హైదరాబాద్

గుర్రాలపై స్వారీ..ఆరుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గుర్రాలపై స్వారీ చేస్తూ స్థానికులను భయపెడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం నగరంలోని పాతబస్తీలో సౌత్‌జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాతబస్తీలో భయభ్రాంతులకు గురిచేస్తున్న 14మంది రౌడీషీటర్లను, ఆరుగురు పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 32మంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా రెండు తల్లార్లు, 14 ఆటోలు, 70 బైక్‌లను సీజ్ చేశారు. గుర్రాలపై స్వారీ చేస్తూ, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న యువకులను కూడా అరెస్టు చేసినట్టు డిసిపి సత్యనారాయణ వివరించారు.