వరంగల్

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: ఒకరి మతాలను మరొకరు గౌరవిస్తూ వారివారి పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని వరంగల్ నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కమీషనరేట్ పరిధిలోని గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీలతో శుక్రవారం నగరంలోని ములుగురోడ్డు ప్రాంతం లో ఉన్న ఒక ప్రైవేటు ఫంక్షన్‌హాలులో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలతోపాటు ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం సందర్భంగా ఉత్సవ కమిటీలు వ్యవహరించవలసిన అంశాలపై చర్చించారు. ఒకరికొకరు ఇతర మతాలను గౌరవించుకుంటూ పండుగలను జరుపుకునే సంప్రదాయం వరంగల్ ప్రజలకు మొదటి నుంచి అలవాటేనని అన్నారు. ఈసారి జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలను కూడా ఎటువంటి ఇ బ్బందులు తలెత్తకుండా శాం తియుతం గా జరుపుకునేలా అందరూ సహకరించా లని కోరారు. మొదట వినాయక చవితి, ఆ తరువాత బక్రీద్ పండుగ వస్తున్న కారణంగా ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా పండుగలు జరుపుకోవాలని అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీసు కమిషనేట్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే కమిటీలు విగ్రహాలు ఏర్పాటుచేసే స్థల యజమానుల నుంచి అనుమతులు తీసుకుని పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని, మైక్ అనుమతికి తొమ్మిది రోజుల కోసం వందరూపాయలు ప్రభుత్వ బ్యాంక్ ద్వారా చెల్లించి అనుమతి తీసకోవాలని చెప్పారు. గణపతి నవరాత్రి ఉత్సవాల మండలపాల వద్ద సరైన భద్రత చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళలో ప్రతి మండపంలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మండపాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ శబ్ధం కలిగిన మైకులు వినియోగించాలని, నిర్ణీత సమయం అనంతరం మైకులు కట్టివేయాలని చెప్పారు. గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ విషయంలో పోలీసు శాఖ నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాలరావు, వెస్ట్ జోన్ డిసిపి వెంకన్న, ఏసిపిలు చైతన్యకుమార్, మురళీధర్, దుర్గయ్య, సంజీవరావు, సుధీంద్ర, పూజ, భద్రకాళీ దేవాలయ ప్రధాన అర్చకులు శేషు, వేయిస్థ్భాల దేవాలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, శే్వతార్క గణపతి దేవాలయ ప్రధాన అర్చకులు అనంతమల్లయ్య సిద్ధాంతి, కాజీపేట దర్గాకు చెందిన అమీర్ కుస్రూ, సైలానీబాబా, పాతిమ చర్చ్ ఫాదర్ ఉడుముల బాల, నగర గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు సునీల్, బిజెపి నాయకుడు గందె నవీన్ తదితరులు పాల్గొన్నారు.