శ్రీకాకుళం

ఆ నాలుగు గ్రామాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం: వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి చేపడుతున్న పనుల మూలంగా నిర్వాసితులకు పోలీసుల మధ్య కొన్ని రోజులుగా ఘర్షణల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో నిర్వాసితులు, పోలీసులకు మధ్య జరిగిన సంఘటనలో 30 మంది నిర్వాసితులు రిమాండ్‌కు తరలించారు. ఉద్యమాల్లో గార్లపాడు, తులగాం, దుగ్గుపురం, పాడలి గ్రామాలు కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించి నిఘా పెంచారు. పోలీస్ పహరా మధ్య ముమ్మరంగా రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. గురువారం ఎస్‌పి త్రివిక్రమవర్మ పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా విలేఖర్లతో ఎస్‌పి మాట్లాడారు. పాడలి, దుగ్గుపురం, తులగాం నిర్వాసితులు పోలీసుల మధ్య చోటు చేసుకున్న సంఘటనలో 49 మందిని అదుపులోకి తీసుకున్నామని, వీరిని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించామన్నారు. వృద్ధులు, మహిళలను విడిచిపెట్టడం జరిగిందన్నారు. మిగిలిన 25 మందితో పాటు దాడిలో పాల్గొన్న మరొక ఐదుగురిని కెమేరాల్లో పరిశీలించి అదుపులోకి తీసుకున్నామన్నారు. 30 మందిని పాతపట్నం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు తెలిపారు. పోలీసులపై, గుత్తేదారుల ఆస్తులపై నిర్వాసితులు దాడి చేస్తే ఊరుకొనేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్వాసితుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. మరో ఐదు నెలల వరకు ముంపు గ్రామాల్లో నివాసం ఉండే అవకాశం ఉందన్నారు. బలవంతంగా పనులు ఆపడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామన్నారు. పనులు నిరంతరం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకోసం పోలీస్ బలగాలు, పారా మిలటరీతో పాటు జోనల్ బలగాలను కూడా తీసుకొస్తున్నట్టు ఎస్‌పి తెలిపారు. భూసేకరణ సమయంలో పరిశీలించి సేకరించిన పంట భూములకు పరిహారం చెల్లించడం జరుగుతుందని, పంటలు పండించవద్దని రెవెన్యూ అధికారులు దండోరా వేయించినప్పటికీ రైతులు వరి నాట్లు వేశారన్నారు. రిజర్వాయర్ గడువులో పూర్తి చేయనున్న దృష్ట్యా పంట పొలాలను కూడా గట్లు చదును చేపడుతున్నట్టు తెలిపారు. గుత్తేదారుడు యంత్ర సామాగ్రీతో పాటు ట్రాక్టర్ల ద్వారా కూడా పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారుల నుంచి కొన్ని రోజుల్లో భూములను చదును చేసే కార్యక్రమం పూర్తి చేయడానికి ఆలోచన చేశారు.
* నాలుగు గ్రామాలే కీలకం...
వంశధార రిజర్వాయర్ మూలంగా ముంపునకు గురైన గ్రామాల్లో గార్లపాడు, దుగ్గుపురం, తులగాం, పాడలి గ్రామాలు ఉద్యమాలకు కీలకంగా ఉన్నట్టు పోలీస్‌శాఖ గుర్తించి నిఘా పెంచారు. గత కొద్దిరోజులుగా పోలీస్ బలగాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా గ్రామాల నుంచి నిర్వాసితులు తిరుగుబాటు చేయడం పోలీస్ బలగాలను కూడా మోహరింప చేశారు. తులగాం, పాడలి, దుగ్గుపురం, గార్లపాడు రహదారి కూడళ్లలో భారీ బలగాలను, ఆధునిక యంత్రాలను సిద్దం చేసి నిఘా పెంచారు. రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆర్‌డి ఒ రెడ్డి గున్నయ్య, వంశధార సి ఇ ఎం.రాజు, తహశీల్దార్ కాళీప్రసాద్, ఇ ఇ సీతారాములనాయుడు పర్యవేక్షిస్తున్నారు.

ప్రజానేతలకు..గన్‌మెన్‌లు కట్!
