అదిలాబాద్

విద్యార్థులు క్రీడలలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దహెగాం: గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడలలో రాణించాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. దహెగాం మండలంలోని చిన్నరాస్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అండర్-14, అండర్-17, ఫుట్ బాల్‌సెలక్షన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఎమ్మెల్యే నిధుల నుంచి 10 శాతం క్రీడల అభివృద్దికి వెచ్చిచాల్సి ఉంటుంది. గ్రామీణ క్రీడాకారులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 25శాతం నిధులు ఖర్చు చేస్తామని హామీలు ఇచ్చారు. క్రీడాకారులు విద్యతోపాటు క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న పివి సిందుకు ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సహకాలు ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. క్రీడాకారులు లక్ష్యాలను నిర్ధేశించుకోని పోటీపడాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యంమెరుగు పడాలని సిఎం రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. దహెగాం నుంచి చిన్న గుడిపేట, లగ్గాం నుంచి చౌక, పెంచికల్ పేట క్రాసింగ్ నుంచి చిన్నరాస్‌పల్లి, కర్జి నుంచి మొట్లగూడ వరకు బీటి రోడ్లు నిర్మిస్తామన్నారు. మరమ్మత్తులకు నోచుకోక శిథిలమైన రోడ్లకు మొర్రం వేసి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటల పొలాలకు వెళ్లే రోడ్లు, కల్వర్టులను నిర్మిస్తామన్నారు. జాతీయ స్థాయిలో రాణించి న ఫుట్ బాల్ క్రీడాకారిణి సమ్మక్కఅనే విద్యార్థిని, ఎమ్మెల్యే సన్మానించారు. సమావేశంలో మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు ఎ సంతోష్ గౌడ్, సింగిల్ వీండో ఉపాధ్యక్షుడు తిరుపతి గౌడ్, సర్పంచ్ వెంకన్న, ఆత్మ డైరెక్టర్ పాపయ్య, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ప్రసాద్ రాజు, నాయకులు ధనుంజయ్, భీమన్న సంతోష్, మల్లేష్, దామోదర్, సురేష్, ఎస్సై రమేష్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.