నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగి యున్న
నీకు ముందఱఁ జని రిపునృపుల యందుఁ
దగిలి సామాద్యుపాయంబు లొగిన సంప్ర
యోగమున ఁ జేసి వర్తిల్లుచునె్న చెపుమ
భావం: నీవు దండెత్తడానికి ముందే బలవంతులైన శత్రురాజుల మీద సామదానాది చతుర్విధోపాయాల్ని చక్కగా ప్రయోగిస్తున్నావు కదా. రాజ్యకాంక్ష ఉండడం రాజులకు సహజం.కాని ఆ రాజ్యకాంక్షవల్ల జననష్టం కాని, జనులకు వారి దైనందిన కార్యక్రమాలు సాగించడానికి ఆటంకాలు కాని కలుగకూడదు.కాని, ఇతరులు దండెత్తకుండా కూడా నీవే చూసుకోవాలి. ఆ బాధ్యత కూడా రాజుపైనే ఉంటుంది. దాన్ని నీవు విస్మరించడం లేదుకదా అని ధర్మజుడిని నారదుడు అడిగాడు.

మహాభారతంలోని పద్యము