నిజామాబాద్

సింగూరు నీరు విడుదలపై మంత్రి పోచారం స్పష్టత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్: సింగూరు నీరును నిజాంసాగర్‌లోకి మళ్లించే విషయమై జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో నీలం రాంచంద్రయ్య భవన్‌లో శుక్రవారం సింగూరు నీటి విడుదల విషయమై సదస్సు నిర్వహించగా, సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆకుల పాపయ్య మాట్లాడుతూ, సింగూరు జలాలు..ఇందూరు హక్కు అని పేర్కొన్నారు. నిజాంసాగర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గానే ఎగువన సింగూరును నిర్మించారని, అయినప్పటికీ సింగూరు నీరును నిజాంసాగర్‌లోకి మళ్లించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ప్రస్తుత మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో సింగూరు నీటి కోసం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేశారని, ప్రస్తుతం అధికార పక్షంలో మంత్రిగా ఉండి కూడా సింగూరు నీరును మళ్లించే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణమే సింగూరు నుండి 10టిఎంసిల నీరును నిజాంసాగర్‌లోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ఏకైక ఆధారంగా ఉన్న నిజాంసాగర్‌లో ప్రస్తుతం 1టిఎంసి వరకే నీరు నిల్వ ఉండడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకుని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎగువన ఉన్న సింగూరులో 18టిఎంసిల నీటి నిల్వలు ఉన్నప్పటికీ, నిజాంసాగర్‌లోకి సింగూరు నీరును మళ్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. నిజాంసాగర్‌లో పూడిక పెరగకుండా నిర్మించిన సింగూరు రిజర్వాయర్ నీటిని హైదరాబాద్, మెదక్ జిల్లాల అవసరాలకు తరలిస్తూ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం సింగూరు నీటిని తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో రైతులను సమాయత్తం చేసి ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సదస్సులో వేల్పూర్ భూమయ్య, నాయక్వాడి నర్సయ్య, సిర్ప లింగం, వెంకటేశ్వర్లు, ఎల్‌బి.రవి, మోహన్, బోర్గాం సాయిలు, దిగంబర్, సత్యం, బుచ్చన్న, జెపి.గంగాధర్, జెల్ల మురళి, బి.లింగం, సరిత, బాలామణి, శాంతవ్వ, టి.్భస్కర్, మహేందర్, సోని, వసంత పాల్గొన్నారు.