కడప

రాజంపేటలో కుంభవృష్టి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట: రాజంపేట ప్రాంతంలో గురువారం సాయంత్రం కుంభవృష్టి కురిసింది. ఉదయం నుండి ఆకాశం మేఘావృత్తమై చిన్నపాటి జల్లులు కురుస్తూ ఉన్నప్పటికీ సాయంత్రం ఒకసారిగా కుంభవృష్టి కురిసింది. దీంతో రాజంపేట పట్టణంలో ఎక్కడచూసినా రహదారులు నీటిమడుగుల్లా కనిపించాయి. మోకాలికి పైగా వర్షపునీరు రోడ్లపై నిలవడంతో అటు పాదచారులు, ఇటు ద్విచక్ర వాహనదారులు పడ్డ అగచాట్లు చెప్పనలవి కాదు. డ్రైనేజీ లోపం స్పష్టంగా కుంభవృష్టితో కనిపించింది. డ్రైనేజీ మురికినీరు మొత్తం రోడ్లపై పారడంతో అపరిశుభ్రత నెలకొంది. దీనికితోడు పట్టణంలో పలు కూడళ్లవద్ద అపరిశుభ్రత కారణంగా దుర్వాసన వెలువడుతున్నది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వర్షపునీరు మోకాలికి పైగా లోతు వరకు నిలిచిపోయాయి. సరైన డ్రైనేజీ లేనికారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు వెళ్ళని పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలకోసం ఇక్కడి రైతులు గత మూడు నెలలుగా ఎదురుచూస్తూ వస్తున్నారు. అయినా వీరు ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ పంటను కోల్పోయారు. కనీసం రబీ పంట నాటికైనా భారీవర్షాలతో ఇక్కడి చెరువులు, వంకలకు సాగునీరు చేరాలని గంపెడాశతో ఇక్కడి ఆయకట్టు రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే భారీ వర్షాలు అడపా తడపా పడుతున్నందువల్ల చెరువులు, వంకలు, మడుగులకు సాగునీరు చేరని పరిస్థితి ఏర్పడింది. కాగా గత వారంరోజుల వ్యవధిలో మూడు మార్లు రాజంపేట ప్రాంతంలో భారీ వర్షం నమోదవ్వడంతో బావులు, బోర్ల కింది రైతుల ప్రయోజనాలు మెరుగు కానున్నాయి. వాణిజ్యతోటల రైతాంగం ఈ భారీ వర్షాల నమోదుతో భూగర్భజలాలు పెరుగుతుండడంతో ఆనందంగా ఉన్నారు. కాగా ఆయకట్టు భూములన్నీ వరుస కరవుతో బీడుగామారి కంపచెట్లతో నిండిపోయి ఉన్నాయి. మొత్తానికి రాజంపేట ప్రాంతంలో గురువారం సుమారు గంటపాటు కురిసినా కుంభవృష్టితో పట్టణమంతా జలమయమైంది. కాగా గత పది రోజుల నుండి అడపా తడపా పడుతున్న వర్షాలతో వర్షపునీటి కుంటలు ఏర్పడి దోమలబెడద కూడా అధికంగా ఉంది. అయినా మున్సిపల్ అధికారులు దోమల నివారణకు అవసరమైన చర్యలపై దృష్టి నిలపలేదు. ఇప్పటికైనా పట్టణ పరిధిలో వర్షపునీటి కుంటలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఫాగింగ్ చేయడం, వర్షపునీటి కుంటల్లో వేస్ట్‌అయిల్ వేసి దోమల ఉత్పత్తిని నివాలించాల్సి ఉంది. ఇప్పటికే మారిన వాతావరణ పరిస్థితుల్లో విషజ్వరాలు, విరేచనాలు అధికమై ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడిపోయి కనిపిస్తున్నాయి.

