కరీంనగర్

కెసిఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం విడుదల చేసిన రూ.100కోట్లు ఇతర శాఖలకు మళ్లీంచారని, ఇది ఎంతమాత్రం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మున్సిపల్ అభివృద్ధి పనులపై ఏమాత్రం అవగాహన లేని ప్రజారోగ్య, ఆర్‌అండ్‌బి శాఖలకు అప్పగించడం వల్ల నిధులు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని అన్నారు. ఖమ్మం నగరాభివృద్ధికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న పనులను మాత్రం ఆర్‌అండ్‌బి, ప్రజారోగ్యశాఖకు అప్పగించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో నగరపాలక సంస్థకు పనులు చేపట్టే బాధ్యత అప్పగించకపోవడమంటే స్థానిక మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల పట్ల నమ్మకం, విశ్వాసం లేదన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల అభివృద్ధి పనుల విషయంలో నగరపాలక సంస్థతో సమన్వయలోపం ఏర్పడుతుందని తెలిపారు. కరీంనగర్ నగరంలో అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తయిన టెండర్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం సరికాదని అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ప్రజల మద్ధతుతో ఎన్నికైన మేయర్, కార్పోరేటర్లను అవమానపర్చడమేనని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు మున్సిపల్ శాఖ చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు మంత్రి కెటిఆర్‌కు లేఖ పంపనన్నుట్లు సంతోష్‌కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డి.శంకర్, ఆకుల ప్రకాష్, కర్ర రాజశేఖర్, నాయకులు అంజనీప్రసాద్, సరిళ్ల ప్రసాద్, జక్కని ఉమాపతితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.