విజయవాడ

ఖాళీ తరగతి గదుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): నగర పరిధిలోని విఎంసి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న తరగతి గదులను అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ కోనేరు, కమిషనర్ జె నివాస్ పేర్కొన్నారు. ఈ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్ల కల్పనలో భాగంగా తగిన వసతులను కల్పిస్తున్న దాతల సహకారం అభినందనీయమన్నారు. శుక్రవారం 2వ డివిజన్ పరిధిలోని గుణదల దాసరి వెంకట గిరిధరకుమార్, అవంతి నగర పాలక సంస్థ పాఠశాలలో దాసరి సంగీత హరికృష్ణ సహకారంతో నూతనంగా అభివృద్ధి చేసిన తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీ్ధర్, కమిషనర్ నివాస్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలకు అవసరమైన ప్లే స్కూల్స్ మాదిరిగా అంగన్‌వాడీలను తీర్చిదిద్ది వారి అభ్యున్నతికి సహకరించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దాత హరికృష్ణ గది వాల్ పెయిటింగ్, ఫ్లోరింగ్, బెంచీలను అందజేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన వంటశాలకు వెళ్లడానికి సరైన మార్గం లేకపోవడం, వర్షం వస్తే బురదమయం కావడం, మరుగుదొడ్ల నిర్వహణలను పరిశీలించి ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తదుపరి ఎపిఐఐసి కాలనీలోని మున్సిపల్ స్కూల్‌ను పరిశీలించారు. తరగతి గదుల్లో ట్యూబ్‌లైట్లు సక్రమంగా వెలగకపోవడాన్ని గమనించారు. వాటిని సరిచేసి వెలుతురు సమృద్ధిగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాల వెనుక వైపు గోడను నిర్మించాలన్న ఉపాధ్యాయుల వినతికి స్పందించిన మేయర్ తక్షణమే అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఈ పాఠశాలను దత్తత తీసుకొన్న వాసవి మహిళా మండలి వారు పాఠశాలకు అవసరమైన పెయింటింగ్, గ్రీనరీ, తోపాటు ఇతర వౌలిక సదుపాయాలను కల్పించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.