యధేచ్చగా ఎర్రచందనం తరలింపు

ఆంధ్రభూమిబ్యూరో
కడప: అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమంగా తరలివెళ్లకుండా బేస్ క్యాంప్‌లు, చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి సిబ్బందిని నియామకం చేసినా ప్రతినిత్యం జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుంచి ఎర్రచందనం స్మగ్లిం గ్ యధేచ్చగా జరుగుతోంది. జిల్లాలోని శేషాచలం , అభయారణ్యాలు, జిల్లా సమీపంలోని నలమల అటవీప్రాంతాల్లో అడవుల పరిరక్షణకు ప్రతి ఏటా కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నా ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక రాజంపేట డివిజన్‌లో 6బేస్ క్యాంప్‌లు, 8చెక్ పోస్టు లు, మెగాబేస్ క్యాంప్‌లను ఏర్పాటుచేసి అటవీశాఖ సిబ్బందిని, ఆర్మ్‌డ్ పోలీసులను నియామకం చేసినా ఎర్రచందనం రవాణాకోసం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతోపాటు జిల్లాకు చెందిన స్మగ్లర్లు, కూలీలు ఏవిధంగా చొరబడుతున్నారో అటవీశాఖ అధికారులే ఆత్మపరిశీలన చేసుకోవాల్సివుం ది. 16 బేస్‌క్యాంపుల్లో సిబ్బందికి ఆహారం, గుడారం, నీరు, మందులు, ఆయుధాలు సమకూర్చారు. ఈబేస్ క్యాంపులన్నీ అటవీప్రాంతం చుట్టు ఉన్న గ్రామాల మార్గాల్లో ఏర్పాటుచేశారు. ఇక 8చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున అటవీశాఖ సిబ్బందిని నియామకం చేసి నిత్యం తనిఖీలు చేస్తున్నారు. అయితే చొరబాటుదారులు ఏ విధంగా ప్రవేశిస్తున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. అలాగే 3మెగా బేస్ క్యాంపులు ఏర్పాటుచేసి 15మంది ఆర్మ్‌డ్ పోలీసులను నియామకం చేశారు. ఇదిలా ఉండగా 4 మొబైల్ పార్టీలను ఏర్పాటుచేసి వారు నిరంతరం సెల్‌ఫోన్లు, వాకీటాకీలు, మొబైల్ సెట్లు, వివిధ రకాలు ఆయుధాలు తెప్పించి తనిఖీలుచేస్తున్నా ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఎర్రచందనం ఎల్లలుదాటి వెళుతోంది. కడప జిల్లా సరిహద్దులోని కలకడ, కెవిపల్లి, భాకరాపేట, మెరబైలు, అలివేలుమంగాపురం తదితర ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా పోలీసులు రైల్వేకోడూరు, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో సరిహదుల్లో నెల్లూరు పోలీసులు , పులివెందుల, గాలివీడు, ముద్దనూరు, కొండాపురం ప్రాంతాలకు సంబంధించిన అనంతపురం జిల్లా పోలీసులు గట్టినిఘా పెంచినా ఎర్రచందనం తరలిపోవడంలో ఇంటి దొంగలైన పలువురు అటవీశాఖ, పలువురు పోలీసుల హస్తం ఉందని జోరుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. తమిళనాడు , కర్నాటక రాష్ట్రాల నుం చి ఏకంగా స్మగ్లర్లు, కూలీలు బస్సులను మాట్లాడుకుని అడవుల్లో ప్రవేశించడం, ఇక తమిళనాడు, కర్నాటకకు చెందిన ఆర్టీసి బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో కూలీలు తరలిరావడం కొన్ని దశాబ్దాలకాలంగా జరిగిపోతోంది. కేవలం పలువురు అటవీశాఖ అధికారులు, పోలీసు అధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపి తమ ఆదాయవనరులు పెంచుకుంటున్నారే తప్ప ఎర్రచందనం నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. స్మగ్లర్లు, కూలీలు రోజుల తరబడి అడవుల్లో మకాం వేసి గుట్టుచప్పుడు లేకుండా ఎర్రచందనం దుంగలు కత్తిరించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గాల ద్వారా చెన్నై, కర్నాటక రాష్ట్రాలకు చేర్చి అక్కడి నుంచి నౌకల ద్వారా విదేశాలకు ఎర్రచందనం చేర్చడం, మరికొన్ని దుం గలు వ్యాగన్ల ద్వారా విదేశాలకు చేర్చడం వెనుక పెద్దల హస్తం ఉన్నా ఆ పెద్దలను కట్టడి చేయడంలో కూడా అధికారులు విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. అడవుల పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఎర్రచందనం ఎల్లలుదాటుతోందని చెప్పవచ్చు.

నేతన్నపై సవతి ప్రేమ!
