విజయవాడ

ధర్మసూక్ష్మాలను తెలిపిన హరికథా గానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్): పండిత పామర జనరంజకమైన కళ హరికథా గానం, వేదికపై నవరసాలను ఒకే వ్యక్తి పోషిస్తూ భక్తిరస ప్రధానంగా సాగే కళ హరికథ. సకల కళా సమాహారంగా తీర్చిదిద్ది శ్రోతలను ముగ్ధులను చేసే విధంగా దాన్ని తీర్చిదిద్దారు. ఈ కళకు ఆదిభట్లవారు వారి శిష్య ప్రశిష్య సంఘం గత ఆరున్నర దశాబ్దాలుగా సత్యనారాయణపురం శివాజీకేఫ్ సెంటర్‌లోని శ్రీసీతారామ కల్యాణ మండపంలో ఆదిభట్ల వారి జయంతి, వర్ధంత్యుత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నారాయణ దాసవర్యుల వారి ప్రత్యక్ష శిష్యులు నేతి లక్ష్మీనారాయణ భాగవతులు అదే శివాలయంలో ఆదిభట్ల వారికి గుడి కట్టించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టి ఆయన కాలంలో నిర్వహించారు. ఆ క్రమంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు ఆదిభట్లవారి 154వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండవరోజు శుక్రవారం నాటి హరికథా గానాలు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారి సంస్మరణ పూర్వకంగా జరిగాయి. పురాణేతిహాసాలు, పలు గ్రంథాలంలోని ధర్మసూక్ష్మాలను తెలుపుతూ కథా గానాలను సంగీత సాహిత్యాలతో మేళవించి జనరంజకం చేశారు. ఉదయం వేపూరి శ్రీవాణి భగవతారిణి (విజయవాడ)చే పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు రచించిన పార్వతీ కల్యాణం హరికథా గానం జరిగింది. తదుపరి కట్టా జేజినారాయణ భగవతులు (విశాఖపట్నం) పరిమి సుబ్రహ్మణ్య కవి రచించిన మహారథి కర్ణ హరికథా గానం చేశారు. సాయంత్రం జయంతి సావిత్రి భాగవతారిణి(తిరుపతి) ఆదిభట్లవారు రచించిన పాదుకా పట్ట్భాషేం హరికథా గానం చేయగా వీరికి వయోలిన్, మృదంగాలతో పాణ్యం దక్షిణామూర్తి, ఎం రాంగోపాల్, ఎం లక్ష్మణరావు, సూరిబాబు, అమ్ముల ప్రసాద్ తదితరులు సహకరించారు. అదే వేదికపై హరికథా రంగాన అగ్రశ్రేణి హరికథకులుగా కీర్తినార్జించిన కోట సచ్చిదానందశాస్ర్తీ భాగవతులకు ఘనసన్మానం జరిగింది.