అక్షరాలోచన

ఆకాశమంత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిగ్భ్రాంతిలోంచి
ఇప్పుడే తేరుకున్నాను
ఆ నదిలోంచి
దోసెడు నీళ్లు తీసుకుని
తలపై చల్లుకున్నాను
తెలివొచ్చిన నాకు
అక్కడొక పెద్ద చేయి
కనిపించింది.
ఎన్నో లేత వీపుల్ని తట్టి
కవిత్వంలోకి నెట్టిన
ఆకాశమంత చేయి అది.
అదొక జీవిత నదిలా
కనిపించింది.
జీవిత చరమాంకం వరకూ
తెలుగు కవితా నేలను
సస్యశ్యామలం చేస్తూ
ప్రవహించిన కవిత్వపు
జీవనది అది.
అక్కడొక ధృవతార
మెరిసింది.
కాలం విసిరిన
కవితల దండలోంచి
ఓ తెలుగు పువ్వు
అవనిని మెరిపిస్తూ
ఆకాశం చేరింది.
*

-నిరంతర 9133832246