జమ్మలమడుగు: పాలకులు ఎవరైనా, ప్రభుత్వాలు ఏవైనా రోజంతా రెక్కాడితేకాని డొక్కాడని దుస్థితిలో ఉన్న నేతన్నపై ప్రభుత్వాలు సవతితల్లి ప్రేమను ఒలకబోస్తున్నాయి. అమలు చేయాల్సిన అధికారగణం ఉదాశీనతతో బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయిస్తున్నా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందక చేనేతల అభివృద్ధి కలగానే మిగిలిపోతోంది. జిల్లాలో వ్యవసాయం రంగం తరువాత చేనేత రంగం ప్రాధాన్యత సంతరించుకొంది. జిల్లా వ్యాప్తంగా 45వేల కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై చేనేతల్లో చైతన్యం తీసుకురావాల్సిన అధికారగణం నామమాత్రపు సదస్సులతో మమ అనిపిస్తున్నారు. కుటుంబం మొత్తం రోజంతా రెక్కాడినా రోజు గడవని స్థితిలో చేనేత కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. చేనేతల అభివృద్ధి పేరుతో ఏర్పాటైన సొసైటీలు చేనేతల పేరుపై చేనేతల సంక్షేమాన్ని దోచుకుంటున్నాయన్నది జగమెరిగిన సత్యం. సాక్షాత్తూ జిల్లా చేనేత, జవుళి శాఖ ఎడి జయరామయ్య పలుమార్లు జిల్లాలో బోగస్ సొసైటీలు చాలా ఉన్నాయంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కనీసం చిరునామా కూడా లేని కార్యాలయాలతో జిల్లాలో పలు సొసైటీలు వేలాది కార్మికుల భవిష్యత్తును అందకారంలోకి నెట్టేస్తున్నా పాలకులు ఏమీ పట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 2011 ఆగష్టు 1వ తేదీ స్థానిక ఎంపిడివో కార్యాలయ సభాభవనంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ సమక్షంలోనే చేనేతలు సొసైటీలపై ధ్వజమెత్తారు. ఒక్కో సొసైటీలో వందలాది చేనేత కార్మికుల పేర్లు తమకు తెలియకుండానే పెట్టుకుని, తమకు దక్కాల్సిన ఫలాలు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి ఆర్డీవో కె.వెంకటరమణా రెడ్డి ఈ విషయంపై విచారం వ్యక్తం చేస్తూ 1964 సొసైటీ యాక్టు ప్రకారం సొసైటీలపై ప్రతి అధికారికి పర్యవేక్షణ బాధ్యత ఉందనాన్నారు. నిబంధనలు ఉల్లంఘించే సొసైటీలను రద్దు చేసే అధికారం కూడా సంబంధిత శాఖ అధికారుల ఉందని, సొసైటీలో ఉన్న సభ్యుల పేర్లు తప్పని సరిగా బహిర్గతం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే ఆ తరువాత కాలంలో సొసైటీల ఆధిపత్యంలో సొసైటీల్లోని సభ్యుల జాబితాల్లోని వివరాలు బహిర్గగం చేసే విషయం మరుగున పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించాల్సిన అవగాహన సదస్సుల వివషయంను బుధవారం సాయంత్రం చేనేత, జవుళి శాఖ అధికారులు నిర్ణయించుకొని సదస్సులను మమ అనిపించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇలాఖాలోనే పరిస్థితి ఇలా ఉండడంపై చేనేతలు మండి పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చేనేతులు కోరుతున్నారు.
చెరువుల పూడిక తీతలో రూ.50కోట్లు హాంఫట్!