శ్రీకాకుళం: నిఘా నీడలో వంశధార ప్రాజెక్టు పనులు చురుకుగా నడిపించి...ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్ రోజుకి వంశ‘్ధర’ అన్నదాతలకు అంకితం చేయాలన్న తపనలో మరింత దృఢసంకల్పం కన్పిస్తోంది. మేముసైతం..అంటూ మంత్రులు, ఎం.పి., ఎమ్మెల్యేలు సైతం తమ గన్‌మేన్‌లకు హిరమండలం రిజర్వాయర్ పనుల గస్తీ విధులకు పంపేస్తామంటూ అంగీకరించడంతో అడిషనల్ డి.జి.కి ఈ సమాచారం అందించి మంత్రులు, ఎం.పి., ఎమ్మెల్యేల గన్‌మేన్‌ల్లో ఇద్దరు చొప్పున్న వంశధార పనులు అడ్డుకుంటున్న కొంతమంది నిర్వాసితులపై ఉక్కుపాదం మోపేలా గస్తీ బందోబస్తు గురువారం నుంచి పెంచడంతో గన్‌మెన్‌లు గస్తీ విధులకు హాజరైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావులతోపాటు, పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ ఛైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్, గౌతు శ్యామసుందరశివాజీ, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తిల గన్‌మెన్‌లను సిఫ్ట్‌ల్లో మార్పులు చేర్పులు చేస్తూ వారిని వంశధార నిర్వాసిత గ్రామాలైన గార్లపాడు, తులగాం, పాడలి, దుగ్గుపురం ప్రాంతాలకు గన్‌మేన్‌లకు నిఘా డ్యూటీలు వేసినట్టు బోగట్టా. ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా తమకు గన్‌మెన్‌లు లేకపోయినా ప్రజాజీవితంలో ఎటువంటి ప్రమాదం లేదని, ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేసేందుకు వీరి సేవలు ఉపయోగపడితే మంచిదేనన్న పాజిటివ్ ఆలోచనలు పోలీసుశాఖ మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం కలిగిందంటున్నారు.
ఇదిలా ఉండగా, వంశధార ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చాలా సూపర్ సమస్యాత్మక గ్రామాలుగా గార్లపాడు, తులగాం, పాడలి, దుగ్గిపురంను పోలీసు ఉన్నతాధికారులు గుర్తించి, ఆ ప్రాంతాల్లో గల నిర్వాసితుల కదలికలపై నిఘా పెంచారు. అలాగే, ఆయా గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టేవిధంగా పనిచేసే శక్తులపై ఉక్కుపాదం మోపి, అణచివేసేందుకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తనదైన శైలిలో కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నారు. ప్రజాధనానికి నష్టం వాటిల్లకుండా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా, నిర్వాసితులను కారణాలు లేకుండా ఇబ్బందులు పెట్టే దోరణీకాకుండా సమయస్ఫూర్తితో ప్రాజెక్టు పనులు రోజురోజుకీ ఫలితం కన్పించేలా చాకచక్యంగా పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు అహర్నిశలు పోలీసు సిబ్బంది కష్టనష్టాలను ఓర్చి జిల్లాను అన్నపూర్ణగా మార్చేందుకు వారివంత కూడా సహకారం చేస్తున్నామంటూ చెబుతున్నారు. ఈ విధులు నిరశాన్ని, నిరంకుశత్వాన్ని, నియంత విధులకు తావివ్వడం లేదని, ఇష్టంగానే కష్టపడుతున్నట్టు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు పలు సందర్భాల్లో చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ, ప్రాజెక్టుల పనుల కోసం బందోబస్తు అధికం చేసేందుకు ప్రజాప్రతినిధుల గన్‌మేన్‌లనే వినియోగించుకునే పరిస్థితి సిక్కోల్ జిల్లాలో ఇదే ప్రధమం! మంచి నిర్ణయం!!

