ప్రకాశం

ఇఎస్‌ఐ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ఇఎస్‌ఐ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇఎస్‌ఐ సబ్‌స్క్రైబర్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో అసోసియోషన్ నాయకులు, కార్మికులు పాల్గొని ఒంగోలులోని సుందరయ్య భవన్ రోడ్డులో గల ఇఎస్‌ఐ రిఫరల్ హాస్పిటల్ శాంతి పిల్లల వైద్యశాలకు అనుమతి రద్దు చేయాలని, కొత్తగా ఏదైనా ప్రభుత్వ, ప్రవేటు సంస్థలలో చేరిన కార్మికులకు 2 సంవత్సరాల పాటు ఇఎస్‌ఐ చెల్లించే కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు వర్తించవని చెబుతూ విడుదల చేసిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఇఎస్‌ఐ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుదే నాగరాజు మాట్లాడుతూ ఏదైనా ఒక ప్రభుత్వ లేదా ఒక ప్రవేయిటు సంస్థలో ఒక కార్మికుడు ఉద్యోగంలో చేరిన సమయంలో ఆ కార్మికునికి చెందిన వేతనంలో ఒక నెలకు 200 రూపాయల వరకు ఆ కార్మికునికి వైద్యసేవల నిమిత్తం కట్ అవుతాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆ కార్మికుని కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక పోయిన సమయంలో వారికి ఆయా జిల్లాల పరిధిలో ఇఎస్‌ఐ క్రింద వారికి కేటాయించిన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. అయితే ఒంగోలులో ఇఎస్‌ఐ క్రింద కార్మికులకు వైద్యసేవల కోసం కేటాయించిన ఇఎస్‌ఐ రిఫరల్ హాస్పిటల్ అయిన శాంతిపిల్లల వైద్యశాల వైద్యులు కార్మికులు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఆసుపత్రికి వెళ్తే సక్రమంగా వైద్యసేవలు అందించకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు 24గంటలు అత్యవసర వైద్యసేవలు కార్మికులకు అందించాల్సి ఉండగా ఉదయం 11గంటలనుండి ఒంటిగంటవరకు సాయంత్రం ఐదుగంటలనుండి ఏడుగంటల వరకు మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అది కూడా ఒపి మాత్రమే ఉచితంగా చూస్తు వారికి సంబంధించిన పరీక్షలు, ఇతర మందులకు నగదు వసూలు చేస్తున్నారని డబ్బులు ఇవ్వనిపక్షంలో వారిని తిరిగి వెనక్కి పంపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై గతంలో విజయవాడకు చెందిన ఇఎస్‌ఐ హాస్పిటల్ బృందం సరళ ఆధ్వర్యంలో విచారణకు రావటం జరిగిందని అయితే ఆమె విచారణ అనంతరం కూడా ఈ హాస్పిటల్ వైద్యులు కార్మికులకు వైద్యసేవలు అందించటం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర కార్మికశాఖమంత్రి గతంలో ఒంగోలులో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటుచేస్తామని ప్రకటించారని ఇప్పటికైనా స్పందించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్మికుల కోసం సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటుచేసి వైద్యం అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఒంగోలులో కూడా సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి వచ్చేవరకు ప్రభుత్వమే ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని కార్మిక ఉద్యోగులకు వైద్యసేవలు సరిగా అందేటట్లు చూడాలని ఆయన కోరారు. ఆవిధంగా చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు డి నాగమల్లేశ్వరరావు,సెక్రటరి కె రాఘవేంధ్రరావు, కోశాధికారి టి రమేష్‌బాబు, కమిటీ సభ్యులు,కార్మికులు పాల్గొన్నారు.