* మామూళ్లమత్తులో జలవనరులశాఖ అధికారులు
ఆంధ్రభూమిబ్యూరో
కడప: కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు భూగర్భజలాలు పెంపొందించి తద్వారా సాగునీరు, తాగునీరు అందించేందుకు చేపట్టిన చెరువుల పూడికతీత, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు కోసం గడిచిన రెండేళ్లలో రూ.425 కోట్లు పైబడి పనులు చేపట్టగా తద్వారా పూడికతీత, చెక్‌డ్యామ్‌ల పునరుద్దరణ నిర్మాణాలు పేరిట కాంట్రాక్టర్లు రూ.50 కోట్లు పైబడే దిగమింగినట్లు తెలుస్తోంది. సంబంధిత జలవనరులశాఖ అధికారులు, సిబ్బంది పర్సెంటేజ్‌ల పేరుతో దోచుకోవడమే తప్ప ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దశాబ్దాల కాలం నుంచి చెరువుల కట్టల మరమ్మతులు, తూముల నిర్మాణాలు , షెట్టర్ల నిర్మాణాలు, ఉపకాలువల మరమ్మతులు తదితరాల పనులకు ప్రతి ఏటా చెరువులకు చేపట్టిన పనులే తిరిగి చేపడుతూ పాత పనులకు కొత్తసొగసులుచేసి వివిధ పథకాల కింద చెరువులు, చెక్‌డ్యామ్‌లు ,కోనేటి గుంతల మరమ్మతులు పేరిట కోట్లరూపాయలు దండుకోవడమే తప్ప ప్రభుత్వ లక్ష్యంనెరవేరింది లేదు. చిన్ననీటి పారుదల కింద జిల్లాలో 1841 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల కింద ఇంతవరకు ఒక కారు కూడా పంటసాగుకునోచుకోలేదు. ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమం కింద 2015-16 సంవత్సరంలో 553 చెరువులకు పూడికతీత పనులు, మరమ్మతుల కింద రూ.3200.86 లక్షలు ఖర్చుచేసింది. 2016-17సంవత్సరంలో 3181 చెరువులు, చెక్‌డ్యామ్‌లకు పూడికతీత పనులకు రూ.218.83కోట్లు కేటాయించగా, అందులో 2742 పనులు పూర్తికాగా రూ.180.85కోట్లు ఖర్చుచేశారు. 1,17లో 1056 చెక్‌డ్యామ్‌లు నిర్మాణాలు నిమిత్తం 102.32కోట్లు అంచనాలతో 633 చెక్‌డ్యామ్‌లు పూర్తిచేసి 68.13 కోట్లు ఖర్చు చేశారు. 2017-18 గాను 3118 పనులకు 291.25కోట్లు కేటాయించగా ఇప్పటివరకు 406 పనులు పూర్తిచేసి రూ.39.14కోట్లు ఖర్చుచేశారు. ఈపనులన్నీ చెరువుల మరమ్మతులు, పూడికతీత, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు, మర్మమత్తులు చేపట్టాల్సివుంది. కాగా అధికారపార్టీ నేతల అండదండలతో పలువురు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుని ఇటు నాయకులకు, అటు అధికారులకు కమీషన్లు ముట్టిచెప్పి అరకొర పనులు చేసి పాతపనులకు కొత్త సొగసులుచేసి కోట్లాదిరూపాయలు స్వాహా చేస్తున్నారు. గత పదేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జంగిల్ క్లియరెన్స్ పేరిట చేపట్టిన పనులనే నేడు టిడిపి హయాంలో నీరు-చెట్టు పేరిట అదే పనులు అదే చెరువులకు అధికారులు ప్రతిపాదనలు తయారుచేయడం గతంలో పనులు జరిగిన చెరువుల కొలతలు మార్చి సరిహద్దులు మార్చి మరమ్మతులు చేస్తున్నారు. తేలికపాటి వర్షాలు వచ్చినా చెరువుల కట్టలు తెగిపోతున్నా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ఏటా రూ.వందల కోట్లు ఖర్చుచేస్తున్న, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా అంకితభావం లేని నేతలు చెప్పిందే వేదంగా భావించి ప్రజాధనాన్ని మట్టిపాలు చేసి ప్రభుత్వం లక్ష్యం నెరవేర్చకుండా దొరికిన కాడికి దోపిడీనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా అధికారులు, నేతలు కళ్లుతెరిచి అవసరం ఉన్నచోట ప్రభుత్వలక్ష్యం మేరకు పనులుచేపట్టి చేసిన పనులే చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బిజెపి సారథ్యంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి
ఆంధ్రభూమిబ్యూరో
కడప:ప్రధానమంతి నరేంద్రమోదీ సారథ్యంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని బిజెపి రాష్టన్రాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని కొనియాడారు. ప్రధాని తీసుకున్న పెద్దనోట్లరద్దు కారణంగా రూ.1.75 వేలకోట్ల నల్లధనం వెలికితీయడం జరిగిందన్నారు. జిఎస్‌టి కారణంగా దేశాభివృద్ధి మరింత ముందుకు వెళుతుందని , ఈవిప్లవాత్మక నిర్ణయంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ముందుకుసాగుతాయన్నారు. అన్ని రాష్ట్రాల కౌన్సిల్ మెంబర్లతో చర్చించి జిఎస్‌టిని అమలుచేయడం జరిగిందని, ఏరాష్ట్రానికైనా ఇబ్బందులు ఎదురైతే ఆ సభ్యులద్వారా పరిష్కారాన్ని చర్చల ద్వారా చేపడతారన్నారు. అన్ని రాష్ట్రాల వారికి ప్రాధాన్యత కల్పిస్తూ దళితనేతను రాష్టప్రతిగా చేయడం బిజెపికే దక్కిందన్నారు. బడుగు, బలహీనవర్గాలకోసం ఎన్నో సంక్షేమ పథకాలుప్రవేశపెట్టి పేదల అభివద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న మహానేత ప్రధాని నరేంద్రమోదీ అని ఆయన శ్లాఘించారు. జిల్లాలో ఉక్కుపరిశ్రమను విభజనచట్టం ద్వారా టాస్క్ఫోర్స్ బృందంతోవిచారణ జరుగుతోందన్నారు.
