తీసుకువచ్చి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మార్చేందుకు వచ్చారు. పక్కా సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

కొత్తవాటికి పాత అడ్డంకులే!
ముందుకు సాగని
డబుల్ బెడ్ రూం పనులు
స్థలాలను కొనుగోలు
చేసేందుకు ప్రయత్నాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్: స్వరాష్ట్రం స్వపరిపాలనలోనూ జిహెచ్‌ఎంసి అధికారులు పనితీరులో మార్పు రాలేదు. ముఖ్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగరంలో నెలకొన్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన పలు కొత్త ప్రాజెక్టులు ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల నిర్లక్ష్యం కారణంగా వెనకబడిపోతున్నాయి. అయితే నగరంలో సమస్యలు పేరుకుపోయేందుకు నిన్న మొన్నటి వరకు ఆంధ్రాపాలకులే కారణమన్న ఆరోపణ ఉన్నా, ఇపుడు కొత్త రాష్ట్రం ఏర్పడి సుమారు మూడేళ్లు గడిచినా, జిహెచ్‌ఎంసిలోని ఒక్క విభాగం పనితీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం గమనార్హం. ఎన్నో ఆశలతో, ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ప్రజలకు లబ్ది చేకూర్చేందుకు, ట్రాఫిక్, ప్రజారవాణా వ్యవస్థ, వౌలిక వసతుల పరంగా మెరుగై సేవలందించేందుకు చేపట్టిన ఎస్‌ఆర్‌డిపి, ఆధునిక మార్కెట్లు, పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు డబుల్ బెడ్ రూం స్కీం వంటి పథకాలను ప్రారంభించినా, తొలుత ఆర్భాటమే తప్పా, ఆ మాత్రం పథకాల అమల్లో పెద్దగా చెప్పుకోదగిన అభివృద్ధి ఏమీ లేకపోవటం గమనార్హం. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే గాక, కార్పొరేషన్ ఆవిర్భవించిన నాటి నుంచే జిహెచ్‌ఎంసి నగరంలో ఏ ప్రాజెక్టును చేపట్టినా, స్థల సేకరణ అనేది ప్రధాన సమస్యగా మారింది. ఎలాగోలాగ స్థలసేకరణ పూర్తి చేసిన తర్వాత పనుల కేటాయింపులు, పనుల్లో నాణ్యత వంటివి అడ్డంకులు వరుసగా ఎదురుకావటంతో గడిచిన రెండు దశాబ్దాల్లో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పవచ్చు. ఇందుకు మూసీ ప్రక్షాళన, చార్మినార్ పాదచారుల క్షేత్రం వంటి ప్రాజెక్టులు ముఖ్యమైన ఉదాహరణలు. ఇక కనీసం టెండర్లకు కూడా నోచుకోని పనులెన్నో ఉన్నాయి.
ఇందులో అప్పట్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులుండగా, ఇపుడు ఆ ప్రాజెక్టుల జాబితాలో డబుల్ బెడ్ రూం స్కీం కూడా చేరింది. నగరంలో ప్రభుత్వ భూములెన్నో ఉన్నా, శివార్లలో ఈ ఇళ్లకు స్థలాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
‘ట్రబుల్’లో డబుల్ బెడ్ రూం స్కీం
సొంతిల్లు లేని పేదల కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం స్కీం ప్రస్తుతం ట్రబుల్స్‌ను ఎదుర్కొంటుంది. 2019 సంవత్సరం చివరికల్లా నగరంలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఈ స్కీం అమలు కేవలం ఐడిహెచ్‌కాలనీకే పరిమితమైందంటూ ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఒక అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కి
నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు మెయిన్‌రోడ్లు, జంక్షన్లలో ఎలాంటి ఆటంకాల్లేకుండా సిగ్నల్స్ లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) కింద చేపట్టిన పనులు ప్రభుత్వం, అధికారులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. వీటిలో ముఖ్యంగా కెబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లు, ఎల్బీనగర్‌లో నాలుగు జంక్షన్లు, ఉప్పల్ నుంచి రసూల్‌పురా మధ్యలో రెండు జంక్షన్లు, మైండ్ స్పేస్ టు జెఎన్‌టియు మధ్య నాలుగు జంక్షన్లతో మొత్తం 16 జంక్షన్ల అభివృద్ధికి అయిదు ప్యాకేజీలుగా టెండర్లను చేపట్టారు. ఇందులో కెబిఆర్ పార్కు చుట్టు చేపట్టాల్సిన పనులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు కొలిక్కిరాలేదు. ప్రస్తుతం మైండ్ స్పేస్ నుంచి జెఎన్‌టియు వరకు అండర్ పాస్ పనులు కాస్త వేగంగానే జరుగుతున్నాయి. వీటితో పాటు బహద్దూర్‌పురా మల్టీలెవెల్ ఫ్లై ఓవర్ పనులను, ఎల్బీనగర్‌లో నాలుగు జంక్షన్ల అభివృద్ధి పనులు నేటికీ ప్రారంభం కాకున్నా, కనీసం స్థల సేకరణ మొదలుకాకపోయినా ఈ పనులను వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు.
స్థల సేకరణ ఎపుడు జరుగుతుందో?
అయిదు ప్యాకేజీలుగా 16 జంక్షన్లను అభివృద్ధి చేయాలన్న ఎస్‌ఆర్‌డిపి పనులకు స్థల సేకరణ ప్రక్రియ ఎపుడు పూర్తవుతుందోనన్న ప్రశ్నకు అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాధానం లేదు. బయోడైవర్శిటీ పార్కు జంక్షన్‌లో నిర్మించే మల్టీలెవెల్ ఫ్లై ఓవర్‌కు 15 ఆస్తుల నుంచి, ఓవైసీ ఆసుపత్రి జంక్షన్ వద్ద 11 ఆస్తులు, బహద్దూర్‌పురా ఫ్లై ఓవర్ కోసం 58 ఆస్తులు, ఎల్బీనగర్ బైరామల్‌గూడ జంక్షన్ అభివృద్ధి కోసం 31 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించాల్సి ఉన్నా, వీటిలో బయోడైవర్శిటీ పార్కు జంక్షన్ స్థల సేకరణ కోసం ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎల్బీనగర్‌లో స్థల సేకరణకు డజన్ల సంఖ్యలో ఉన్న ప్రముఖుల విగ్రహాలను తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది.
కంచన్‌బాగ్‌లో కూడా జంక్షన్ అభివృద్ధి, మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లకు స్థల సేకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించాలని మజ్లిస్ శాసన సభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇక్కడ చేపట్టాల్సిన పనుల తాలుకూ టెండర్లను ఇప్పటికే ఖరారు చేసినా, పనులను అప్పగించకపోవటంతో గుతె్తైదారు సంస్థ డైలమాలో ఉంది. ఈ ప్రతిపాదన రద్దు అయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. రేపే రంగారెడ్డి జడ్పీ
సర్వసభ్య సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్: జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జడ్పీ ఇన్‌చార్జ్ సిఇఓ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపిపిలు ఇతర ప్రజాప్రతినిధులు, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను సమావేశానికి తీసుకొని హాజరుకావాలని ఆయన సూచించారు.

