విజయనగరం

మలేరియా విజృంభణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్): పార్వతీపురం సబ్-ప్లాన్‌లో మలేరియా విజృంభిస్తోంది. దాదాపు మే నెల నుండే మన్యంలో ప్రారంభైన మలేరియా జ్వరాలు అప్పటి నుండి ఇప్పటి వరకు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. దీంతో మన్యంలోని గిరిజనులతో పాటు మైదాన ప్రాంతాలకు చెందిన ప్రజలు మలేరియాతో మంచాన పడుతున్నారు. ఇప్పటికే పార్వతీపురం సబ్-ప్లాన్‌లో గత ఏడాది కంటే ఈ ఏడాది మలేరియా కేసులు అధికంగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాలలో అపారిశుద్ధ్యం నెలకొనడంతో దోమలు విపరీతంగా పెరిగి మలేరియాకు కారణమవుతున్నాయని ప్రజలంటున్నారు. జ్వరానికి ఏమాత్రం ఆలస్యం చేసినా సెరిబ్రల్‌గా మారుతోందని, అటువంటి సమయంలో విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోందటున్నారు. ఇక ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సైతం మలేరియా భారిన పడుతున్నారు. ప్రస్తు త రోజుల్లో మలేరియా అంటే పేదలు భరించలేని ఖరీదైన రోగంగాపరిణమించిందని ప్రజలంటున్నారు. మలేరియా వస్తే ఆర్థికంగా చితికిపోతున్నామని, అలాగే శారీరకంగా కూడా కుంగిపోతున్నామని వాపోతున్నారు. ఇక మలేరియా విజృంభించడంతో ఆయా మం డలాల్లోని పిహెచ్‌సీలతో పాటు సంచి వైద్యులు, ఏరియా ఆసుపత్రికి రోగులు పరుగులు తీస్తున్నారు. ఆయా ప్రాంతాలలో ప్రమాదకరమైన మలేరియా పి.ఎఫ్. 95శాతం వరకు నమోదవుతున్నాయంటున్నారు. ఆయా ప్రాం తాల నుండి మలేరియా జ్వరపీడితులు ఏరియా ఆసుపత్రికి క్యూ కడుతుండడంతో ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. దీంతో మంచానికి ఇద్దరు, ముగ్గురు రోగుల చొప్పున సర్దుబాటు చేయాల్సి వస్తోందని ఆసుపత్రి వర్గాలు వాపోతున్నాయి. మలేరియా వలన అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నా అవి వెలుగులోకి రావడం లేదు. ఒకవేళ వచ్చినా అవి మలేరియా కాదని అధికారులు సెలవిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ ఏడాది మలేరియా దోమల నివారణ చర్యలు అంతగా ఫలితం ఇవ్వకపోవడంతో మే నెల నుండి విజృంభిస్తూ వస్తోందని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి మలేరియా అదుపునకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.