విజయనగరం

టెక్నాలజీతో నేరాలకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: ప్రస్తుత సమాజంలో నేరాలను నిరోధించేందుకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకొని కేసులను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉందన్నారు. గురువారం పోలీసు శిక్షణ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ న మాట్లాడుతూ ప్రస్తుతం పోలీసులు ఉపయోగిస్తున్న సిసిటిఎస్‌ఎస్, ఇ-కాప్స్, ఎల్‌ఎంఎస్, ఇ-లెర్నింగ్, క్యాట్ తదితర వాటిపై కానిస్టేబుళ్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. లేనిచో కేసుల పరిష్కారంలో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. దాంతోపాటు శిక్షణ పొందుతున్న వారికి చట్టాలపై పూర్తి పట్టు సాధించాలన్నారు. ప్రతి కేసును టెక్నాలజీతో త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాల్లో కానిస్టేబుల్‌గా నియమితులై అంచెలంచెలుగా ఎదిగి డిజిపి స్థాయిలో రిటైర్ అవుతున్నారని, అందువల్లనే ప్రతి ఒక్క కానిస్టేబుల్‌ను ఆఫీసర్‌గా అక్కడ పరిగణిస్తారని, మన దేశంలో బ్రిటీష్ పద్ధతులను ఇంకా కొనసాగించడం వల్ల వెనుకబడి ఉన్నామన్నారు. శిక్షణలో టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకునేందుకు కంప్యూటర్లు, వసతి సౌకర్యాలు కల్పించారని వివరించారు. అనంతరం ఎస్పీ పాలరాజుకు పిటిసి ప్రిన్సిపల్ రాజశిఖామణి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వి.సత్తిరాజు, డిఎస్పీలు పవన్‌కుమార్, ఆస్మా పరహీన్, సిఐలు, ఆర్‌ఐలు , ట్రైనీ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

సిఎం ఆలోచనలు ఆచరణలో పెట్టే బాధ్యత అందరిదీ
బొబ్బిలి: క్షేత్రస్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలను ఆచరణలో పెట్టే బాధ్యత అధికారులపై ఉందని, ఇందుకు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన ఆవస్యకత ఉందని రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. స్ర్తినిధి పథకం ద్వారా 72 గ్రూపులకు కోటి 28లక్షల రూపాయల మొత్తాన్ని చెక్కుల రూపంలో స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి చేర్చేబాధ్యత అధికారులపై ఉందన్నారు. స్ర్తినిధి ద్వారా పెద్ద ఎత్తున రుణాలు అందించే ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలు పొందే అవకాశం ఉం దన్నారు. సక్రమంగా స్ర్తినిధి మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికపరిపుష్టిని, జీవనవిధానాన్ని మార్పుచేసుకోవచ్చునని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘాలకు బ్యాంకులే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను జారవిడుచుకోకుండా సద్వినియోగం చేసుకుని మెరుగైన జీవనాన్ని పొందాలని కోరారు. ప్రభుత్వం నుంచి పొందుతున్న రుణాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోకుండా ఆర్థికాభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టిని పెంచుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. స్ర్తినిధి పథకాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకున్న అందరికీ రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మొత్తాల ద్వారా మహిళా సంఘాలలో కుట్టుశిక్షణ పొందిన వారు యూనిఫారాలు కుట్టి అందిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు.ఈ విధంగా పొదుపు సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే బొబ్బిలిలో జ్యూట్ మిల్లు మూసివేసినప్పటికీ ఆ మహిళలు పొదుపు ద్వారా పొందిన రుణంతో స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని జీవనోపాధి సాగిస్తుండటం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో మహిళలంతా స్వశక్తిపై ఆధారపడేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టిడిపి కార్యవర్గ కార్యదర్శి తూముల భాస్కరరావు మాట్లాడుతూ మహిళలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం స్ర్తినిధి ద్వారా రుణ సౌకర్యం అందించడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో వెనుకబడిన మహిళలు ఆర్థిక పరిపుష్టిని సమకూర్చుకునేందుకు ముందుకు వస్తే తనవంతు సహాయంగా ఒక్కొక్క గ్రూపునకు 5లక్షల రూపాయల వంతున సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కోటి రూపాయల వరుకైన అర్హత ఉన్న మహిళా సంఘాలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. పురపాలక సంఘం చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్ర్తినిధి జిల్లా అధికారులు, ఐకెపి అధికారులతోపాటు టిడిపి పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్, వైస్ చైర్మన్ సిహెచ్ రమేష్‌నాయుడు, ఐకెపి సిబ్బంది సింహాచలం, కమిషనర్ శంకరరావు, పురపాలకసంఘం వార్డు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

‘ఐదునూర్ల’తో నిండు నూరేళ్లు
ఐటిడిఎ పిఒ డాక్టర్ లక్ష్మీశ
పార్వతీపురం: ఐదు నూర్లు కార్యక్రమం ద్వారా నిండునూరేళ్లు తల్లిబిడ్డలకు అందించే బృహత్తర కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేలా ప్రజాప్రతినిధులు కూడా తమవంతు సహకారం అందించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. గురువారం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలోని గిరిమిత్ర సమావేశం హాలులో ఏర్పాటు చేసిన కొమరాడ మండల సర్పంచులు, ఎంపిటిసీల శిక్షణలో ఆయన మాట్లాడుతూ ఐసిడియస్ ఆధ్వర్యం లో నిర్వహించే ఐదునూర్లు కార్యక్రమం ద్వారా గర్భిణులకు రక్తహీనత లేకుండా చూడాల్సిన బాధ్యత తీసుకుంటున్నట్టు తెలిపారు.అయితే పాలు, గుడ్లు, శనగపప్పు ఉండలు, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ వంటివి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు అందించేందుకు వారికి ప్రోత్సహించడానికి ప్రజాప్రతినిధులు కూడా పర్యవేక్షించి రక్తహీతన నుండి గర్భిణీలు బయటపడే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్ర్తి,శిశు సంక్షేమశాఖ విభాగం ప్రాజెక్టు డైరక్టర్ ఎఇ రాబర్ట్స్, జెపిసి శ్యామ సుందరిలు మాట్లాడుతూ ఐసిడియస్ ద్వారా గర్భిణులు, చిన్నారుల విషయంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కనె్సల్టెంట్ కృష్ణారావు, సూర్యదీప్తి, ఐటిడిఎ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎంఎం రవికుమార్‌రెడ్డి, పార్వతీపురం ఐసిడియస్ ప్రాజెక్టు అధికారిణి కె.విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, గ్రామసంఘ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గిరిజనుల శ్రమ దోపిడీ
నాలుగు రోజులు శ్రమిస్తే రూ.300లు ప్రతిఫలం
మున్సిపల్ ఆశీలు లేకుండా చేయాలి: గిరిపుత్రులు
పార్వతీపురం (రూరల్): గిరిజన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. రోజంతా శ్రమించిని శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. వారి శ్రమను దళారులు పబ్లిక్‌గానే దోచుకుంటున్నప్పటికీ పాలకులు, అధికారుల స్పందన కరువవుతోంది. సరికదా వారి వద్ద నుండి ఆశీల రూపంలో వేధింపులు వేధిస్తున్నాయి. ప్రతీ గురువారం, ఆదివారం పార్వతీపురం పట్టణానికి సమీప రావికోన, బట్టవలస, బొతడాపల్లి, చీకటిలోవ, బంకిణి తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు పలు రకాల అటవీ ఉత్పత్తులను పట్టణానికి తెచ్చి అమ్మకాలు చేస్తుంటారు. వీటిలో ప్రధానంగా వెదురు, వ్యవసాయ పనిముట్లు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కలప తదితరవి తెచ్చి అమ్మకాలు చేస్తుంటారు. అయితే అడవి నుండి ఇంటికి, ఇంటి నుండి పట్టణానికి తెచ్చే ప్రక్రియకు కనీసం నాలుగు రోజులు పడుతుందని గిరిజనులంటున్నారు. తీరా పట్టణానికి దాదాపు 20 నుండి 30 కిలోమీటర్ల మేర బరువులను మోసుకొని అమ్మకానికి తెస్తే, స్థానిక దళారులు, వ్యాపారులు ఎగతాళితో కూడిన బేరాలాడి సులువుగా దక్కించుకుంటున్నారు. దీంతో గిరిజనులు తమ శ్రమ దోపిడి జరుగుతోందని వాపోతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు కనీసం ఆశీల బెడద తప్పించాలని కోరినా ఫలితం లేదని వాపోతున్నారు.

