కరీంనగర్

సమాజ శ్రేయస్సుకోసం పోలీసులు పని చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రజల భాగస్వామ్మంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ప్రారంభించారు. జమ్మికుంట పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రజల కోసం పని చేస్తే, ప్రజలు పోలీసులను అక్కున చేర్చుకుంటారన్నారు. పోలీసుల పని తీరుతో ప్రజలలో ఆత్మగౌరవం పెంపొందించారన్నారు. జమ్మికుంటలో నిఘా నేత్రాలు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో మాదిరిగా పోలీసులు తిట్టడం, కొట్టకపోయినా, నేరాస్థులకు చట్ట పరిధిలో శిక్షలు తప్పవని, వీణవంకలోజరిగిన అత్యాచార ఘటనలో నేరస్థులకు శిక్ష వేయించడంలో పోలీసులు చిత్తశుద్ధిని ఆ సంఘటన రుజువు చేసిందన్నారు. జమ్మికుంట పట్టణంలో రోజువారీగా లక్ష మంది పనిమీద పనుల నిమిత్తం వస్తుంటారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేసినందుకు సి ఐ ప్రశాంత్‌రెడ్డిని అభినందించారు. నా రాజకీయ జీవితంలో ఏనాడు పోలీసులకు పని చేయాలని ఫోన్ చేయలేదని ఈటల అన్నారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనంగా జమ్మికుంట పోలీసులు పని చేస్తున్నారని అన్నారు. సామాజిక కార్యక్రమాలతోపాటు జాతీయ భావం పెంపొందించేందుకు, రోజూ జాతీయ గీతం ఆలపించే విధంగా పోలీసులు మైక్‌లు ఏర్పాటు చేయాడం హర్షించదగ్గ విషయమన్నారు. మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని దర్గాలో పర్యాటకులు, భక్తుల కోసం నిర్మాణం చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్, కరీంనగర్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఎసిపి రవీందర్‌రెడ్డి, నగరపంచాయితీ చైర్మెన్ పోడేటి రామస్వామి, యంపిపి లత, ఆర్‌డిఓ చెన్నయ్య, తాహశీల్దార్ బావు సింగ్, జమ్మికుంట టౌన్ సి ఐ ప్రశాంత్‌రెడ్డి, జమ్మికుంట రూరల్ సి ఐ నారాయణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

‘నేను సైతం’ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఈటల
జమ్మికుంట: కరీంనగర్ ప్రజల భద్రత కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ కమిషనరేటు పరిధిలో సిపి కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న ‘నేను సైతం’ పోస్టర్‌ను రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్‌లు జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల, సిపి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ మన రక్షణకోసం మనమే నడుం బిగిద్దాం.. ప్రత ఒక్కరూ ఉద్యమంలా కదిలితే అమెరికాలో ఉన్నా రక్షణలా కరీంనగర్‌లో ఉండే చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నేను సైతం కార్యక్రమంలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, కరీంనగర్‌ను మంచి భద్రత గల నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. సిసి కెమెరాలను అమర్చడం వల్ల ఎంతటి నేరాన్ని అయినా బయట పెట్టడం జరుగుతుందన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్, ఎసిపి రవీందర్‌రెడ్డి, సి ఐ ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహాగనుడు సర్వాయి పాపన్న
* చెరువుకట్టపై సర్దార్, బతుకమ్మ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ
* రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
మానకొండూర్: దళిత బహుజనలకు రాజ్యధికారం రావాలనే సంకల్పంతో ఆనాడు పోరాటం చేసిన మహాగనుడు సర్దార్ సర్వాయి పాపన్న అని రాష్టస్రాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం మానకొండూర్ గ్రామా చెరువుకట్టపై సర్వాయి పాపన్న, బతుకమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముఖ్యఅతిథిగా రసమయి బాలకిషన్ పాల్గొని భూమి పూజ చేశారు. ముందుగా సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ సమాజిక వర్గాని చెందిన వ్యక్తి సర్వాయి పాపన్న అని తెలిపారు. ఆయన నివసించిన కేంద్రాలు ఇంకా ఉన్నాయన్నారు. మానకొండూర్ చెరువుకట్టపై సర్దార్ సర్వాయి పాపన్న, బతుకమ్మ విగ్రహాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సహరించాలని కోరారు. వీరులకు చందాల రూపంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం తగదు అన్నారు. దొడి కొంరయ్య, చాకలి ఐలమ్మల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ మల్లగల్ల నగేష్, వైస్‌ఎంపిపి దేవ సతీష్ రెడ్డి, ఎఎంసీవైస్ చైర్మన్ మాడ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపిపి శేఖర్, ఎంపిటిసి శ్యాం, సర్పంచ్ రుద్రవరం శ్రీనివాస్, ఉపసర్పంచ్ వెంకటస్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వెల్పుల రవి, ఎరుకుల శ్రీనివాస్ గౌడ్, దండబోయిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులు రోడ్డెక్కితేనే సమస్య తెలుస్తదా...

