నిజామాబాద్

సర్వాయి పాపన్నగౌడ్ ఆశయ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్: సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అంటే ఒక ఉద్యమమని, ఉగ్రరూపం అని, అలాంటి మహనీయుడు ఆశయ సాధన కోసం గౌడ కులస్థులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ విజి.గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతిని నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజి.గౌడ్ మాట్లాడుతూ, ఆనాడు ఈత చెట్లను పాపన్నగౌడ్ గీసేవాడని, నవాబులు, జాగీర్‌దారులు వచ్చి కల్లును ఉచితంగా తీసుకెళ్లేవారన్నారు. కల్లు ఇవ్వకపోతే వారు గీతకార్మికులను చిత్రహింసలకు గురి చేసేవారని, దానిని సహించని సర్ధార్ సర్వాయి పాపాన్నగౌడ్, నవాబులు, జాగీర్ధార్లపై తిరగబడ్డారని ఆయన గుర్తు చేశారు. సర్ధార్ సర్వాయి పాపన్న నాడు గోల్కొండ ఖిల్లాను సైతం పరిపాలించిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. పాపన్న అనారోగ్యంతో ఉండటాన్ని సొమ్ము చేసుకున్న ఆనాటి రాజు ఔరంగజేబు సర్దార్ సర్వాయ పాపన్నను చంపేయడం జరిగిందన్నారు. గోల్కొండ ఖిల్లాలో పాపన్న ప్రతిష్ఠించిన రేణుకా ఎల్లమ్మతల్లి దేవాలయం నేటి ప్రజలతో విశేష పూజలు అందుకుంటోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారంగా నిర్వహించే బోనాల పండుగను సైతం గోల్కొండలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే నగరంలోని వినాయక్‌నగర్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జగ్జీవన్‌రాం, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఏ విధంగా జరుపుకుంటామో, సర్ధార్ పాపన్న జయంతి వేడుకలను సైతం ఆ విధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఇప్పటికీ ఈత వనాలు కార్మికులకు సరిపడా లేవని, అందువల్ల ప్రభుత్వం 2019వరకు 5కోట్ల ఈత మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. గీత కార్మికులు ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, దీంతో వారికి ఉపాధి అవకాశం కల్పించాలనే సంకల్పంతో పెద్దఎత్తున ఈత మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈతచెట్లతో పాటు గిరికతాళ్ల చెట్లను సైతం పెద్దఎత్తున తెప్పించి నాటించడం జరిగిందని, అవి పెరిగి పెద్దయ్యాక గీత కార్మికులకు చేతినిండా ఉపాధి లభించడంతో పాటు ఆర్థిక పరిపుష్ఠి సాధించేందుకు ఎంతగానో దోహదపడ్తాయని అన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి పడి మృతి చెందితే 5లక్షల నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని, ఇందుకోసం ప్రభుత్వం 14కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. గౌడ కులస్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు సైతం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ రఘునాథ చెరువు కట్టపై 5లక్షల ఈత మొక్కలను నాటించడం జరిగిందని, ప్రస్తుతం నీరులేక ఆ చెట్లు ఎండుముఖం పడుతున్నాయని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత గీతాకార్మికులపై ఉందన్నారు. ప్రభుత్వం గౌడ కులస్థుల కోసం రాజధానిలో ఒక భవనాన్ని నిర్మిస్తోందని, గీతాకార్మికులంతా ఐక్యమత్యంతో ఉన్నప్పుడే ప్రభుత్వం నుండి మరింత లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగరంలో కల్లుడిపో-1, డిపో-2లను మూసి ఉంచడం వల్ల గడిచిన సంవత్సరంన్నర నుండి గీతాకార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సొసైటీలు వచ్చిన వెంటనే వీటిని ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు గీత వృత్తిపై పూర్తి అవగాహన ఉందని, కొద్దిగా ఓపిక పడితే అన్ని ఫలాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కులస్థులు పరుషగౌడ్, మధుసుధన్‌గౌడ్, చెరుకు లక్ష్మాగౌడ్, నర్సాగౌడ్, రవీందర్‌గౌడ్, బండి సాయాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.