చిత్తూరు

డాలర్ కుంభకోణంలో టిటిడి అధికారులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: గత పది సంవత్సరాల క్రితం తిరుమలలో బంగారు డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి అధికారులు డాలర్ శేషాద్రి, ప్రభాకర్ రెడ్డి, ఏఇఓ వాసుదేవన్‌లకు సంబంధం లేదని ప్రభుత్వం తేల్చేసింది. వివరాల్లోకి వెళితే 2007లో 300 బంగారు డాలర్లు కుంభకోణం జరిగిన విషయం పాఠకులకు విధితమే. ఈ సంఘటనలో అప్పట్లో షరాబుగా ఉన్న వ్యక్తిని టిటిడి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా శేషాద్రి, ప్రభాకర్ రెడ్డి, ఏఇఓ వాసుదేవన్‌లపై చర్యలు తీసుకుంది. అనంతరం ఈ సంఘటనపై పలు కమిటీలు విచారణ జరిపాయి. ప్రస్తుతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి డిప్యూటీ ఇఓప్రభాకర్ రెడ్డి, ఏఇఓ వాసుదేవన్‌లు ఉద్యోగ విరమణ పొందారు. డాలర్ శేషాద్రి కూడా ఉద్యోగ విరమణ పొందినా, ప్రస్తుతం ఆయన ఓఎస్‌డిగా శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఈ కుంభకోణంలో ఎలాంటి సంబంధం లేదని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తేల్చేసింది. ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు మాట్లాడుతూ స్వామివారి సన్నిధిలో ధర్మం గెలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.