సామూహిక అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్
జీడిమెట్ల: మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం జీడిమెట్ల పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ ఎసిపి గోవర్దన్, సిఐ శంకర్‌రెడ్డి వెల్లడించారు. రోడామిస్ర్తినగర్‌లో నివాసముండే మహ్మద్ ముక్తార్ అలియాస్ హడ్డు అలియాస్ లడ్డూ(28) కూరగాయలను విక్రయిస్తుంటాడు. షాపూర్‌నగర్, వివేకానందనగర్‌లో నివాసముండే మహ్మద్ ఇసాక్ అలియాస్ డాన్ ఇసాక్(32) మెకానిక్. వివేకానందనగర్‌లో నివాసముండే ఇంద్రపాల్ అలియాస్ మంత్రి(22) ఐస్‌క్రీమ్స్ అమ్ముతుంటాడు. దూలపల్లి గ్రామంలో నివాసముండే మంత్రకుట్టి లక్ష్మన్‌రావు అలియాస్ లక్ష్మన్ (27) వెల్డర్. ముక్తార్‌పై మూడు కేసులు, ఇసాక్‌పై ఆరు కేసులు, లక్ష్మన్‌రావుపై ఏడు పాత కేసులు ఉన్నాయి. గండిమైసమ్మలో నివాసముండే 24 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ మహిళ కూలీ పనులు చేస్తుంది. భర్తతో కలిసి ప్రతి రోజూ షాపూర్‌నగర్‌కు వచ్చి కూలీ పనులు చేసుకుని వెళ్తుంటారు. ఈనెల 13న రోజూ మాదిరిగానే భార్యాభర్తలు ఇద్దరూ షాపూర్‌నగర్‌కు వచ్చి కూలీ పనులు ముగించుకున్నారు.
భర్త మద్యం సేవించేందుకు ఎంజె వైన్స్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం సేవించి వస్తుండగా అతన్ని ముక్తార్, ఇసాక్, ఇంద్రపాల్ ఆటోలో వెంబడించి మహిళ, సిద్దు వద్ద ఆటోను నిలిపి బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. షాపూర్‌నగర్‌లోని హెచ్‌ఎంటి ఖాళీ ప్రదేశంలోకి తీసుకువెళ్లిన ముగ్గురు లక్ష్మన్‌రావుకు ఫోన్ చేసి అక్కడికి పిలిచారు. నలుగురు కలిసి అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు పాతనేరస్థులైన ముక్తార్, ఇసాక్, ఇంద్రపాల్, లక్ష్మన్‌రావును అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాలను అంగీకరించిన నిందితులను రిమాండ్‌కు తరలించారు.
యువకునిపై దాడి చేసిన
ఆరుగురు నిందితుల అరెస్ట్
యువకుని పై దాడి చేసి సెల్‌ఫోన్, నగదును ఎత్తుకెళ్లిన ఆరుగురు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జగద్గిరిగుట్ట పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ ఎసిపి గోవర్దన్, సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. టోలిచౌకీకి చెందిన వసీమ్ సయ్యద్ నరుూమ్ (24) ఓలా క్యాబ్ డ్రైవర్. జగద్గిరిగుట్ట, పాపిరెడ్డినగర్‌లో నివాసముండే మంజల హనుమయ్య (21) జిహెచ్‌ఎంసి వర్కర్. ఆస్‌బెస్టాస్ కాలనీలో ఉండే అబ్దుల్ అజర్ (22) ఫ్లెక్సీ ప్రింటింగ్ పని చేస్తాడు. ఆస్‌బెస్టాస్ కాలనీకి చెందిన షేక్ జుబేర్ (22) ఐటిఐ విద్యార్థి. పాపిరెడ్డినగర్‌కు చెందిన కనుమూరి నవీన్ వర్మ (23) బిటెక్ విద్యార్థి. పాపిరెడ్డినగర్ నివాసి మహ్మద్ వజీద్ (23) క్యాబ్ డ్రైవర్. ఆస్‌బెస్టాస్ కాలనీలో నివాసముండే బి.సాయినాథ్ ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 8న అర్థరాత్రి 12 గంటల సమయంలో సాయినాథ్ ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతున్నాడు. నరుూమ్, హనుమయ్య, అజర్, జుబేర్, నవీన్ వర్మ, వజీద్ వచ్చి సాయినాథ్‌ను కొట్టి వివో సెల్‌ఫోన్, రూ.500 నగదును లాక్కొని మోటార్ సైకిళ్లపై పరారయ్యారు. సాయినాథ్ ఫిర్యాదులో పేర్కొన్న ఎపి 28 బిఎక్స్ 9195 గల ఆక్టివా వాహనం నెంబర్ ద్వారా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి వివో సెల్‌ఫోన్, రూ.500 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

