పశ్చిమగోదావరి

నీటి భద్రతే ప్రధాని ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: తక్కువ నీటితో ఎక్కువ సాగుచేస్తున్న ఇజ్రాయిల్ దేశంలో అవలంబిస్తున్న నీటి యాజమాన్య పద్దతులను భారతదేశంలో అమలు చేసేందుకు దేశ ప్రధాని నరేంద్రమోడీ సంకల్పించారని జలవనరుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హుకుంసింగ్ చెప్పారు. జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం స్థానిక ఎంపి మాగంటి బాబు ఆహ్వానం మేరకు ఏలూరు మాగంటి బాబు క్యాంపు కార్యాలయానికి ఛైర్మన్ హుకుంసింగ్‌తోపాటు మిగిలిన కమిటీ సభ్యులు వచ్చారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ హుకుంసింగ్ విలేఖరులతో మాట్లాడుతూ దేశ అవసరాలకు సరిపడా నీటి వనరులను కల్పించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని నీటి భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అవసరమైన నివేదికలను రూపొందించాలని ప్రధాని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ మేరకు తమ బృందం ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలను సందర్శించి, స్థానిక జలవనరుల ప్రాజెక్టులను, నీటి వనరుల స్థితిగతులను పరిశీలిస్తామన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జాతీయ ప్రాజెక్టు పరిశీలనకు తమ బృందం రావడం సంతోషంగా ఉందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు నీరు అందించే అవకాశాలున్నాయన్నారు. ప్రతీ నీటి చుక్క పొదుపు చేసుకుని నీటి భద్రతను పాటించవలసి వుందన్నారు. గోదావరి పుట్టిన చోట చిన్న కాల్వగా ప్రవాహం ప్రారంభమైనప్పటికీ ఈ ప్రాంతానికి చేరేటప్పటికి సువిశాలంగా నీటి పారుదల జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిత్యం సమీక్షిస్తూ పనులను శరవేగంతో తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనీయుడన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఎంతో ప్రవాహంతో పరవళ్లు త్రొక్కుతున్న గోదావరిని చూడడం తమ అదృష్టంగా భావించామని ఆయన చెప్పారు. కమిటీ సభ్యుడు, రాజమండ్రి ఎంపి మురళీ మోహన్ మాట్లాడుతూ తమ కమిటీ ప్రతీ ఏడాదీ దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తందదన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కమిటీ పర్యటిస్తున్నదన్నారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ప్రధానంగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు విషయంలో సిఎం చంద్రబాబు ఆలోచనలను కమిటీ సభ్యులు మెచ్చుకున్నారన్నారు. వారంతా మంచి ప్రాజెక్టు చూశామన్న భావనను వ్యక్తం చేశారని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు అందించే విషయంలో ప్రధాని మోడీ ఎంతో సహకరిస్తున్నారని నాబార్డు ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ కమిటీ సభ్యులంతా రోజంతా పర్యటించినప్పటికీ తన ఆహ్వానం మేరకు ఏలూరులోని తమ స్వగృహానికి రావడం తనకు ఆనందంగా వుందన్నారు. ఈ సందర్భంగా జలవనరుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హుకుంసింగ్‌తోపాటు సభ్యులు మాగంటి మురళీమోహన్, వి సత్యభామ, అపూరూపకోద్దార్, సర్ధార్ బల్విందర్ ఎస్ గుహందర్, హర్షవర్ధన్ సింగ్ దుంగార్‌పూర్, రాపోలు ఆనంద భాస్కర్, ప్రదీప్ తమాటా, డాక్టర్ సిద్ధాంత్ మహోపాత్రా, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనలవరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావులను మాగంటి బాబు దంపతులు దుశ్శాలువాలతో సత్కరించి నూతన వస్త్రాలను బహూకరించారు. తొలుత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందానికి మాగంటి బాబు అల్పాహార విందు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మాగంటి రాంజీ, నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ మెంబర్ ఎస్ ఎం ఆర్ పెదబాబు పాల్గొని కమిటీ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సెన్సార్‌బోర్డు సభ్యులు గుత్తా చం6దశేఖర్, నగరపాలక సంస్థ విప్ గూడవల్లి శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు, ఏలూరు ఆర్‌డివో జి చక్రధరరావు, డి ఎస్‌పి జి వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ ఎస్ ఇ శ్రీనివాసయాదవ్, తహశీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.