అదనపు ఆయకట్టుకు సాగునీరందించాలి
విజయనగరం:జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి అదనపు ఆయకట్టుకు సాగునీరు అం దించాలని రాష్ట్ర భూగర్భ గనులశాఖా మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు జలవనరులశాఖ ఇంజన్లీర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సాగునీటి ప్రాజెక్టు పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పనుల్లో జాప్యం నివారించేందుకు సాగునీటి ప్రాజెక్టుల క్యాలండర్‌ను రూపొందించాలన్నారు. ఏయే ప్రాజెక్టులు ఎపుడు ప్రారంభించారు, ఎప్పటిలోగా పూర్తి చేయాలి, రైతాంగానికి సాగునీరు విడుదల చేసే తేదీలను ప్రదర్శించే క్యాలండర్‌ను ప్రాజెక్టుల వద్ద ప్రదర్శించాలన్నారు. జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ తాగునీటికి ఇబ్బందులు పడటంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 1.40 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నామన్నారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సామర్థ్యం మేరకు ప్రజలకు తాగునీరు అందించేందుకు జలవనరులశాఖాధికారులు ప్రాజెక్టులను ప్రతిపాదించాలన్నారు. తోటపల్లి బ్రాంచి కెనాల్ భూసేకరణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. ఆయా ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని రెవెన్యూ, జలవనరులశాఖాధికారులను మంత్రి ఆదేశించారు.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఖరీఫ్‌కు జిల్లాలోని రైతాంగానికి అదనపు ఆయకట్టుకు నీరందించేందుకు ముందస్తు ప్రణాళికలతో జలవనరులశాఖ ఇంజనీర్లు పనిచేయాలన్నారు.జిల్లాలో నాగావళి, సువర్ణముఖీ, వేగావతి, చంపావతి నదుల అనుసంధానం పనులు 95 శాతం పూర్తయ్యాయన్నారు. జిల్లాలో చాలా కాలం క్రితం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణకు జెఐసిఎ నిధుల (జపాన్) మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిపారు. జిల్లాలో భూసేకరణకు అదనపు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జలవనరులశాఖ ఎస్‌ఇ పోస్టుల భర్తీకి సంబధిత మంత్రి హామీ ఇచ్చారని, మంత్రి సుజయ్ తెలిపారు. ఆడారిగెడ్డ ప్రాజెక్టు రిజర్వాయరు పూర్తయినా కాలువ పనులు పూర్తి కాకపోవడం వల్ల నిరుపయోగంగా ఉందన్నారు. దాంతో ఆయకట్టుకు నీరందించలేకపోతున్నారన్నారు. పెదంకలాం ఆనకట్ట షట్టర్లు పాడైనందున బాగుచేయడానికి జపాన్ నిధుల మంజూరుకు ప్రతిపాదించాలని జలవనరులశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కింద అదనంగా 5వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉండగా బొబ్బిలి కోటి చెరువు, వివిధ చెరువుల మరమ్మతులు, ఫీడర్ చెరువు ఛానల్ పనులు పూర్తి కానందున రైతాంగానికి నీరందించలేకపోతున్నారన్నారు. నీరు ప్రగతి కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. గుమ్మడిగెడ్డ ప్రాజెక్టు భూసేకరణ పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ తోటపల్లి బ్రాంచి కెనాల్ పనుల్లో కంట్రల్ బ్లాస్టింగ్ పనులు చేపట్టడానికి ఏజెన్సీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు అప్పగించాలన్నారు. పిల్ల కాలువల నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. త్వరలో జరిగే సిసిఎల్ సమావేశంలో తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టుకు సేకరించిన అటవీ భూములకు బదులు రెవెన్యూ భూమిని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటామమన్నారు. తారకతరామతీర్థసాగర్ ప్రాజెక్టు పనుల్లో టనె్నల్, కెనాల్ పనులు చేపట్టడానిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజెన్సీకి అప్పగించడానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ.130 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానిక పంపినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి, బి.