కృష్ణ

ఎడిసి ప్రాజెక్టులకు ఇరిగేషన్ పూర్తి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు తమ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నగరంలోని కేదరేశ్వరపేట అమరావతి అభివృద్ధి సంస్థ (ఎడిసి) కార్యాలయంలో సిఎండి లక్ష్మీపార్థసారథితో ఇరిగేషన్ ముఖ్య ఇంజినీర్ గిరిధర్‌రెడ్డి నేతృత్వంలో సమావేశమైన అధికారుల బృందం రాజధాని నిర్మాణాలపై చర్చించారు. అమరావతి తోపాటు విజయవాడ నగరంలో కూడా చేపట్టనున్న వివిధ నిర్మాణాల గురించి సిఎండి వివరిస్తూ ఇబ్రహీంపట్నం నుంచి రాజధాని స్టార్టప్ ఏరియా వరకూ గల కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ పరంగా ఎటువంటి ఇబ్బందులున్నాయని ఆరాతీయగా వారు అందుకు సానుకూలంగా స్పందించారు. నిర్మాణానికి అదనపు భూమి కావాల్సి ఉన్నందున గోదావరి- కృష్ణా నదుల సంగమం వద్ద ఇరిగేషన్‌కు చెందిన భూమిని వినియోగించుకోవచ్చునని అధికారులు పేర్కొన్నారు. ఐకానిక్ బ్రిడ్జి పరిసరాల్లో గ్రీన్ బఫర్ ఏర్పాటుపై చర్చించిన ఇరుపక్షాల అధికారులు నదీముఖ ద్వారం, విజయవాడ నగరం గుండా ప్రవహిస్తున్న కాలువలను కూడా ఎడిసి సుందరీకరించనున్నట్టు ఆయా ప్రాజెక్టులను వివరించారు. ఈ సమావేశంలో ఏడిసి సిఇ టి మోజెస్‌కుమార్, ఈడి బి నాగరాజు, అధికారులు సురేష్‌బాబు, డాక్టర్ కెవి గణేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.