విశాఖపట్నం

దుమ్ము దులుపుతున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ వార్డులను 81కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జివిఎంసి అధికారులలో చలనం మొదలైంది. ప్రస్తుతం ఉన్న 72 వార్డులను 81కి పెంచుతూ మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది.
2001 జనాభా లెక్కల ప్రకారం 2007లో జివిఎంసికి ఎన్నికలు జరిగాయి. ఈ జనాభా ఆధారంగా 72 వార్డులను విభజించారు. 2005లో గాజువాక మున్సిపాలిటీతోపాటు 32 పంచాయతీలను జివిఎంసిలో విలీనం చేశారు. అదనంగా వచ్చిన ఈ జనాభాతోపాటు, నగర జనాభా కూడా గణనీయంగా పెరిగింది. దీంతో 2007 ఎన్నికల నాటికి ఉన్న వార్డుల కన్నా, జనాభా ఎక్కువగానే ఉంది. ఆ తరువాత 2012లో జివిఎంసిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలతోపాటు, ఐదు పంచాయతీలను విలీనం చేశారు. ఇదే సమయంలో విశాఖ నగర జనాభా బాగా పెరిగిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజన చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. అంటే 18.81 లక్షల జనాభాతో 81 వార్డులుగా విభజించాలన్నది ఆ ఆదేశాల సారాంశం. కానీ ఇప్పుడు విలీన మున్సిపాలిటీలు, పంచాయతీలు, నగర జనాభా అంతటినీ కలుపుకొంటే, 22 లక్షలకు పైగానే ఉంది. ఈ జనాభా ఆధారంగా వార్డులను పునర్విభజించాలంటే 85 వరకూ వస్తాయి. కానీ 2011 జనాభా ఆధారంగానే వార్డుల విభజన చేయాల్సి వస్తోంది.
ఇదిలా ఉండగా జివిఎంసిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, పంచాయతీల విలీనానికి సంబంధించి ఫైళ్లను అధికారులు ఇప్పుడు వెలికి తీస్తున్నారు. ఇన్నాళ్లు వీటి అవసరం పడలేదు. వీటితోపాటు పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన ఫైళ్లను కూడా బయటకు తీస్తున్నారు. భీమిలి మున్సిపాలిటీని జివిఎంసిలో విలీనం చేయద్దంటూ దాఖలైన కేసుపై ఈనెల 22, 23 తేదీల్లో హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
ఇక, భీమిలి జివిఎంసిలో విలీనం అయినప్పటికీ, ఈ అంశం కోర్టులో ఉండడం వలన వార్డుల విభజనకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భీమిలి మున్సిపాలిటీ అంతా కలిపి ఒక్క వార్డుగా మారబోతోంది. అది కూడా ఒకటో వార్డుగానే మారాల్సి ఉంది. వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలంటే, కోర్టు కేసు పరిష్కారమవ్వాలి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది. అందుకు కావల్సిన సమాచారాన్ని జివిఎంసి అధికారులు సిద్ధం చేస్తున్నారు.