సమీకృత వసతిగృహంపై ఎసిబి దాడులు
* పరారీలో సంక్షేమాధికారి * అందుబాటులోని రికార్డులు * స్వాధీనం చేసుకున్న బియ్యం
సారవకోట: స్థానిక సమీకృత బాలుర వసతిగృహంపై ఏసిబి అధికారులు గురువారం ఉదయం దాడులు జరిపారు. ఏసిబి డీఎస్పీ కరణం రాజేంద్ర నాయకత్వంలో ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉదయం 6:30గంటలకే వసతిగృహానికి చేరుకున్నారు. ఆ సమయంలో సంక్షేమాధికారి సింహాచలం వసతిగృహంలో లేరు. వసతిగృహంలో 336మంది విద్యార్థులకు గాను 162మంది మాత్రమే ఉన్నట్లు డీఎస్పీ రాజేంద్ర విలేఖర్లకు తెలియజేశారు. ఒక వసతిగృహంలో ఏకంగా 174మంది విద్యార్థులు గైర్హాజరు కావడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వసతిగృహం నుండి బయటకు తరలించిన 250 కిలోల బియ్యంను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా వసతిగృహం సంక్షేధికారిని గాని, పాలకొండ సహాయ సంక్షేమాదికారి కాని వచ్చిన తరువాత రికార్డు గది, సరుకులు నిల్వ ఉంచిన గది తాళాలు తీయడానికి ఏసిబి డీ ఎస్పీ సుమారు 3:30గంటల పాటు వసతిగృహంలో వేచియుండాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు 10 గంటల సమయంలో పాలకొండ సాంఘీక సంక్షేమ సహాయాధికారి ప్రేమభూషణం హాజరు కావడంతో తాళాలను బద్దలుకొట్టారు. అయితే వసతిగృహంలో 18రికార్డులకు గాను అతిముఖ్యమైన విద్యార్థుల హాజరు పట్టి , స్టాక్ రిజిస్ట్రార్లు అందుబాటులో లేవని డీఎస్పీ రాజేంద్ర విలేఖర్లకు తెలియజేశారు. ఈ వసతిగృహంలో విద్యార్థులకు పెట్టవలసిన ఆహార పదార్థాలను అనధికారికంగా వసతిగృహంలో పనిచేస్తున్న వ్యక్తులు అమ్ముకుంటున్నట్లు తమ దర్యాప్తు తేటతెల్లమైందన్నారు. ఈ వసతిగృహంలో గతంలో పనిచేసిన సీతారాం, ఈశ్వరరావు, సింహాచలంలను ఔట్ సోర్సింగ్ విభాగానికి తిరిగి పంపించారు. ఈ ఏడాది జూలై 1 నుండి ఈ ముగ్గురును వసతిగృహం నుండి తొలగించారు. అయినప్పటికీ అనధికార వ్యక్తిగా కొనసాగుతున్న సీతారాం వసతిగృహంలో అన్నింటా తానై చెలామణి కావడం పట్ల డీఎస్పీ రాజేంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏఎస్‌డబ్ల్యూవో ప్రేమభూషణంను ఆయన నిలదీశారు. వసతిగృహాన్ని తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు గమనించలేదని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా వసతిగృహంలో శాశ్వత ఉద్యోగిగా పనిచేస్తున్న బలివాడ వెంకటేష్ కూడా వసతిగృహంలో లేనట్లు తాము గుర్తించామని ఏసిబి అధికారులు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు అనధికార వ్యక్తిగా ఉన్న సీతారాం ఇంటిలో బియ్యం కోసం సోదాలు చేయగా ఆ ఇంటి పక్కనే ఉన్న జలుమూరు బాబూరావు అనే వ్యక్తి ఇంటిలో వసతిగృహానికి సంబంధించిన 250 కిలోల బియ్యం లభ్యం కాగా వసతిగృహానికి ఈ బియ్యంను తరలించి ఏఎస్‌డబ్య్లూవో ప్రేమభూషణంకు అప్పగించినట్లు వివరించారు. గతంలో ఈ వసతిగృహం నిర్వహణపై సారవకోట గ్రామానికి చెందిన సూర్యనారాయణ, నూతనపాటి బెనర్జీ జిల్లా గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామని గ్యాస్, బియ్యం దుర్వినియోగం అవుతున్నట్లు నాడు ఫిర్యాదుదారుడు రాత పూర్వకంగా తెలియజేయగా జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు ఏసిబి డీఎస్పీ రాజేంద్ర అడిగిన ఒక ప్రశ్నకు ఏఎస్‌డబ్య్లూవో ప్రేమభూషణం సమాధానమిచ్చారు. వరుసగా నాలుగు రోజుల సెలవు తరువాత కూడా బుధవారం వసతిగృహానికి సంక్షేమాధికారి సింహాచలం ఎటువంటి అనుమతులు లేకుండా గైర్హాజరయ్యారని అదేవిధంగా వరుసగా రెండవ రోజు కూడా గురువారం వసతిగృహానికి హాజరు కాలేదని డీఎస్పీ స్పష్టంచేశారు. కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడం వలన సంక్షేమాధికారి సింహాచలం నుండి వివరణ సేకరించకపోయినట్లు ఆయన స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా తమ బృందం ఉదయం 6:30గంటలకు వసతిగృహానికి చేరుకున్న సమయానికి స్థానికులైన బయటి వ్యక్తులు వసతిగృహంలో బాత్రూమ్‌లు, మరుగుదొడ్లను వినియోగిస్తున్నట్లు తాము గమనించామని ఈ విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎస్‌డబ్య్లూవో ప్రేమభూషణం వద్ద విద్యార్థులు గైర్హాజరు విషయంమై అడుగగా వరుసగా సెలవులు రావడంతో వసతిగృహానికి హాజరు కాలేదని వివరణ ఇచ్చారు. అనధికార వ్యక్తుల అజమాయిషీ గురించి విలేఖర్లు ప్రస్తావించగా వసతిగృహం సంక్షేమాధికారి తన అభీస్టంమేరకు వీరిని కొనసాగిస్తున్నారని వివరణ ఇవ్వడం విశేషం.

కిలిమంజారోపై సిక్కోలు సత్తా
శ్రీకాకుళం(రూరల్)/కొత్తూరు: ఆఫ్రికా ఖండం టాంజానియాలో అతి ఎతె్తైన కిలిమంజారో పర్వతాన్ని జిల్లాకు చెందిన మామిడి వెంకటరమణ, ఆర్.చిన్నమ్మలు బృందం అధిరోహించి సిక్కోల్ ఖ్యాతిని దేశ ప్రతిష్టతను చాటి చెప్పారు. భూత్ అండ్ బ్రియన్స్ సంస్థ తరఫున ఈ నెల 10న ప్రారంభించిన పర్వతారోహణ 15న సాయంత్రానికి 19,341వేల అడుగుల ఎత్తులో శిఖరాగ్రామానికి పది మంది బృందం చేరుకుని 600 చదరపు అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లాలోని కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన మామిడి రమణ, వంగర మండలం మరువాడకు చెందిన గేదెల చిన్నమ్మ కిలిమంజారోను అధిరోహించి సిక్కోలు యువశక్తిని చాటిచెప్పారు. శుక్రవారం రాత్రికి ఈ బృందం కిందకి దిగుతున్నట్లు తెలియజేశారు. అటు దేశ ప్రతిష్టతను, జిల్లా ఖ్యాతిని చాటి చెప్పిన మామిడి వెంకటరమణ, చిన్నమ్మలను సాహసాన్ని సాధించిన విజయం పట్ల సామాజిక కార్యకర్త గీతా శ్రీకాంత్, సిక్కోలు యువశక్తి ప్రతినిధి అనె్నపు సందీప్, ఆధ్యాత్మిక వేత్త తెరంబూరు సూరిబాబు, సిక్కోలు యువశక్తి ప్రతినిధి సందీప్, టిడిపి నగర అధ్యక్షుడు వెంకటేష్, డేవిడ్‌లు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలో వర్షాలు
శ్రీకాకుళం(రూరల్): జిల్లాలో గురువారం అత్యధికంగా పోలాకి మండలంలో 66.4 రణస్థలం మండలంలో 38మి.మిల వర్షపాతం నమోదైంది. జి.సిగడాంలో 18.4, రాజాంలో 7.6, పాలకొండ 15.2, సీతంపేట 10.4, భామిని 28.4, కొత్తూరు 24.4, హిరమండలం 23.4, సరుబుజ్జిలి 12.4 మి.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 12.2, గారలో 37, సారవకోటలో 6.4, పాతపట్నంలో 8.4, మెళియాపుట్టి 9.8, వజ్రపుకొత్తూరు 14.8. పలాస 36.8, మందస 20.2, ఇచ్ఛాపురం 30.4, ఎల్ ఎన్ పేట 9.4 మి.మీల వర్షపాతం నమోదైంది.
రూ.23కోట్లతో గ్రామాల్లో సిసి రోడ్లు
* ఎమ్మెల్యే రమణమూర్తి
నరసన్నపేట: నియోజకవర్గంలో మండలంలోని ప్రతీ గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం నరసన్నపేట మేజర్ పంచాయితీలోని తిరుమల వీధిలో రూ.2లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు నిర్మాణ ప్రారంభోత్సవానికి ఆయన విచ్చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని రూ.23కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో సీసి రోడ్ల నిర్మాణానికి కేటాయించినట్లు వివరించారు. ఇవి త్వరలోనే పూర్తవుతాయని స్పష్టంచేశారు. అంతేకాకుండా నరసన్నపేట మేజర్ పంచాయతీలో భూగర్భడ్రైనేజీల కోసం రూ.6కోట్లను కేటాయించడం జరిగిందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్టిబాబు, ఎంపిటీసీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
‘దళితులను అవమాన పరచడం టిడిపి ప్రభుత్వానికి అలవాటే..’
