చిత్తూరు

హైవే భూసేకరణ పనులు, ఫారెస్ట్ క్లియరెన్స్‌లను నవంబర్‌లోగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న హైవే భూసేకరణ పనులను, ఫారెస్ట్ క్లియరెన్స్ పనులను నవంబర్‌లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుపతికి విచ్చేసిన ముఖ్యమంత్రి పద్మావతి అతిథి భవనంలో జిల్లా, టిటిడి, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జిల్లా అభివృద్ధి పనులపై సమీక్షించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా జాతీయ రహదారుల ప్రగతిపై ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠమాల, కపిలతీర్థం, కరకంబాడి, రేణిగుంట, ఎయిర్‌పోర్టు నుంచి ఏర్పేడు వరకు రహదారులు, రంగంపేట స్ట్రైట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కరకంబాడి వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కృష్ణగిరి - పలమనేరు రోడ్డు, పీలేరు-పూతలపట్టురోడ్డును నవంబర్ 1వ తేదీకి ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు. బెంగళూరు-చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ హైవే భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అటవీప్రాంతాన్ని పరిరక్షిస్తూ భూసేకరణచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. హంద్రీ-నీవా పనులను, పెద్దమండ్యం లిప్ట్ ఇరిగేషన్ పనులను నీరు-ప్రగతి చెక్‌డ్యాం పనులను వేగవంతం చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో 80శాతంకు పైగా ప్రజలు సంతృప్తి చెందేలా, పారదర్శకంగా అవినీతి రహితంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, టిటిడి ఇఓ సింఘాల్, జెసి గిరీషా, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు, ఇంజినీర్లు, ఎంహెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.