* ప్రజల పక్షాన ఆమరణ దీక్ష చేస్తే పట్టింపులేదు
* వైద్య కళాశాలపై స్పందించకపోవడం విచారకరం
* మెడికల్ కాలేజీ కావాలా? వద్దా? స్పష్టం చేయాలి
* కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరిస్తే ఆధారాలు చూపండి
* టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ను ఇటీవలే కొంతమంది రైతులు కలిసి 24గంటల కరెంట్ వద్దంటూ విజ్ఞప్తి చేస్తే, ఇలాకాదు సిఎంకు తెలిసేలా రోడ్డెక్కాలంటూ స్వయంగా కెటిఆర్ పిలుపునిచ్చారని, అంటే రైతులు రోడ్డెక్కితేనే మీ నాయనకు సమస్యలు తెలుస్తాయా లేకపోతే తెలియవా అంటూ టిపిసిసి మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మీ నాయనకు తెలిసేలా రైతులను రోడ్డెక్కమని పిలుపునిచ్చావు సరే, మేము పేద ప్రజల కోసం వైద్య కళాశాల ఏర్పాటుకై ఆమరణ దీక్ష చేస్తే నీకు కనబడలేదా అంటూ కెటిఆర్‌ను నిలదీశారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమరణ దీక్ష చేస్తే కనబడకపాయే ? ట్విట్టర్‌లో ప్రశ్నిస్తే స్పందించరాయే, మరీ ఏంచేస్తే మీకు ప్రజాసమస్యలు విన్పిస్తాయి అంటూ దుయ్యబట్టారు. ఒక మాజీ ఎంపిగా ఐదురోజులు ఆమరణ దీక్ష చేస్తే ప్రభుత్వం స్పందించకోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అయితే, సిఎం ప్రకటించిన హామీని మాత్రమే మేము అడుగుతున్నామని అన్నారు. ఇప్పటికైన నీకు, మీ నాయనకు రాజకీయ జీవితాన్ని అందించిన కరీంనగర్ జిల్లాకు, అందులో మీ నాయన ఇచ్చిన హామీ మేరకు వైద్య కళాశాల కోసం ఎన్‌ఓసి ఇప్పించాలని కెటిఆర్‌కు సూచించారు. వైద్య కళాశాల ఏర్పాటుపై మూడు మాసాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వైద్య కళాశాల కోసం కలిసివచ్చే పార్టీలు, సంఘాలతో చర్చించి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలోనే మెడికల్ కళాశాలను తిరస్కరించినట్లు టిఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారని, ఒకవేళ అలాంటి ఆధారాలుంటే ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. అలాగే కరీంనగర్‌లో వైద్య కళాశాల కావాలా ? వద్దా ? అనే విషయాన్ని టిఆర్‌ఎస్‌కు చెందిన జిల్లా ప్రజాప్రతినిధులు సూటిగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాని కొంతమంది కొన్‌కిస్కాగాళ్లు సూటిగా సమాధానం చెప్పకుండా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, అయినా నాకు బాధలేదని, ప్రజల కోసం ఎన్ని తిట్లైనా తింటానని అన్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు జిల్లా నుంచి తరలిపోయాయని, వైద్య కళాశాల తరలిపోకుండా కరీంనగర్‌లో ఏర్పాటయ్యే వరకు అనేక రకాల ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. తన ఆమరణ దీక్షకు సంఘీభావం ప్రకటించి బాసటగా నిలిచిన అందరికీ ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల ప్రకాష్, కర్ర రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, డి.శంకర్, బుచ్చిరెడ్డి, దిండిగాల మధు తదితరులు పాల్గొన్నారు.

దేశం మొత్తానికి పాఠాలు నేర్పుతున్న సిఎం కెసిఆర్
* గత పాలకుల నిర్లక్ష్యానికి చరమగీతంతో ముందుకు సాగుతున్నాం
* ప్రభుత్వాన్ని కడగేయాల్సిన ప్రతిపక్షాలే పారిపోతున్నాయి
* గౌడన్నలకు ‘గీత తాళ్ళు’ కోసం కార్యాచరణ
* సర్దాపూర్ సభలో మంత్రి కెటిఆర్

