చిత్తూరు

హత్య కేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చేతబడి చేసి హతమార్చుతాడన్న అనుమానంతో తమిళనాడు వాసిని హత్య చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు డిఎస్పీ సుబ్బారావు వెల్లడించారు. డిఎస్పీ కథనం మేరుకు ఈనెల 9న చిత్తూరు నగరం ఆషాడవీధిలోని తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన అప్రోజ్ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన నగరంలో నడివీధిలో చోటు చేసుకోవడంతో కలకలం రేకెత్తించిందన్నారు. దీంతో ఈ ఘటనపై చిత్తూరు టూటౌన్ సిఐ వెంకటప్ప ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు వెలుగుచూశాయన్నారు. నగరంలోని రంగాచ్చారి వీధికి చెందిన విజయ్ తరుచూ తన భార్య శిరీషను కొడుతూ ఉండగా దీన్ని పక్క ఇంటిలో ఉన్న రాజా అడ్డుకొని శిరీషకు ఆశ్రయం ఇచ్చాడు. దీంతో విజయ్ తన స్నేహితుడైన తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన అఫ్రోజ్‌ను ఆశ్రయించాడు. అఫ్రోజ్ తన మంత్ర శక్తులతో రాజాను హతమార్చుతాని బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు. దీంతో ఎక్కడ తనను చేతబడితో అఫ్రోజ్ హత్య చేస్తాడోనని రాజా భయపడ్డాడు. ఈ నేపధ్యంలో అఫ్రోజన్‌నే తానే హత్య చేయాలని నిర్ణయానికి వచ్చి ఈ విషయాన్ని తన స్నేహితులైన చిత్తూరు నగరానికి చెందిన బాలాజీ, శరవణలకు చెప్పి హత్యకు పన్నాగం పన్నారు. దీంతో ఈనెల 9న ఈ ముగ్గురు అఫ్రోజ్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి మృతదేహాన్ని ఆషాడ వీధిలో పడేసి పారిపోయారు. దీంతో వీరిపై నిఘా ఉంచడంతో శుక్రవారం నగరంలోని తోటపాళ్యంవద్ద రాజా, బాలాజీ, శరవణలు ఉన్నట్లు సమాచారం రావడంతో వలపన్ని అరెస్టు చేసినట్లు డిఎస్సీ తెలిపారు. కేవలం అఫ్రోజ్ తనను చేతబడిచేసి చంపుతాడన్న నెపంతోనే రాజా అతన్ని అడ్డుతొలగించుకొనేందును ఈ హత్యకు పాల్పడినట్లు డిఎస్పీ వివరించారు.