శ్రీకాకుళం(రూరల్): దళితులు, గిరిజనులపై టిడిపి ప్రభుత్వం అవమాన పరిచేలా మాట్లాడటం వారిని పరిపాటి అయిందని కాని చంద్రబాబునాయుడు చేసే వ్యాఖ్యలు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా అని అన్నారని వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. చులకన భావం ఎంత ఉందో అర్థవౌతుందని తెలియజేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి దళితుల పట్ల చిన్న చూపుతో మాట్లాడే తీరు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న చందంగా టిడిపి పాలన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు దళితులను అవమానించి మాట్లాడటం, మంత్రులు అదే కోవలో దళితులను అవమానిస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులపై చిన్న చూపు ఉండదానికి ఇదే నిదర్శనమన్నారు. వైకాపాలో గెలిచి టిడిపికి అమ్ముడుపోయిన చరిత్ర ఉన్న ఆదినారాయణరెడ్డి దమ్ము దైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో తలపడాలని డిమాండ్ చేశారు. దళితులకు ఓట్లు అడిగే హక్కు మంత్రికి, ముఖ్యమంత్రికి నైతిక హక్కు లేదని ఆమె అన్నారు. దళితులు శుభ్రంగా ఉండరని, సక్రమంగా చదువుకోరని అంటూ మంత్రి స్థాయిలో ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ప్రతీ మనిషిలో ప్రవహించే రక్తం ఒకే రంగులో ఉంటుందని మంత్రికి తెలియదా అని పేర్కొన్నారు. దళిత వ్యతిరేక విధానాలతో రాజ్యాంగ విరుద్ధంగా అపహాస్యం చేసిన టిడిపి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని దళిత ద్రోహులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ నాటికి శతశాతం మరుగుదొడ్లు నిర్మాణం
* జెడ్‌పి సి ఇ ఒ నగేష్
సంతకవిటి: జిల్లాలో 2.90 లక్షలు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి శతశాతం లక్ష్యాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని జెడ్‌పి సి ఇ ఒ నగేష్ పేర్కొన్నారు. జిల్లాలో 3.17 లక్షల మరుగుదొడ్లు అవసరమని గుర్తించగా 87,730 దరఖాస్తులు ఆన్‌లైన్ చేయబడ్డాయని తెలిపారు. ఈ నెల 24 నాటికి ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయిలో పొందుపర్చడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించబడిన 47 పంచాయతీల్లో శతశాతం మరుగుదొడ్లు లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. గ్రామ పంచాయతీలో అపారిశుద్ధ్యంపై సంబంధిత ఎంపిడి ఒకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు సంబందించి జిల్లాలో 27 గ్రామాల్లో చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. మరో 850 చెత్త సేకరణకు సంబంధించి స్థలాలు గుర్తించినట్టు తెలిపారు. అనంతరం ఎంపిడి ఒ వేణుగోపాలనాయుడు తమ వద్ద పనిచేస్తున్న అటెండర్ రాజశేఖర్ విధులకు సక్రమంగా రావడం లేదని, సమాదానం కూడా చెప్పడం లేదని సి ఇ ఒ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సి ఇ ఒ వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

గిరిజన ప్రాంతాలపై దృష్టిసారించండి

ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం: జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో చేపడుతున్న ఉచిత కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జెసి2 రజనీకాంతారావు కంటి ఆసుపత్రుల యాజమాన్యాలకు కోరారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ సమావేశం గురువారం జెసి-2 ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున నిర్వహించనున్న కంటి రోగుల పరీక్షలు శస్తచ్రికిత్సల శిబిరాల తేదీలను ఖరారు చేసుకుని వాటిని సంబంధిత గ్రామస్తులకు ముందుగా తెలియజేయాలన్నారు. అప్పుడే కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేసుకోవల్సిన రోగులు సిద్ధంగా ఉంటారన్నారు. శస్తచ్రికిత్సల అనంతరం కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉందని వాటికి సంబంధించిన రిజిష్టర్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సరైన పౌష్టికాహారం లభించక కంటి రోగులు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కావున అటువంటి వారిపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. ప్రతి కంటి ఆసుపత్రి యాజమాన్యం కనీసం మూడు పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారిలో అవసరమైన వారికి శస్తచ్రికిత్సలు నిర్వహించాలని తెలిపారు. శస్తచ్రికిత్సల శిబిరాలను ప్రైవేటు బిల్డింగుల్లో నిర్వహించకుండా దగ్గర్లో ఉండే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కంటి పరీక్షలు శస్తచ్రికిత్సల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వ మంజూరు చేస్తున్నందున వైద్య శిబిరాల్లో ప్రభుత్వ బ్యానర్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