ఉక్కుపరిశ్రమకు కావాల్సిన ముడిసరుకు బళ్లారి, కడప జిల్లాలో ఎక్కువగా లభ్యమవుతోందని పరిశ్రమను జిల్లాలో ఏర్పాటుచేసేందుకు బిజెపి కట్టుబడి ఉందన్నారు. ఈసమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథ్‌రెడ్డి, బిజెఎంఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవి చలమారెడ్డి, బిజెవైఎం కార్యవర్గ సభ్యులు డాక్టర్ జయశ్రీనివాసులు, జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి, నగర అధ్యక్షుడు పట్నం ఎరికలప్ప, ప్రధానకార్యదర్శులు ఎం.శ్రీనివాసులురెడ్డి, లక్ష్మణరావు, హరినారాయణ, రమణ, ఓబులేసు, గౌరి, శివశంకర్,సీనియర్ నాయకులు మాదినేని రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
* కలెక్టర్ బాబురావునాయుడు
రామాపురం: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను విరివిగా నాటాలని జిల్లా కలెక్టర్ బాబురావునాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన మండలంలోని నాబార్డు కేఎఫ్‌డబ్ల్యు, కాకులారం వాటర్‌షెడ్, కుమ్మరపల్లె ఐడబ్ల్యు ఎంపీ మెగా వాటర్‌షెడ్ ఏరియాలోని బైరేనికొండకు నాటిన కానుగ, వేప, నేరేడు అడవి మొక్కలను పరిశీలించారు. ఇలాంటి పనులను ఎక్కువగాచేసి ఒక మోడల్‌గా ఇతర జిల్లాల వారికి ఆదర్శంగా నిలవాలని సలహా ఇచ్చా రు. కలెక్టర్ స్వయంగా చెట్లను నాటి అక్కడున్న యువజన గ్రూపు వారితో మాట్లాడుతూ చెట్లను బాగా సంరక్షించుకోవాలని సలహా ఇచ్చారు. తరువాత కాకుళారం నా బార్డు వాటర్‌షెడ్‌లో వేసిన నీటిసంరక్షణ పనులను చెక్ డ్యాం, ఫారంఫాండ్లు నీటితో కళకళలాడుతూ ఉం డటం ఆనందం వ్య క్తం చేశారు. అనంతరం కుమ్మరపల్లె ఐడబ్ల్యు ఎంపీలో నాటిన సపోటా మొక్కలను పరిశీలించి రెండు సంవత్సరాల మొక్కలను పెంచి ఇస్తే సంరక్షణ ఖర్చులు తగ్గుతాయన్నారు. కాకులారం కే ఎఫ్‌లో ఫాయిల్ ప్రాజెక్టులో చేసిన కలబంద, పూలతోటల్లో, కూరగాయల తోటల్లో కలియతిరిగి అక్కడున్న రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్‌హెచ్‌బీ ఎంఎస్‌ఎస్ సంస్థ వారికి నాబార్డు ఏజీఎం జిల్లా వారికి, సీబీ శ్రీనివాసులులకు పలు సలహాలు అందించారు. నాబా ర్డు జిల్లా అధికారి శ్రీనివాసులు సాయిల్ ప్రాజెక్టుతో పాటు తోట కార్యక్రమాలు సుండుపల్లె, సంబేపల్లె మండలాల్లో చేసినట్లు ఆయన తెలిపారు. బివి రత్నం, చంద్రకాంత్, రాచరాయుడు, నరసింహులు, రఫి తదితరులు పాల్గొన్నారు.
