అనంతపురం

ధర్మవరం మున్సిపాలిటీలో ముసలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం:్ధర్మవరం మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. అధికార పార్టీ పాలకవర్గం రెండుగా చీలిపోయింది. గత కొన్నాళ్ళుగా పాలకవర్గంలోని ఛైర్మన్ బీరే గోపాలకృష్ణ, అధికార పార్టీలోని కౌన్సిలర్ల మధ్య నివురుగప్పిన నిప్పులా వున్న అంతర్గత విభేదాలు శుక్రవారం కౌన్సిల్ సమావేశంలోనే బయటపడ్డాయి. ఛైర్మన్ బీరేను లక్ష్యంగా చేసుకుని ఆయనను ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు ఉడుముల రామచంద్ర, పామిశెట్టి శివశంకర్‌లు మున్సిపాలిటీ అవినీతిమయంలో కూరుకుపోయిందంటూ ఆరోపణలు సంధించారు. సమావేశంలోనే ఛైర్మన్ సమాధానం చెప్పాలంటు పట్టుబట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా ఛైర్మన్ వర్గం, ఇతర సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఎట్టకేలకు బయటపడ్డాయి. మున్సిపల్ ఛైర్మన్ బీరే గోపాలకృష్ణ 2014లో ఛైర్మన్ పీఠాన్ని అధిరోహించిన సమయంలోనే కొందరు సభ్యులు తమకు ఛైర్మన్ పదవి కావాలంటూ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను కోరడంతో వారికి ఆ సమయంలో ఎమ్మెల్యే కొన్నాళ్ళ తర్వాత మీ కోరిక తీరుతుందిలే అని మాటిచ్చినట్లు అధికార పార్టీ సభ్యులు గత కొన్నాళ్ళుగా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ఛైర్మన్‌ను పదవి నుండి తప్పించి తమకు ఛైర్మన్ పదవి ఇవ్వాలంటు ఉడుముల రామచంద్ర, అతని అనుచర వర్గం ఎమ్మెల్యేను పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న ఛైర్మన్ బీరే గోపాలకృష్ణ ఎమ్మెల్యే గోనుగుంట్లతో సైతం ఎడమొహం, పెడమొహంగా కొన్నాళ్ళపాటు వున్నారు. అనంతరం జరిగిన చర్చల్లో వారిద్దరు రాజీ అయినట్లు కుదిరినా పాలకవర్గంలో మాత్రం విభేదాలు చల్లారలేదు. ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తు తమతో ఏమాత్రం సంప్రదించకుండా మున్సిపాలిటీ వ్యవహారాల్లో తమను తలదూర్చనివ్వకుండా ఇష్టారాజ్యంగా అంతా తానై వ్యవహరిస్తున్నారని, గత కొన్నాళ్ళుగా పలువురు ఛైర్మన్ వ్యతిరేక సభ్యులు చెబుతున్నప్పటికి కౌన్సిల్ సమావేశంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమావేశాలు నిర్వహించారు. అయితే ఛైర్మన్ తన పదవి నుండి తప్పుకునేందుకు ససేమీరా అనడంతో పాటు కొందరు కౌన్సిలర్లను తనవైపుకు తిప్పుకుని తన రాజకీయ వ్యూహం పన్నడంతో పార్టీ పరువు రచ్చకెక్కకుండా ఎమ్మెల్యే ఇరువర్గాలను శాంతింపచేసినా అది ఎంతోకాలం నిలవలేదు. ఇక పదవి దక్కలేదన్న ఛైర్మన్ వ్యతిరేక వర్గం కౌన్సిల్ సమావేశాలనే వేదికగా చేసుకుంది. దీంతో గత మూడేళ్ళ నుండి కౌన్సిల్ సమావేశాల్లో ఎలాంటి ప్రశ్నలు సంధించని అధికార పార్టీ సభ్యులు ఉడుముల రామచంద్ర, పామిశెట్టి శివశంకర్‌లతో పాటు పలువురు సభ్యులు విద్యుత్ బకాయిలను సాకుగా చేసుకుని ఛైర్మన్‌పై ప్రత్యక్ష యుద్ధానికే తెరలేపారు. ఛైర్మన్ సైతం తాను ఎమ్మెల్యేతో సంప్రదించే అభివృద్ధి పనుల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నానని, అజెండాలోని అంశాలు సైతం ఆయన దృష్టికి తీసుకెళ్తున్నామని, తన మీదికి ఎలాంటి నెపం లేకుండా చేసుకునేందుకు శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలోనే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చుతాడా అన్న విషయం అందరి అధికార పార్టీ నేతల్లోను చర్చ జోరందుకుంది. ఇప్పటికే మున్సిపల్ పాలక వర్గంలోని పలువురు టిడిపి కౌన్సిలర్లు పార్టీకి దూరంగా వుంటూ వుండడంతో పాటు నేడు ఛైర్మన్, ఇతర సభ్యుల మధ్య విభేదాలు రావడం, అవి కౌన్సిల్ సమావేశంలోనే బయటపడడంతో ఎమ్మెల్యే వీరి మధ్య రాజీ కుదురుస్తాడా ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.