తెలంగాణ

అపెరల్ పార్క్‌లో యూనిట్లకు రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: వస్త్ర తయారీ పరిశ్రమ, వాణిజ్య రంగాన్ని అభివృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు, ప్రోత్సహకాలను ప్రకటించింది. తెలంగాణ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ రాయితీ పథకం-2017 మార్గదర్శకాలను పరిశ్రమలు మరియు వాణిజ్యశాఖ శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణలో పెద్ద ఎత్తున నాణ్యమైన పత్తిసాగు జరుగుతున్నప్పటికీ వస్త్ర తయారీ రంగానికి స్థానికంగా తగిన అవకాశాలు లేకపోవడంతో చేనేత కార్మికులు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. స్థానికంగా వస్త్ర తయారీ రంగాన్ని ప్రోత్సహించి, ఈ రంగం ఇక్కడనే స్థిరపడటానికి ప్రభుత్వం అనేక రాయితీలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించే ప్రోత్సహకాలు, రాయితీలు నోటిఫికేషన్ విడుదల నుంచి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న యూనిట్లకే కాకుండా కొత్తగా ఏర్పాటు చేసే అపెరల్ యూనిట్లు అన్నింటికీ రాయితీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కొత్తగా యూనిట్లను నెలకొల్పే జిల్లా పరిశ్రమల కేంద్రంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే నెలకొల్పిన యూనిట్లు తమ యూనిట్లను ఆధునీకరణ, విస్తరణకు అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. పెట్టుబడి సహకారం, నిర్వహణ సహకారం, కెపాసిటి బిల్డింగ్, స్కిల్ డవలప్‌మెంట్, ఫైబర్ ఫ్యాబ్రిక్ సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. నెలకొల్పనున్న యూనిట్లను వాటి పెట్టుబడి ఆధారంగా ఐదు కేటగిరీలుగా విభజించినట్టు పేర్కొంది. రూ. 10 కోట్లు, రూ.10 నుంచి 50 కోట్లు, రూ.50 నుంచి 100 కోట్లు, రూ. 100 నుంచి 200 కోట్లు, రూ.200 కోట్ల పెట్టుబడి కలిగిన వాటిని ఎ-1 నుంచి ఎ-5 వరకు వరుసగా ఐదు కేటగిరీలుగా గుర్తించనున్నట్టు పేర్కొన్నారు. అన్ని కేటగిరీలకు 25 శాతం సబ్సిడీని ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంలో కూడా రాయితీలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఎ-1, ఎ-2 కేటగిరీలకు విద్యుత్ చార్జీలలో యూనిట్‌కు రూపాయి, ఎ-3 కేటగిరికి రూ.1.50 పైసలు, ఎ-4 రూ.1.75 పైసలు, ఎ-5 కేటగిరికి రూ.2 రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలలో రాయితీలు ఐదు సంవత్సరాల పాటు వర్తిస్తాయని పేర్కొన్నారు.