చదిపిరాల వద్ద ఘోర రోడ్డుప్రమాదం
కమలాపురం:కడప జిల్లా కమలాపురం మండలం చదిపిరాల గ్రామం వద్ద కడప-తాడిపత్రి హైవేరోడ్డుపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబందించి వివరాల్లో కి వెళితే కడప నుంచి ముగ్గురు స్నేహితులు వల్లూరు మండలంలోని పుల్లారెడ్డిపేటలోని మరో స్నేహితున్ని మోటర్‌సైకిల్‌పై ఎక్కించుకుని రెండు మోటర్‌సైకిళ్లలో స్నేహితుని వివాహం కోసం పులివెందులకు వెళుతుండగా ఈ మండలం చదిపిరాల గ్రామం వద్ద యర్రగుంట్ల నుంచి ఎదురుగా వేగంగా వస్తున్న కారు మోటర్‌సైకిళ్లను ఢీకొంది. దీని ఫలితంగా మోటర్‌సైకిల్ ముందుచక్రం విరిగి వందమీటర్ల దూరంలో తునకలై పడిపోగా కారు బోల్తాపడి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పడిపోయింది. మోటర్‌సైకిళ్లలోని నలుగురు యువకులకు తీవ్ర గా యాలు కాగా స్థానికులు వారిని కాపాడబోయేందుకు ప్రయత్నించగా అప్పటికే కడపపట్టణం రవీంద్రనగర్‌కు చెందిన నాగూరు వెంకటశివారెడ్డి (28) దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురిని కమలాపురం 108 వాహ నం ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. ఐతే చికిత్స పొందుతూ కడప నగరం రామరాజుపల్లెకు చెందిన శ్యాంబాబు (27), మరియాపురానికి చెందిన మహేశ్ (27) కూడా మృతి చెందారు. కాగ వల్లూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన హరిబాబు తీవ్ర గాయాలకు గురై పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘటన తెలిసిన వెంటనే ఎస్సై మహమ్మద్ రఫీ ఆ ప్రాంతానికి చేరుకుని హుటాహుటీన గాయాలకు గురైన వారిని కాపాడెందుకు 108వాహనం ద్వారా కడపకు తరలించినప్పటికి ఫలితంలేకుండా పోయింది. ఐతే కడపకు చెందిన ముగ్గురు కూడా రోడ్డుప్రమాదంలో మృతి చెందినట్లు మృతుల కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు. విషయం తెలిసిన మృతుల కుటుంబీకులు కడప రిమ్స్‌కు తరలివచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనకు కారకులైన కారు డ్రైవర్ యర్రగుంట్ల నుంచి అతివేగంగా వస్తూ మార్గమధ్యంలో ఓ వాహనాన్ని ఢీకొనబోయి తప్పించుకుని తిరిగి పందిళ్లపల్లె గ్రామం వద్ద కమలాపురం డిగ్రీ కాలేజికి చెందిన వ్యాన్‌ను కూడా ఢీకొనబోగా తృటిలో తప్పించుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. చివరకు చదిపిరాల వద్ద మోటర్‌సైకిళ్లను ఢీకొని ముగ్గురి మృతికి కారణమైంది.

జమ్మలమడుగులో ఎడతెరపిలేని వర్షం

జమ్మలమడుగు: తుపాను ప్రభావంతో జమ్మలమడుగులో గురువారం సాయంత్రం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. సాయంత్రం 3.30గంటల నుండి రాత్రి 7గంటల వరకు వర్షం కురిసింది. వాతావరణ శాఖ రెండు రోజుల పాటు తుఫాను ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించిన విష యం విదితమే. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పట్టణంలో పలుచోట్ల వర్ష నీటిమయంగా మారిపోయిం ది. ఆర్టీసి డిపో ఆవరణ వర్షపునీటితో నిండిపోయింది. పట్టణంలోని డ్రైనేజి కాలువలు పొంగి పొర్లాయి. ఆర్డీవో కార్యాలయంతో పాటు ప్రాంతాలు వర్షపునీటిమయంగా మరాయి. కురిసిన వర్షంతో రైతులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.