వరంగల్

కమనీయం...వెంకన్న కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో ప్రతి ఏడాది స్వామివారి కల్యాణాన్ని నిర్వహించినట్టు ఆలయ కమి టీ చైర్మన్ ఎర్ర జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిత్యం పూజాకార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆలయ అర్చకులు ముడుండై వెంకటాచార్యులు, వరదాచార్యులు, మాధవాచార్యులు, ఆలయ కమి టీ సభ్యులు చింతల నిరంజన్, గర్రెపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్దత కల్పించాలి
* పివోడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు భూక్య పద్మ
గూడూరు: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చట్టబద్దత కల్పించాలని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర కోశాధికారి భూక్య పద్మ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రగతి శీల మహిళా సంఘం గూడూరు సబ్ డివిజన్ సర్వ సభ్య సమావేశం శుక్రవారం న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా భూక్య పద్మ మాట్లాడుతూ జనాభా దామాష ప్రకారం మహిళలకు యాబై శాతం రిజర్వేషన్లు కల్పించాల్సింది పోయి కనీసం 33 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోవడం దారుణమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల పాలకవర్గాలతో పాటు అన్ని పార్టీలు మొసలీ కన్నీరు కారుస్తున్నాయని వాపోయారు. స్ర్తిని మార్కెట్ వస్తువుగా పెట్టుబడి దారి వర్గాలు చూస్తున్నాయని మండిపడ్డారు. గృహహింస, వరకట్న వేధింపులు, హత్యలు, అత్యాచారాలను అరికట్టేందుకు పాలకులు మరిన్ని కఠిన చట్టాలను తీసుకరావల్సిన అవసరం ఉందన్నారు. హక్కులు, చట్టాల సాధన కోసం మహిళలంతా సంఘటితంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు ఆగబోయిన నర్సక్క, పగిడిపాల తిరుపతమ్మ, ఏల అనిత, వీరమ్మ, కౌంసల్య, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.

వైశ్యుల అభ్యున్నతికి తోడ్పడతాం
*ఎంపి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్
వర్ధన్నపేట: ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తోడ్పడుతానని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. ఐనవొలు మండల ఆర్యవైశ్య సంఘం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం రోజు ఐనవొలులో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎంపి దయాకర్, శాసన సభ్యుడు అరూ రి రమేష్, ఎంపిపి మార్నేని రవీందర్‌రావు, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సంపత్ కుమార్ హాజరై మాట్లాడారు. ఐనవొలు మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో వైశ్యులంతా ఏకమై అన్నదాన సత్రం ని ర్మాణం చేపడితే తనవంతు సహకారం అందిస్తానని ఎంపి అన్నారు. నూతనంగా ఏర్పడిన మండల కేంద్రంలో వైశ్య సంఘ భవనం నిర్మాణం చేపట్టి పేద వైశ్యూలకు అండగా ఉండాలని ప్రభుత్వం తరపున వచ్చే పథకాలలో పేదలకు ప్రాదాన్యత ఇస్తానని శాసన సభ్యుడు అరూరి రమేష్ అన్నారు. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జొన్నల రాజు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మండలంలో ఏకగ్రీవ ఎన్నికలు జరుపుకొని నేడు ప్రమాణ స్వీకారం చే స్తున్న కార్యవర్గం నూతన భవన నిర్మాణంతో పాటు అన్నదాన సత్రం నిర్మించి పేదలకు అందుబాటులోకి తేవాలన్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడు శ్రీ రాం పాండురంగం, ప్రదాన కార్యదర్శి అడ్డగుడి సతీష్‌కుమార్, కోశాధికారి ప బ్బతి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గందె వీరన్న, అరవిందం ఎన్నంపల్లి, స హాయ కార్యదర్శులుగా బీరవెల్లి శ్రీను, పట్టురిరాజు ప్రమాణస్వీకారం చేశారు.