చిరంజీవులు, జెసి లఠ్కర్, డిఆర్వో సాల్మన్‌రాజ్‌కుమార్ ఎస్‌ఇ త్రిమూర్తుల రాజు, ఆర్డీవోలు శ్రీనివాసమూర్తి, సుదర్శనదొర, ఎస్‌డిసిలు అనిత, బాలత్రిపురసుందరి, తోటపల్లి, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు ఎస్‌ఇ తిరుమలరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ గాయత్రిదేవి, ఇఇలు, డిఇఇలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
విజయనగరం (్ఫర్టు): పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గసభ్యులు కోరారు. సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యలపై పలువురు కౌన్సిల్‌సభ్యులు ప్రస్తావించారు. వీధిలైట్లు వెలగడంలేదని, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అర్హులైనవారికి అభయహస్తం పింఛన్లు అందించడంలేదని రొంగలి రామారావు, ఎస్‌వివి రాజేశ్వరరావు, కొర్నాన రాజ్యాలక్ష్మి తెలిపారు. అదేవిధంగా పట్టణంలో పైపులైన్ల ఏర్పా టు కోసం తవ్విన గోతులను పూడ్చకపోవడం వల్ల రాకపోకలు సాగించలేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని కౌన్సిలర్ గాడు అప్పారావుఅన్నారు. తక్షణమే గోతులను పూడ్చాలని ఆయన కోరారు. 26వ వార్డు పరిధిలో బిసి కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తగిన శ్రద్ధ చూపడంలేదని ఆ వార్డు కౌన్సిలర్ గంటా చినతల్లి తెలిపారు. ఈ సమస్యలపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు తగిన శ్రద్ధ చూపాలని చెప్పారు. మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, పట్టణ పేదరిక నిర్మూలనసంస్థ ప్రాజెక్టు అధికారి సరోజిని పాల్గొన్నారు.

జ్వరంతో విద్యార్థి మృతి
సీతానగరం: మండలంలోని జోగింపేట గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి జ్వరంతో మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలం కొదిలికుప్ప గ్రామానికి చెందిన టి గణేష్(10) స్థానిక గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 12వ తేదీన గణేష్‌కు జ్వరం రావడంతో ప్రిన్సిపల్ ఆశీర్వాదం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు గణేష్‌ను తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు తల్లిదండ్రులు పాఠశాలకు సమాచారం అందించారు. ఈవిషయం తెలుసుకున్న తహశీల్దార్ అప్పారావు పాఠశాలలో సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు.
రామాలయ నిర్మాణానికి భూమి పూజ
గరివిడి: మండలంలోని షెడ్యూల్డు తెగల నివాసగ్రామమైన ఐతాంవలసలో రామాలయ నిర్మాణానికి గురువారం ఉదయం భూమి పూజ నిర్వహించారు. మతమార్పిడల నిరోధానికి హిందూ ధర్మ ప్రచారాన్ని చేపట్టి షెడ్యూల్డు కులాలు, తెగలు నివాసం ఉంటున్న గ్రామాలలో తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయాల నిర్మాణానికి నిధులను అందజేస్తున్నది. ఇందులో భాగంగా తమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయ నిర్మాణానికి భూమిపూజతో పనులను ప్రారంభించారు. తమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మప్రచారకులు ఎం.వేణుగోపాల్ మాట్లాడుతూ టిటిడి ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్‌లో 1500 దేవాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించిందని వివరించారు. కార్యక్రమంలో మండల ప్రచారకులు పడాల నాగేశ్వరరావు, సర్పంచ్ ఎల్లంటి సంజీవి తదితరులు పాల్గొన్నారు.

