విజయనగరం

బయోమెట్రిక్ డివైజ్‌లు లేక మీ సేవ సర్వీసులు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి: జిల్లాలోని బయోమెట్రిక్ డివైజ్‌లు వినియోగించడంలేదనే సాకుతో సుమారు 170 మీసేవా కేంద్రాలకు చెందిన సేవలను నిలిపివేశారు. ఈ నెల 17 మధ్యాహ నం మూడు గంటల నుంచి నిలిపివేసిన సేవలను ఇప్పటికీ ప్రారంభించకపోవడం నిర్వాహకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంతవరకు బయోమెట్రిక్ పరికరం అవసరమవుతుందని చెప్పిన కాంట్రాక్టర్లు ఇప్పుడు తప్పనిసరి అంటూ నిబంధనలు విధించి సేవలను నిలిపివేయడంతో తమకు వ్యాపారాలు సాగడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సాకును కొంతమంది కాసుల వర్షం కురిపించుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. బయోమెట్రిక్ పరికరం తప్పనిసరి కావడంతో ఎక్కడా లభించడంలేదని ఉన్న పరికరాల ధరలను పెంచేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సాధారణంగా బయోమెట్రిక్ పరికరం ధర సుమారు రూ.2800 నుంచి మూడు వేలు వరకు బయట లభిస్తుండగా మరికొంతమంది రూ.3500 వరకు ధరను నిర్ణయించడంపై నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండురోజులుగా మీసేవా సర్వీసులు అందించకపోతే తమ వ్యాపారం దెబ్బతింటుందని, ఇప్పటివరకు ఉన్న పేరు పోతుందని పలువురు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు చేయకుండానే ఇష్టానుసారం సేవలు నిలిపివేయడంపై మండిపడుతున్నారు. ఒక్కసారిగా ఇంత మొత్తంతో బయోమెట్రిక్ పరికరం కొనుగోలు చెయ్యడం చిన్నాచితక మీసేవా కేంద్రాలకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందన్న విషయాన్ని పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో సిఎం ఎస్, ఎపి ఆన్‌లైన్, రామ్ ఇన్ఫో కంపెనీలకు ప్రభుత్వం మీసేవా సర్వీసులను అప్పగించింది. అయితే ఎపి ఆన్‌లైన్, రామ్ ఇన్ఫో కంపెనీలుకు చెందిన కేంద్రాల్లో నిరాటంకంగా సేవలు నిర్వాహకులు అందిస్తుండగా జిల్లాలో అత్యధిక కేంద్రాలు కలిగిన సి ఎం ఎస్ కంపెనీకి చెందిన కేంద్రాలు సుమారు 170 వరకు మీసేవా సేవలందించ లేకపోతున్నాయి. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి మీసేవలు నిలిచిపోయిన కేంద్రాలకు వెంటనే సర్వీసులు పునరుద్దరించడానికి చర్యలు చేపట్టాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సేవలు నిలిపివేత
ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఐదు నిమిషాల్లో పాస్‌బుక్ సేవలకు బయోమెట్రిక్ పరికరం అవసరం కావడంతో సర్వీసును రైతులకు అందించేందుకు తప్పనిసరికావడంతో సుమారు 170 కేంద్రాలకు మీసేవా సర్వీసులు నిలిపివేసినట్టు సిఎంఎస్ జిల్లా మేనేజర్ ఎస్ పైడిపునాయుడు తెలిపారు. సేవలు నిలిపివేయడంపై ఆయన్ని వివరణ కోరగా ఈ విధంగా స్పందించారు. రైతులకు అందించే పాస్‌బుక్ సేవలను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినట్టు ఆయన తెలిపారు.