టెక్స్‌టైల్స్ పార్కుపై రాజకీయాలు చేయవద్దు
సంగెం : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న టెక్స్‌టైల్స్ పార్కు నిర్మాణంపై రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం చేపట్టే మంచి పనులకు సహకరించాలని లేకుంటే ప్రజలు తిరగబడుతారని టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి దామోదర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొంత మంది రాజకీయ స్వార్దాలకోసం టెక్స్‌టైల్స్ పార్కు నిర్మాణంపై లేని పోని ఆరోపణలు చేసి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలందరికి అర్హతను బట్టి దశలవారిగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టి నాయకులు ఇనగాల వెంకట్రాం రెడ్డి భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిన తరువాతనే టెక్‌స్టైల్ పార్కు పనులు ప్రారంభించాలని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పాలనలో నిరుజ్యోగుల కోసం ఉపాధి కల్పించడానికి పరిశ్రమలను ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టి నాయకులు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేని పోని ఆరోపనలు చేయడం తగదు అని అన్నారు. ఈ సమావేశంలో కుంటపల్లి ఎంపిటిసి పున్నాల నర్సయ్య, జాగృతి నాయకులు జున్న రాజు, బాబు, పూర్ణచందర్, శ్రీకాంత్ ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో తేలికపాటి వర్షాలు
* ఊరట చెందుతున్న రైతులు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతుండటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీవర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ప్రకటనల నేపథ్యంలో వ్యవసాయం పనులకు రైతులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కొద్దిపాటి వర్షాలు కురియటం, ఈ సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని వాతావర ణ శాఖ ప్రకటించటంతో ఖరీఫ్ ప్రారంభం నుంచే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. వరి పండించే రైతులు తమ పొలాల్లో వరినారు వేసారు. కానీ ఆ తరువాత వర్షాలు మొహం చాటేయటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నా రు. అడపాతడపా వర్షాలు కురుస్తున్నా అవి నేలను తడపటానికే తప్ప పంటలు పండించటానికి పెద్దగా ఉపయోగపడటం లేదని రైతులు చెబుతున్నారు. అ యతే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలో కొన్ని చెరువులు, కుంటలు మూడవవంతు మాత్రమే నిండాయని, ఇవి ఖరీఫ్ అవసరాలు తీర్చే ప రిస్థితిలో లేవన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శుక్ర, శనివారాల్లో భారీవర్షాలు కు రుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించటంతో జిల్లా రైతులు సంబుర పడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షంకురియగా, ఉదయంనుంచి సాయంత్రం వరకు తుంపరలు కొనసాగాయ.
పరోక్ష పద్ధతికి శ్రీకారం..!
* కేసముద్రం మార్కెట్లో ఎట్టకేలకు అమలవుతున్న నామ్
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో 1965 నుంచి ప్రత్యక్ష పద్ధతి ద్వారా జరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల ఖరీదులకు శుక్రవారం నుంచి చరమగీతం పాడి.. (నామ్) ఈ టెండర్ విధానం పరోక్ష పద్ధతి ద్వా రా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ సాంకేతిక వ్యవసాయ మార్కెట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఇటీవల కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి, తదితరులు నామ్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం నుంచి మార్కెట్లో పూర్తిస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను నామ్ విధానంలో ఖరీదు చేయాలని చైర్మెన్ బీరవెళ్లి ఉమారెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచి రైతులు మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తేగానే సిబ్బంది గేట్ ఎంట్రీ చేసి సెగ్మెంట్ల వారీగా అలాట్ మెంట్ చిట్టీలు ఇచ్చారు. 10 నుంచి 11 గంటల వరకు వ్యాపారులు ప్రత్యక్షంగా మార్కెట్‌కు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించుకొని తమకు ప్రత్యేకంగా కేటాయించిన ఒటిపి నెంబర్లతో మార్కెట్లో ఏర్పాటు చేసిన టెండర్ హాల్ కంప్యూటర్లలో కొందరు, ఇంకొందరు స్వంత సెల్‌ఫోన్ల ద్వారా సిక్రెట్ టెండర్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మార్కెట్ కార్యదర్శి అంజిత్‌రావు టెండర్లను తెరిచి టెండర్లలో అధిక ధరలు కోట్ చేసిన వ్యాపారులకు సరుకుల అలాట్‌మెంట్ ప త్రాలను అందజేశారు. అనంతరం వ్యవసాయ ఉత్పత్తులను దడువాయిలు ఆ ధునీకరించిన ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల ద్వారా సరుకులను కాంటా వేసి రైతులకు అక్కడికక్కడే ప్రింటర్ ద్వారా తక్‌పట్టీ ఇవ్వడంతో తొలిరోజు నామ్ విధానం తొలిమెట్టు ఎక్కినట్లయ్యింది. కాగా తొలిరోజు ఓ వ్యాపారి అవగాహణారాహిత్యంతో పసుపుకు గరీష్టంగా క్వింటాలుకు 6500 రూపాయలకు బదులు 8500 రూపాయలు కోట్ చేశాడు. అలాగే మరో వ్యాపారి ధాన్యానికి క్వింటాలుకు 1611 రూపాయలకు బదులు 611 రూపాయల ధర కోట్ చేయడం మినహా మరెలాంటి అవాంతరాల్లేకుండా తొలి రోజు నామ్ అమలు సక్సెస్ అయ్యింది. కొత్త..కొత్తగా ఉన్నప్పటికీ నామ్ అమలు తీరుపై తొలిరోజు అటు వ్యాపారులు.. ఇటు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం నామ్ అమలు తరువాత వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. సాంబమసూరి పాతవి క్వింటాలుకు గరీష్టంగా 2463, కనిష్టంగా 1930, 1010 రకం 13 30, మొక్కజొన్న 1451,1414, పెసలు 4429,3411, కందులు 4155, పత్తి 5139, 4850, పసుపు కాడి 7351, 6978, గోలా 7211, 6717 ధర లభించింది.