కరీంనగర్

గణేష్ నిమజ్జన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: జిల్లాలో సెప్టెంబర్ 3న జరిగే గణేష్ నిమజ్జన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీసు కమీషనర్‌తో కలిసి జిల్లా అధికారులతో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గణేష్ నిమజ్జనం కోసం ఐదుచోట్ల స్థలాలను గుర్తించామని, మానకొండూర్, కొత్తపల్లి చెరువులు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్, ఈనాడు ఆఫీస్ వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్, హుజూరాబాద్ ఎస్సారెస్పీ కెనాల్‌లను నిమజ్జన స్థలాలుగా గుర్తించామని తెలిపారు. నిమజ్జన వేడుకలు శాంతియుతంగా జరిగేలా ప్రతీ నిమజ్జన స్థలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు చెప్పారు. నిమజ్జనం రోజు నిమజ్జన స్థలాలలో ఎస్సారెస్పీ ఇంజనీర్లతో సంప్రదించి నీటితో నింపుటకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. నిమజ్జన స్థలాలలో ఒక్కొక్కచోట నాలుగు భారీ క్రేన్లను, హుజూరాబాద్‌లో రెండు క్రేన్లు మొత్తం 18 క్రేన్‌లను ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి సౌకర్యాలను కల్పించాలని, నగరం నుండి నిమజ్జనం స్థలాల వరకు రోడ్ల వెంబడి లైటింగ్ ఏర్పాటు చేయాలని, నిమజ్జన స్థలాలలో జనరేటర్లను ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని, నిమజ్జన పాయింట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గత ఈతగాళ్లను నియమించాలని, నిమజ్జనం పూర్తయ్యేవరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, నిమజ్జన స్థలాల్లో బారీకేడ్లను ఏర్పాటు చేయాలని, నిమజ్జనానికి రెండ్రోజుల ముందు నుండి మద్యం షాపులు మూసివేయాలని, బెల్టు షాపులలో కూడా మద్యం లభించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వినాయక నవరాత్రోత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఏమైనా ప్రజలకు ఇబ్బందులు కలిగితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసే కంట్రోల్ రూముకు ఫోన్ చేసి తెలుపవచ్చని సూచించారు. పోలీసు కమీషనర్ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం, బక్రీద్ పండుగ ఒకేసారి వస్తున్నాయని, ఈ క్రమంలో పటిష్ట పోలీస్ బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనం రాత్రి 2గంటల వరకే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, మద్యాహ్నం 12 గంటల నుండి ఊరేగింపు ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ ఆయేషామస్రత్ ఖానం, ఆర్‌డిఓలు రాజాగౌడ్, చెన్నయ్య, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజేశం, డిపిఓ నారాయణరెడ్డి, మున్సిపల్ ఇఇ మోహన్‌కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, విహెచ్‌పి నేత నవనీతరావు, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.