కృష్ణ

శాసన సభ భవన నిర్మాణ పనులకు మరో 15 రోజుల్లో టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో సిఆర్‌డిఎ 45శాతం మేర లక్ష్యాలను అధిగమించగా మరో 15రోజుల్లో ఎపి శాసనసభ భవన నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. నగరంలోని సిఆర్‌డిఎ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్ కమిషనర్ శ్రీ్ధర్‌తో సమావేశమైన నేపథ్యంలో రాజధాని నిర్మాణ పనుల ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రభుత్వ నగరంలో నిర్మించే భవనాల ఆకృతుల్ని రూపొందించేందుకు నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సేవలను వినియోగిస్తున్నామని, ప్రధానంగా హైకోర్టు, శాసన సభ భవనాల ఐకానిక్ భవనాలుగా నిర్మించేందుకు చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. అసెంబ్లీ భవనాన్ని వజ్రం ఆకృతిలో నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారని, ఇందుకు సంబంధించిన ఆకృతులను దాదాపు ఖరారు చేయగా మరో 15 రోజుల్లో టెండర్లను ఆహ్వానించి పనుల వేగవంతానికి కృషి చేస్తున్నామన్నారు. 3.5లక్షల చదరపు అడుగుల మేర నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి 35 ఎకరాలను కేటాయించామన్నారు. అలాగే హైకోర్టు భవనాన్ని స్థూపం ఆకృతిలో నిర్మిస్తుండగా ఇందుకు 50 ఎకరాల విస్తీర్ణంలో 7.7లక్షల చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలో హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నామని వివరించారు. ఈ రెండు భవనాల నిర్మాణ పనులను రాబోయే అక్టోబర్ నెలలో ప్రారంభించి వచ్చే సంవత్సరం 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులను నిర్వహిస్తున్నామన్నారు. వీటితోపాటు ఇతర ప్రభుత్వ భవనాలను మరో 55 ఎకరాల్లో నిర్మిస్తుండగా, 7 ఎకరాల్లో సిటీ స్క్వేర్ కూడా నిర్మించి అక్కడ ప్రజల సందర్శనకు వివిధ కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకూ 45శాతం మేర లక్ష్యాలను సాధించినట్లు సిఆర్‌డిఎ భూ సమీకరణ, మాస్టర్ ప్లాన్, విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. ఈ వృద్ధిరేటు సాధించడానికి నయా రాజధాని నగరాలైన రాయపూర్, గాంధీనగర్ వంటి నగరాలకు 10 సంవత్సరాలు పట్టగా అతికొద్ది కాలంలో సిఆర్‌డిఎ వృద్ధిరేటు సాధించిందన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తిరిగి 73,732 ప్లాట్లను కేటాయించామని, వీటిని 13 జోన్లుగా విభజించి లే అవుట్ల అభివృద్ధిపర్చుతుండగా 40శాతం మేర ప్లాట్ల ప్లగ్ మార్కింగ్ పనులు పూర్తయినారన్నారు. ప్రస్తుతం సచివాలయంగా వినియోగిస్తున్న 6 బ్లాకుల వెలగపూడి ప్రభుత్వ భవనాల సముదాయాన్ని జి ప్లస్ 7 పునాదుల సామర్థ్యంతో నిర్మించగా ప్రభుత్వ నగరంలో శాశ్వత భవనాల నిర్మాణ పనులు పూర్తవగానే వీటిని ఐటి సంస్థలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వభవనాల నిర్మాణాలతోపాటు 17 వందల కిలో మీటర్ల రోడ్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తుండగా రాజధానిని కలుపుతూ మేజర్ ఆర్టీరియల్ రోడ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. మేజర్, సబ్ అర్టీరియల్ రోడ్లు, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. తొలిదశ ప్రభుత్వ నగరంలోని ప్రతిపాదించిన భవనాలు, రోడ్లు, వంటి ఇతర వౌలిక సదుపాయాల పనులకు సుమారు 30 వేల కోట్ల రూపాయల అవసరమవుతాయని, రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 94, సబ్ సెక్షన్ 3 ప్రకారం ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాల్సి ఉందన్నారు. దీనిపై వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపి నిధుల విడుదలకు కృషి చేస్తున్నామన్నారు. జాతీయ రహదారు అభివృద్ధి ప్రాజెక్టు ఐదో దశలో మంజూరైన విజయవాడ బైపాస్ రోడ్డు ప్రస్తుత రాజధాని అవసరాలకు అనుగుణంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రవీణ్‌ప్రకాశ్ కోరగా శ్రీ్ధర్ స్మార్ట్‌సిటీ ప్రతిపాదనల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి విడుదల చేయాల్సిన 500 కోట్ల రూపాయలను త్వరిత విడుదలకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించబోయే ప్రజా రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నుంచి రావాల్సిన నిధుల సహాయం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల వివరాలను అడిగి తెలుసుకొన్న ప్రవీణ్‌ప్రకాశ్ ఇందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు.