విశాఖపట్నం

మెట్రో మళ్లీ మొదటికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు ఒక అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కు పడుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలు విశాఖలో మెట్రోప్రాజెక్టు వస్తుందా రాదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం నిధులు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకుని మెట్రోప్రాజెక్టులు పూర్తి చేయాలని భావించారు. అయితే ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో మెట్రోరైల్ ప్రాజెక్టుల్లో ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు సంస్థల ఆగమనంపైనే మెట్రోరైల్ ప్రాజెక్టుల భవితవ్యం ఆధారపడనుంది. నాలుగేళ్ల కిందట రాష్ట్ర విభజనకు ముందు అప్పటి యుపిఎ ప్రభుత్వం విశాఖకు మెట్రోరైల్ ప్రకటించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా విశాఖ మెట్రోరైల్‌కు పచ్చజెండా ఊపింది. ఎన్‌ఎడి నుంచి హనుమంతవాక జంక్షన్ వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రతిపాదించగా, తర్జన భర్జనల అనంతరం గాజువాక నుంచి కొమ్మాది వరకూ దాదాపు 43 కిలోమీటర్ల మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టాలని భావించారు. దాదాపు రూ.12,500 భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి 20 శాతం భరించగా, మిగిలిన మొత్తాన్ని రుణంగా సేకరించాలనుకున్నారు. దీనికోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంప్రదించారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు తొలుత జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) ముందుకు వచ్చింది. మెట్రోరైల్ ప్రాజెక్టుకయ్యే వ్యయం, వచ్చే ఆదాయంపై లెక్కలు కట్టిన జైకా లాభాలు కష్టమని నిర్ధారణకు వచ్చి వెనక్కు తగ్గింది. అనంతరం జర్మనీకి చెందిన మరో ఆర్థిక సంస్థ విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు అంగీకరించినా వ్యవహారం ముందుకు కదల్లేదు. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి సవివర పథక నివేదిక (డిపిఆర్) తయారు చేసే బాధ్యతను ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్ట్ కమిషన్ (డిఎంఆర్‌సి)కి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు కారిడార్లుగా మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించారు. గాజువాక నుంచి కొమ్మాది వరకూ 30.38 కిమీ ప్రాధాన్య కారిడార్ కాగా, తాటిచెట్లపాలెం నుంచి వాల్తేరు వరకూ 6.9 కిమీ మేర రెండో కారిడార్‌ను, గురుద్వారా నుంచి పాతపోష్ట్ఫాసు వరకూ 5.92 కిమీ మేర మూడో కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికోసం సమగ్ర పథక నివేకను తయారు చేసే బాధ్యతను డిఎంఆర్‌సికి అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న డిఎంఆర్‌సి మెట్రోప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసార పరీక్షలు కూడా పూర్తి చేశారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మెట్రోరైల్ ప్రాజెక్టుల్లో తప్పనిసరిగా ప్రైవేటు భాగస్వామ్యం అవసరం కావడంతో అయోమయంలో పడింది. ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే మరోసారి డిపిఆర్ తయారు చేయాల్సిందే. అయితే విశాఖ వంటి నగరంలో మెట్రోరైల్ ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇస్తుందా లేక నష్టాలు మిగులుస్తుందా అన్న విషయంపై సరైన అంచనాలు లేనిదే ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావన్నది వాస్తవం. దీనికి తోడు మరోసారి డిపిఆర్ తయారు చేసుకోవడం అంటే ప్రాజెక్టు ప్రతిపాదనకు మరింత ఆలస్యం తప్పేట్టులేదు. ఇదే అంశంపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.