కాప్రా తహశీల్దార్‌పై దాడి
* దాడికి పాల్పడిన వ్యక్తిపై పిడి యాక్ట్: కలెక్టర్
కుషాయిగూడ: ప్రభుత్వ భూములను ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని పిడి యాక్ట్ నమోదు చేయిస్తామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి హెచ్చరించారు. కాప్రా మండలం పరిధి జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ సంతోష్‌నగర్‌లో సర్వే నెంబర్ 423 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా తహశీల్ధార్ గౌతమ్‌కుమార్‌పై దాడి చేసిన స్వామినందన్‌పై పిడి యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల అక్రమణలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహార్‌నగర్ గ్రామా పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 423లో అక్రమ నిర్మాణం చేస్తున్నట్లు ప్రజలు ఫిర్యాదు చేయడంతో విఆర్‌ఓ, రెవెన్యు సిబ్బంది జెసిబి సహాయంతో కూల్చివేస్తుండగా దాడి చేసి దుర్భాషలాడినట్లు తెలిపారు. రెవెన్యు సిబ్బంది సెల్‌ఫోన్లు లాక్కొని దాడి చేయడంతో జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గౌతమ్ పేర్కొన్నారు.

సేవా భారతి పురస్కారాలు ప్రదానం

కాచిగూడ: స్వరమాధురి సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రథమ వార్షికోత్సవం తెలంగాణ టూరిజం సహకారంతో వివిధ రంగల్లో ప్రముఖులకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని వివిధ రంగల్లో ప్రముఖులు డా.కె.్భస్కర్ రెడ్డి, డా.వాసుదేవ రెడ్డి, డా.కేతవరపు రాజ్యశ్రీ జీవిత సాఫల్య జాతీయ సమైక్యత పురస్కారాలు మోహన్‌కుమార్, శశిబాల, శంకర్, రేణుక, మాధవికి సేవాభారతి పురస్కారాలను ప్రదానం చేశారు. స్వరమాధురి సంస్థ దిగ్విజయంగా ప్రధమ వార్షికోత్సవాలు జరుపుకోవాడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. వివిధ రంగల్లో ప్రముఖులను గుర్తించి వారికి పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమని చెప్పారు. ముందుగా అంజి - సాయిపావని నిర్వాహణలో సినీ సంగీత విభావరి అందరిని అలరించింది. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించగా ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానా శాస్ర్తీ, వై.రాజేంద్ర ప్రసాద్, లయన్ జయప్రకాశ్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు సాయిపావని, అంజి తాండూరి, కోశాధికారి సురేష్ పాల్గొన్నారు.

దేవాదాయ భూములు కబ్జా చేస్తే చర్యలు
రాజేంద్రనగర్: దేవాదాయ శాఖకు చెందిన భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆక్రమణలుంటే, అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖ భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ శ్రీ అనంత పద్మనాభ ఆలయ భూములను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి చెందిన భూముల అన్యాక్రాంతంపై మీడియాలో వచ్చిన వార్తలు, ఫిర్యాదులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందించారు. దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో భూములను పరిశీలించారు. అన్యాక్రాంతంపై దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు ఇస్తే కొందరు కోర్టును ఆశ్రయించారని అన్నారు. త్వరలోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట రాజేంద్రనగర్ ఆర్డీవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు.

ఆరోగ్య తెలంగాణ సాధనకు కృషి
రాజేంద్రనగర్: ఆరోగ్య తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయి తట్టు, రుబెల్లా టికాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేశంలో గతంలో పోలియో, మసూచీ మహామ్మారిలను తరిమివేసిన తరహాలో తట్టు, రుబెల్లా వ్యాధిని శాశ్వతంగా తరిమివేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో రెండు ఫేస్‌లో తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వేలాది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. జిల్లాలో 706861 మందికి టీకాలను 2744 మంది సిబ్బందితో వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా వైద్యాన్ని కోట్లాది నిధులతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి నిర్మల్‌కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లారెడ్డి పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
కెపిహెచ్‌బికాలనీ: మీజిల్స్, రుబేల్లా వ్యాధుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. గురువారం కూకట్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రూబేలా టీకా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పన్నాల కావ్య హరీష్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ప్రాణంతక వ్యాధులు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చిన్నారులు అనారోగ్యాలకు గురైతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు.
మేడ్చల్: పిల్లలకు ప్రాణాంతకమైన వ్యాధుల నుండి రక్షించేందుకు మీజిల్స్, రుబెల్లా టీకాలను విధిగా వేయించాలని మేడ్చల్ ఎంపిపి విజయలక్ష్మి, జడ్పీటిసి శైలజ హరినాథ్, తహశీల్దార్ విష్ణువర్దన్ రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మీజిల్స్, రుబెల్లా వ్యాధుల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసి ప్రారంభించారు. తొమ్మిది నెలల పిల్లల నుండి 15ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా తట్టు-పొంగు టీకాలను వేయించాలని సూచించారు. గతంలో వ్యాక్సినేషన్ చేసుకున్న చిన్నారులకు కూడా టీకాలు వేయించవచ్చని తెలిపారు. మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ బడుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. టీకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంటడల వైద్యాధికారి పద్మావతి పేర్కొన్నారు.
అమనగల్లు: ప్రాణంతకమైన తట్టు, రుబెల్లా వ్యాధిని తరిమికొట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి పిలుపునిచ్చారు. అమనగల్లు అరబిందో స్కూల్‌లో ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వేర్వేరుగా విద్యార్థులకు తట్టు, రుబెల్లా వ్యాధి నివారణ టీకాలను వేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి వేర్వురుగా మాట్లాడుతూ తట్టు, రుబెల్లా వ్యాధిని పూర్తిగా తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి మహ్మద్ అబ్దుల్ అజీం, వైద్యాధికారులు జనేద్ హైమాద్, రాకేష్ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

అశ్రునయనాలతో సింగిరెడ్డి అంత్యక్రియలు
హైదరాబాద్, సైదాబాద్: అనారోగ్యంతో బాధపడతూ మృతిచెందిన మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు గురువారం సాయంత్రం అశ్రునయనాలతో ముగిసాయి. సైదాబాద్‌లోని నివాసంలో ఉంచిన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పార్ధివదేహానికి డిప్యూటీ సిఎం మహమూద్ అలి, మంత్రి హరీష్‌రావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపిలతో పాటు టిఆర్‌ఎస్ కార్యకర్తలు, పార్టీలకతీతంగా వేలాది సంఖ్యలో కార్యకర్తలు నివాళి అర్పించారు. అమెరికా నుంచి వచ్చిన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సైదాబాద్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో అంతిమ యాత్రను నిర్వహించారు. అనంతరం సింగిరెడ్డి మృతదేహాన్ని మాజీ ఎంపి మధుయాష్కి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ వెంకటేష్ ప్రత్యేక వాహనంపై ఎక్కించి స్థానిక ఎర్రగంట శశ్మాన వాటిక అంతిమ యాత్ర నిర్వహించారు. సింగిరెడ్డి మృతదేహానికి కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు నివాళి అర్పించారు. అంతిమ యాత్రలో పలువురు పార్టీ కార్యకర్తలు, మహిళలు, సన్నిహితులు పాల్గొన్నారు. సాయంత్రం 7గంటలకు శ్మశాన వాటికకు అంతిమయాత్ర చేరుకుంది. అంత్యక్రియల ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, డిప్యూటీ సిఎం కొడుకు ఆజమ్ అలీ నేరుగా పర్యవేక్షించారు. వీటితో పాటు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్‌ఎంసి అధికారులు విజయ్ కుమార్, పాషాఖాద్రీ, విజయ్‌సాయి, ఇంజనీర్ మల్లికార్జున్, కార్మిక సంఘం నేత అమరేశ్వర్ ఉన్నారు. సింగిరెడ్డి అంత్యక్రియలు సందర్భంగా సైదాబాద్ డివిజన్‌లోని అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. ఉదయం నుంచే వ్యాపారులంతా షాపులను బంద్ చేసి సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంతిమయాత్ర ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. పలువురి విఐపిల రాక సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నియంత్రించేందుకు పోలీసులు చంచల్‌గూడ చౌరస్తా, ఇఎస్ సదన్ చౌరస్తాల మద్య ట్రాఫిక్‌ను అనుమతించ లేదు.
సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలకు ముందు అతని నివాసంలో ఉంచిన పార్దీవదేహాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళి అర్పించారు. తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, బలాల, తీగల కృష్ణారెడ్డి, ఆర్.కృష్ణయ్యలతో పాటు ఎన్‌టిఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, హరికృష్ణ, మాజీ మంత్రులు దానం నాగేందర్, ఉమా మాధవరెడ్డి, పెద్దిరెడ్డి, కృష్ణ యాదవ్, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస రావు నివాళి అర్పించారు.

నూనెగింజల పంటలపై సమీక్ష
రాజేంద్రనగర్: హైదరాబాద్‌లో కుసుమ, అవిస పంటలపై మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక సమావేశం గురువారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణరాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఆయిల్ సీడ్స్ పల్సెస్) డాక్టర్ ఎస్‌కె చతుర్వేది ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలో నూనెగింజల పంటలైన కుసుమ, అవిసల సాగు విస్తీర్ణం, తక్కువగా ఉందని, అదిక నూనె దిగుబడినిచ్చే రకాలను రూపొందిస్తే రైతులు ఈ పంట సాగుపై మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. దేశంలో కుసుమ, అవిస పంటల సాగు, వాటిపై జరుగుతున్న పరిశోధనల ప్రగతి వంటి పలు విషయాలను భారతీయ నూనెగింజల పరిశోధనా కేంద్రం సంచాలకుడు డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ రెడ్డి, అవిస పంటలపై అఖిల భారత సమన్వయ పరిశోధనా పథకం సమన్వయకర్త డాక్టర్ పికె సింగ్ వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ రాజిరెడ్డి స్వాగతం పలుకగా, డాక్టర్ సుధాకర్ వందన సమర్పణ చేశారు. అవిస, కుసుమ పంటలపై దేశంలోని వివిధ ప్రాంతాలలో చేస్తున్న పలువురు శాస్తవ్రేత్తలు సమావేశంలో పాల్గొంటున్నారని వెల్లడించారు.

