శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఘనంగా వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం: దక్షణ భారతదేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి 35వ ఆరాధనోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడురోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఆశ్రమ కార్యనిర్వాహణాధికారి పి బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేకువఝాము నుంచి ఆశ్రమంలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం ఉదయం నిర్వహించిన సర్వభూపాల వాహన సేవతోపాటు రాత్రి నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వెంకయ్యస్వామిని బంగారు అభరణాలు, పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సిద్ధంగా ఉంచిన సర్వభూపాల వాహనం మీద ఆశీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, భక్త జనసందోహం మధ్య స్వామివారిని గ్రామోత్సవం వేడుకగా నిర్వహించారు. ఉత్సవం ముందు మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామోత్సవం ముందు కొందరు భక్తులు కోలాటం, భజనలు చేస్తూ ముందుకు సాగారు. ఉత్సవమూర్తికి గ్రామస్థులు నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవమూర్తికి గ్రామస్థులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ ఉత్సవానికి ముందు ఆశ్రమంలో ఉదయం 1.30 గంటలకు ఈవో బాలసుబ్రహ్మణ్యం దంపతులు గోపూజతో ఉత్సవాలు ప్రారంభించారు. 2 గంటలకు సుప్రభాతసేవ, విష్ణుసహస్రనామం, అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఓం నారాయణ అదినారాయణ అన్న నామస్మరణంతో ఆశ్రమ ఆవరణ మార్మోగింది. ఉత్సవాలు సందర్భంగా ఆశ్రమం ముందు వైపు, లోపల ప్రత్యేక పూలతో అలంకరించి వెంకయ్య స్వామి ఆశ్రమం శోభాయమానంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవ, గ్రామోత్సవాన్ని నిర్వహించారు. సర్వభూపాల, కల్పవృక్ష వాహన సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవాలు నిర్వహించిన తరువాత పల్లకి మీద స్వామి వారిని ఆశ్రమంలోకి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు వెంకయ్యస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకానికి ఉభయకర్తలుగా గొలగమూడి గ్రామస్థులు వ్యవహరించారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు వెంకయ్యస్వామి ఆశ్రమ నిర్వాహకులతోపాటు గొలగమూడి గ్రామస్థులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆరాధనోత్సవాల్లో నేడు
ఆరాధనోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శనివారం ఉదయం 10 గంటలకు హనుమంత వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ ఉత్సవాలు నిర్వస్తారు.