నిజామాబాద్

బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్: విజయ దశమి, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందని, అందువల్ల అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు పటీష్టమైన ప్రణాళికలను రూపొందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశమైన ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. జిల్లాలో అంత్యోదయ, అన్నపూర్ణ, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కలిగి ఉన్న వారంతా బతుకమ్మ చీరలు పొందేందుకు అర్హులని, జిల్లాలో 5,13,734 మందికి చీరలను పంపిణీ చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ చీరలను స్టాక్ చేసేందుకు మార్కెట్ యార్డు గోదాంను ఎంపిక చేయడం జరిగిందని, సిరిసిల్లా నుండి వచ్చే స్టాక్‌ను మండల కేంద్రాలకు, అక్కడి నుండి నేరుగా గ్రామాలకు చేరవేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అందుకు అయ్యే రవాణా ఖర్చులు బడ్జెట్ కోసం ప్రభుత్వానికి నివేదికలు ఆయన అధికారులను ఆదేశించారు. చీరల పంపిణీ కోసం గ్రామ, మండల, డివిజన్, పట్టణస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నోడల్ అధికారిగా డిఆర్‌డిఓ పిడి వెంకటేశ్వర్లును నిమియమించడం జరిగిందని, అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నగర కమిషనర్ నాగేశ్వర్‌రావు, రూరల్ నియోజకవర్గానికి ఆర్డీఓ వినోద్‌కుమార్, ఆర్మూర్ నియోజకవర్గానికి ఆర్డీఓ శ్రీనివాస్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలకు సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్‌ను నియమించడం జరిగిందన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్ కన్వీనర్‌గా, ఎంపిడిఓ, ఎంఇఓ, ఎపిఓ, ఎపిఎం, మండల సమాఖ్య అధ్యక్షురాలు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామ స్థాయిలో విఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్లు, అంగన్‌వాడీ కార్యకర్త, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలును సభ్యులుగా నియమించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వినోద్‌కుమార్, మార్కెటింగ్ ఎడి రియాజ్, కలెక్టరేట్ ఎడి శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేయండి
కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్యాకేజీ 20, 21నిర్మాణాలపై ఈ నెల 22న ఉదయం 11గంటలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నందున అందుకు అవసరమన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ముందుస్తు సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21కింద ఎన్ని గ్రామాలు ప్రయోజనం పొందుతారో, ప్రభావిత గ్రామాల ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ గురించి సమాచారం అందించాలన్నారు. ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరుగు తేదీ, సమయానికి సంబంధించి గ్రామ పంచాయతీలకు సమాచారం చేరవేసినప్పటికీ, ఆ గ్రామాల్లో మరోసారి డప్పు చాటింపు వేయించాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజల అభిప్రాయాలను, సూచనలను, కోర్కెలను వీడియో రికార్డు చేయించాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు సరైన సమాధానం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అలాగే మంత్రులకు, ఎంపిలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు సైతం సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వినోద్‌కుమార్, ఇఇ ఆత్మారావు తదితరులు పాల్గొన్నారు.