కృష్ణ

రాష్ట్రానికి క్యూ కట్టిన పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అంతర్జాతీయ కంపెనీలన్నీ నవ్యాంధ్రప్రదేశ్‌కు తరలిరావడానికి క్యూ కట్టాయనే విషయం ఎన్‌సిఎఇఆర్ (నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్) నివేదిక ద్వారా మరోసారి స్పష్టమయిందని రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పంచుమర్తి అనూరాధ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు దేశ విదేశాల్లో పర్యటించి అత్యుత్తమ కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తీసుకువస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో పొరుగు రాష్ట్రాల కంటే నవ్యాంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు తమ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం క్రమంగా సాకారమవుతోందని అన్నారు. ఎన్‌సిఎఇఆర్ నిర్వహించిన స్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ పొటెన్షియల్ ఇండెక్స్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పనితీరును మెరుగుపర్చుకుందన్నారు. గత ఏడాదిలో ఉన్న నాలుగో ర్యాంకు నుంచి 3వ ర్యాంకుకు ఎగబాకిందన్నారు. ముఖ్యమంత్రి పనితీరుకు ఎన్‌సిఎఇఆర్ సర్వే నివేదికే నిదర్శనమన్నారు. భూమి, కార్మికుల లభ్యతతో పాటు పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థానంలో నిలిచిందన్నారు. అవినీతిపరమైన సమస్యల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ 21 రాష్ట్రాల్లో 19వ ర్యాంకులో నిలిచింది. పారిశ్రామిక అవసరాల కోసం సులభంగా భూసేకరణ చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ స్థానంలో నిలిచిందన్నారు. భూసేకరణలో చూపుతున్న వేగం, ఆకర్షణీయ నగరాల సంఖ్య, పోర్టుల్లో సరకు రవాణా ఏపీ బలాలుగా నిలిచాయని అన్నారు.
గత మూడేళ్లలో పరిశ్రమల స్థాపన కోసం పలు సంస్థలు రూ.2,60,876 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 3,61,917 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనుంది. యువత ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా పలు అంతర్జాతీయ సంస్థలే రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇసుజు మోటార్స్ రూ.3వేల కోట్ల పెట్టుబడి పెట్టగా 3వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇదే జిల్లాలో హీరో మోటార్స్ కార్ప్ పరిశ్రమ రూ.1600 కోట్ల పెట్టుబడులు పెట్టి, 5వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. కర్నూలులో రూ.150 కోట్ల పెట్టుబడితో సోలార్ రెన్యూ, రూ.1000 కోట్ల పెట్టుబడితో డీఆర్‌డివో యూనిట్ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటి ద్వారా 3, 100 మందికి ఉద్యోగాలు లభించాయి. అనంతపురం జిల్లాలో కల్యాణి స్టీల్స్ రూ.1000 కోట్ల పెట్టుబడితో 2వేల మందికి, విటల్ ఇన్నోవేషన్స్ రూ.5వేల కోట్ల పెట్టుబడితో 5వేల మందికి, రూ.500 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ, రూ.7వేల కోట్ల పెట్టుబడితో కియ మోటార్స్ కంపెనీ 12వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. వీటితోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు పరిశ్రమలు తరలి వచ్చాయని అనూరాధ వివరించారు.