పురపాలక పాఠశాలల అభివృద్ధికి చర్యలు
* చైర్‌పర్సన్ అచ్యుతవల్లి
బొబ్బిలి: పురపాలక పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం నుంచి పలు రకాలైన ప్రోత్సాహాకాలు లభిస్తున్నాయని, తద్వారా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పురపాలక పాఠశాలల విద్యార్థులు మంచి ఉత్తీర్ణతాశాతాన్ని పొందుతున్నట్లు చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. పొట్టిశ్రీరాములు పురపాలక పాఠశాలకు చెందిన సాసుబిల్లి జగదీశ్వరరావు పదోతరగతిలో 10పాయింట్లు సాధించినందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాక నగదు బహుమతిని స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు అందించారు. అలాగే పురపాలక సంఘంలో రోడ్లు విస్తరణ కార్యక్రమంలోభాగంగా ఆస్తినష్టపోయిన బాధితులకు మంత్రి సుజయ్ చేతుల మీదుగా టిడి ఆర్ బాండ్లు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పురపాలక సంఘం చైర్‌పర్సన్ అచ్యుతవల్లి మాట్లాడుతూ పురపాలక పాఠశాలలో కూడా ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈమేరకు అధిక శాతం మార్కులతో చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇదే స్ఫూర్తితో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని తెలిపారు. పురపాలక పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ కోర్సులను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన బాధితులకు టిడిఆర్ బాండ్లును అందిస్తున్నామని, దీని ద్వారా వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు కృషి ఫలితంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టి భాస్కరరావు, వైస్ చైర్మన్ సిహెచ్ రమేష్‌నాయుడు, కమిషనర్ శంకరరావు, రాంబార్కి శరత్, రామూర్తినాయుడుతోపాటు పలువురు అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు,డ్వాక్రా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

‘వ్యాధులు లేని సమాజం ప్రభుత్వ ధ్యేయం’
గజపతినగరం: వ్యాధులు లేని సమాజం ప్రభుత్వ ధ్యేయమని బొండపల్లి జడ్పీటీసీ బండారు బాలాజీ అన్నారు. గురువారం గజపతినగరంలోని చెత్త నుండి సంపద కేంద్రంలో ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని చెత్తాచెదారాలను లేకుండా ఉండడానికి ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేయడం జరుగుతుందని అన్నారు. సేంద్రీయ ఎరువులపై గ్రామాలలోని ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పారు. ఇళ్ల నుండి సేకరించిన చెత్తను వర్మీకంపోస్టుగా తయారు చేసి తిరిగి ఎరువుగా ఉపయోగించుకోవడం ద్వారా అటు పరిసరాలు పరిశుభ్రం కావడంతోపాటు ఇటు సేంద్రీయ ఎరువుగా మార్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రతి మండలంలో 4,5 చోట్ల ఇటువంటి చెత్తతో వర్మీకంపోస్టులను తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ కేంద్రాల పట్ల అవగాహన ఉంటే కేంద్రాల ఏర్పాటు లక్ష్యం విజయవంతం అవుతుందని అన్నారు. అలాగే రైతులలో కూడా సేంద్రియ ఎరువుల వలన కలిగే ప్రయోజనాలను అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో బొండపల్లి ఎంపిపి పిరిడి ఎల్లమ్మ, బొండపల్లి, మెంటాడ ఎంపిడిఒలు ప్రకాశరావు, వెంకటరావు, రిసోర్స్ పర్సన్‌లు శ్రీకాంత్, శేషుబాబు, పంచాయితీ కార్యనిర్వహణ అధికారి సుగుణాకరరావు, గ్రామ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.