కరీంనగర్

2018 మార్చికల్లా గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసిందని, దేశమే నివ్వెరపోయే విధంగా రూ.40వేల కోట్ల వ్యయంతో మిషన్ భగరీథ పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, 2018మార్చికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి మంచి నీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లోని రాంనగర్ వాటర్ ట్యాంక్ ఆవరణలో రూ.109కోట్లతో చేపట్టనున్న మిషన్ భగీరథ (అర్బన్) పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 70 నుంచి 80శాతం వరకు మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చాయని, అటు వాటర్ గ్రిడ్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నగరంలో చేపట్టే పనులు టైమ్ ప్రకారం నాణ్యతతో కూడిన పనులు కొనసాగుతాయని, 2018 దసరా నాటికి కరీంనగర్ నగరంలో ఇంటింటికి ప్రతిరోజు నల్లాల ద్వారా మంచి నీరందిస్తామని మంత్రి రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర కార్పోరేటర్లు బోనాల శ్రీకాంత్, బండారి వేణు, సునీల్‌రావు, నాయకులు కట్ల సతీష్, చల్లా హరిశంకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.