సిరిసిల్ల: దేశం మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాఠాలు నేర్పుతున్నారని, దశాబ్దాలుగా కొనసాగిన పాలకుల నిర్లక్ష్యాన్ని పారదోలుతున్నామని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఇంత కాలం అసెంబ్లీలో ఎండిన వరి కంకులు, ఉరి తాళ్ళతో ప్రదర్శనతో పాలక పక్షాలను కడిగేసేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ప్రభుత్వం మాట్లాడుతుంటే విపక్షాలు పారిపోతున్నాయని అన్నారు. 70 ఏళ్ళలో వ్యవసాయం, రైతుల గురించి విపక్షాలు ఏమి మాట్లాడలేదని, కానీ కొత్త రాష్ట్రం రైతుల్లో ఆత్మస్థయర్యం నింపడానికి రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రైతులకు ఎకరాన రూ.4వేలు ఇస్తున్న విషయంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ అబ్బుర పడ్డారని, పంజాబ్ కాంగ్రెస్ ముఖ్య మంత్రి తెలంగాణకు అధికారులను రుణమాఫీపై అధ్యయనంకు పంపితే, ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు సోయి లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎర్రటి ఎండల్లో ఎరువుల కోసం క్యూలు కట్టి స్పృహ తప్పడం, చనిపోవడం జరుగుతుండేదని, రైతులు రాత్రి పూట కరెంటు పెట్టడానికి వెళితే కరెంట్ షాకులకు, పాము కాట్లకు బలయ్యేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, తెలంగాణ ప్రభుత్వంలో ఎరువులు, కరెంటు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నామన్నారు. 24 గంటలు కరెంటు ఇస్తుంటే అంత కరెంటు వద్దని ధర్నాలు చేస్తున్నారని, ఇది కెసిఆర్ పటిమకు, సమర్ధత కాదా అని ప్రశ్నించారు. అయినా కెసిఆర్‌కు సంతృప్తి లేదని, రైతులకు ఇంకా చేయాలన్న తపనలో ఉన్నారన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా వ్యవసాయ యూనివర్శిటీలు ముందుకు రావాలని, విస్తృతంగా పరిశోధనలు జరగాలన్నారు. దేశంలో రెండు కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు అయితే అందులో ఒకటి సిరిసిల్ల జిల్లాకు మంజూరు అయిందన్నారు. సిరిసిల్ల ప్రాంత నేతన్న ఉపాధికి రూ.225 కోట్లతో బతుకమ్మ చీరల ఆర్డర్లతో ఆదుకుంటున్నామని, కార్మికులకు రూ.15 వేల వేతనం దీని వల్ల అందిస్తున్నామన్నారు. ఇక్కడి మెట్ట ప్రాంతంలో బోర్లు, మేఘాలపై రైతులు ఆధారపడి జీవిస్తున్నారని, రైతాంగానికి పని ముట్లు మంజూరు చేస్తే కొంత ఉపశమనం ఉంటుందన్నారు. రైతులు, నేతన్నలు, గొళ్ళ కురుమలతో పాటు అన్ని వృత్తులను ఆదుకుంటున్నామని, త్వరలో ‘గీత తాళ్ళు’ కార్యక్రమానికి గౌడ వృత్తిదారులకు అవకాశం కల్పిస్తున్నామని, గీత తాళ్ళు వల్ల కల్తీలేని, నాణ్యమైన కల్లు లభ్యం అవుతుందని, ఈ వనాలను పెంచడానికి గ్రామానికి ఐదు ఎకరాలు సొసైటీల ద్వారా అందిస్తామని, డ్రిప్ ఇరిగేషన్, స్పింకర్లు, మొక్కలు ఉచితంగా అందిస్తామని, పటిష్టమైన కార్యాచరణ చేపడుతున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పి చైర్‌పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కెడిసిసిబి వైస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, సభ్యులు సురేందరెడ్డి, సెస్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఎఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, గ్రామ సర్పంచ్ అగ్గిరాములు, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఎంపిపి జూపెల్లి శ్రీలత, జడ్పిటిసి మంజుల, జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం
* వసతులను పరిశీలించి, విజిటర్స్ బుక్‌లో సంతకం చేసిన మంత్రి ఈటల

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని శుక్రవారం రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డిఐజి రవివర్మ, జిల్లా ఎస్పీ విశ్వజిత్ కాంపాటి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధునాతన భవన నిర్మాణంలో గల కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్, రిసెప్షన్ రూమ్, వెయిటింగ్ రూమ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ రూమ్, రికార్డ్స్ రూమ్, ఎస్‌హెచ్‌వో రూమ్ మొదలైన వాటిని మంత్రి కలియ తిరిగి పరిశీలించారు. భవన నిర్మాణంలో చురుకుగా అన్ని పనులు దగ్గర ఉండి చూసుకున్న సిబ్బంది ఎఎస్‌ఐ రామచంద్రం, పిసిలు చంద్రవౌళి, జగదీష్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేషధారణలతో మంత్రి కెటి ఆర్‌కు ఘనస్వాగతం పలుకగా, పోలీసుల నుండి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవం అనంతరం విజిటర్స్ పుస్తకంలో మంత్రి కెటిఆర్, ఎంపి వినోద్‌కుమార్‌లు సంతకాలు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, డిఎస్పీ ఎ.చంద్రశేఖర్, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఎఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, సిఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సైదారావు, శేఖర్‌లు పాల్గొన్నారు.