వైద్య పరీక్షలు, శస్తచ్రికిత్సలు శిబిరాల నిర్వహణ తేదీలను ముందుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను, జిల్లా అంధత్వనివారణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌కు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. రోగుల వివరాలకు సంబందించి కేర్ సీట్లు, రోగులకు పంపిణీ చేసిన నగదు వివరాలను కూడా ఎప్పటికప్పుడు డి ఎం అండ్ హెచ్‌వోకు తెలియజేయాలన్నారు. అలా చేయని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కంటి ఆసుపత్రి యాజమాన్యాలకు సంబంధించిన సమస్యల గూర్చి జెసి 2 దృష్టికి తీసుకురాగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ సమావేశంలో డి ఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎస్.తిరుపతిరావు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ పివో జివి రమణకుమార్, రిమ్స్ హెచ్‌వోడి తారకేశ్వరావు, ఆప్తాలమిక్ ఆఫీసర్ రాజశేఖరరెడ్డి, ఆరోగ్యవరం, శంకర్ ఫౌండేషన్, లైన్స్, జెమ్స్, పుష్పగిరి, రెడ్‌క్రాస్ కంటి ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇళ్ల పనులు ప్రారంభించిన వారికి నోటీసులు
* కలెక్టర్ ధనంజయరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం: గృహనిర్మా శాఖ ద్వారా గతంలోమంజూరు చేసిన గృహాలు నేటి వరకు పనులు ప్రారంభించిన లబ్ధిదారులకు సోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రంజిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటీసులు జారీ చేయకపోతే వారి ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రారని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలు నిర్మించుకోకపోవడం అత్యంత శోచనీయమన్నారు. దీని కారణంగా జిల్లా ప్రోగ్రస్ తగ్గిపోతుందన్నారు. కేంద్ర గృహ నిర్మాణ పథకానికి సంబంధించి 17-18,18-19 సంవత్సరాలకు సంబంధించి లబ్ధిదారులు గుర్తింపు, ఇళ్లు మంజూరు చేయడంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు. జిల్లా ప్రోగ్రస్ రాష్ట్రంలో మిగతా జిల్లాలకంటే తక్కువగా ఉందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు, బ్యాంకు ఖాతాల ఏర్పాటు పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. అలాగే హుదూద్ తుఫాన్ బాధితులకు మంజూరు చేసిన గృహాల నిర్మాణం జిల్లాలో మందకొడిగా ఉన్నాయని వీటిని వెంటనే పూర్తి చేయాలని ఇ ఇ శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఈసమావేశంలో హౌసింగ్ పిడి నరసింగరావు, డి ఇలు కె.వి నాగేశ్వరరావు, ఎం.విఠల్‌రావు, జివి రంగారావు, జె.నరసింగరావు , అప్పారావు, జి.రాము అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టూరిజం ఫెస్టివల్ నిర్వహిస్తాం

సీతంపేట: వచ్చే నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు టూరిజం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్టు ఐటిడి ఎ పి ఒ ఎల్.శివశంకర్ అన్నారు. గురువారం పెదరామ పంచాయతీ పరిధిలోని చంద్రమ్మగుడితో పాటు ఎదురుగా ఉన్న కొండ ప్రాంతాన్ని పి ఒ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతంపేట ఏజెన్సీ పర్యాటక ప్రాంతాన్ని నలుమూలల చాటిచెప్పేందుకు గాను టూరిజం ఫెస్టివల్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ ఫెస్టివల్‌కు జిల్లా మంత్రులతో పాటు అధికారులందరినీ ఆహ్వానిస్తామన్నారు. కొండపైన పారాగ్లైడింగ్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకులు రాత్రిపూట బస చేసేందుకు హిల్‌రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసి వారి వాహనాలు వచ్చేందుకు రహదారులను కూడా నిర్మిస్తామన్నారు. ఈ పరిశీలనలో పి ఒతో పాటు గిరిజన సంక్షేమ ఇ ఇ అశోక్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వీర్రాజు, పెదరామ మాజీ సర్పంచ్ భాస్కరరావు తదితరులున్నారు.