డ్రగ్ మాఫియాను యువత తరిమికొట్టాలి: ఎఐవైఎఫ్
ఉప్పల్: డ్రగ్ మాఫియాను యువత తరిమికొట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి రాములు యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం మేడిపల్లిలో ఎఐవైఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాసంస్థలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డ్రగ్ మాఫియా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఐలయ్య మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడిచేవిధంగా ఎఐవైఎఫ్ కార్యకర్తలు చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్ నాయకులు రొయ్యల కృష్ణమూర్తి, మహేష్, సిహెచ్.మాధవి, బాల్‌రాజు, సోమాచారి, రాణి, నర్మద పాల్గొన్నారు.

విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలకుండా వ్యాక్సిన్‌లు: వివేక్

జీడిమెట్ల: విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా రుబెల్లా వ్యాక్సిన్‌లను వేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్‌లోని త్రివేణి కిడ్స్ స్కూల్‌లో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా రుబెల్లా వ్యాక్సిన్‌ను వివేక్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైందంటే చిన్నారులకు సీజనల్ వ్యాధులు సోకి ప్రమాదాల బారిన పడతారని, ముందు జాగ్రత్త చర్యగా టీకాలను వేయాలని అన్నారు. తట్టు, పొంగు (రుబెల్లా) వంటివి అంటువ్యాధులని, వీటిపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలని చెప్పారు. ఈ వ్యాధులు ప్రాణాంతకమైనవి కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నారులకు జ్వరం, జలుబు వంటి చిన్న వ్యాధులు సోకినా సరే అలసత్వం ప్రదర్శించకుండా వైద్యులను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గౌరీష్, ప్రభుత్వ వైద్యాధికారి నిర్మల, పాఠశాల ప్రిన్సిపల్ నలిని, చక్రి, నాయకులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్‌లో..
జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మీజిల్స్, రుబెల్లా టీకాలను విద్యార్థులను వేసే కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ కెఎం పద్మ ప్రతాప్‌గౌడ్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అంటువ్యాధుల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వ్యాధుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అంటు వ్యాధులపై తల్లిదండ్రులు అవగాహనను పెంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్యాధికారులు నిర్మల, శివకుమార్, వేణుమాధవి, నాయకులు పద్మ, శ్యామల, అనిల్‌కుమార్, సుధాకర్‌గౌడ్, పుష్ప, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కులకచర్లలో రుబెల్లా టీకాలు
కులకచర్ల:విద్యార్థులకు తట్టు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా టీకాలు ఇచ్చారు. కులకచర్ల మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం ఎంపిపి గందె అరుణమ్మ ప్రారంభించారు. దేశంలో వ్యాధుల నివారణకు ప్రభుత్వాలు ముందు చూపుతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోందని.. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో విఫణి కమిటీ అధ్యక్షుడు సత్తినేని సుధాకరరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ నాగరాజు, వైద్యాధికారి మురళీకృష్ణ, ఎంపిటిసి మాలె కృష్ణ పాల్గొన్నారు.
తట్టును తరిమేద్దాం.. పొంగును పారదోలుదాం
దౌల్తాబాద్: చిన్నారులకు సోకే తట్టును తరిమేందుకు గ్రామాల్లో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని మండల వైద్యాధికారి కృష్ణయ్య సూచించారు. 9నెలల నుంచి 12 నెలల వయస్సు ఉన్న చిన్నారులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం తట్టు, రుబెల్లా టీకాలపై ర్యాలీలు అవగాహన సదస్సులు నిర్వహించారు. దీనికిగాను ముందు జాగ్రతగా తల్లిదండ్రులు వారి చిన్నారులకు ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో సంప్రదించి బాధ్యతతో పిల్లలకు టీకాలు వేయించి వ్యాధుల నుండి రక్షించాలని కొరారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు బంద్యప్ప రాజు, అశమ్మ పాల్గొన్నారు.