కర్నూల్

బాధ్యతాయుతంగా పోలింగ్ విధులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అత్యంత బాధ్యతాయుతంగా పోలింగ్ విధులను నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ టౌన్‌మోడల్ కాలేజీ నందు ప్రిసైడింగ్ అధికారులు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణలో పూర్తిస్ధాయి శిక్షణ పొంది ఏచిన అనుమానం ఉన్నా అడిగి తెలుసుకొని పోలింగ్ విధులను అత్యంత శ్రద్ధతో నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం సూచించిన చెక్‌లిస్టు ప్రకారం ముందురోజే పోలింగ్ కేంద్రంలో చేపట్టాల్సిన విధులపై రిహార్శల్ చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ ప్రవేశించినప్పటి నుండి జాబితాలో పేరు పరిశీలించడం, ఇండెల్టబుల్ ఇంకుమార్కు వేయడం, రహస్య ఓటింగ్ కంపార్టుమెంట్‌లోని ఇవిఎం బటన్ నొక్కడం తదితర చర్యలపై పోలింగ్ సిబ్బంది దృష్టి సారించాలన్నారు. కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్‌లతోపాటు వివిపిఎటిలను కూడా శిక్షణలో ఇచ్చిన విధంగా అమర్చుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో జరిగిన అంశాలను ఎన్నికల కమీషన్ సూచన మేరకు ప్రిసైడింగ్ డైరిలో నమోదుచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఏదైన ఇబ్బందులు ఎదురైతే సంబంధిత సమాచారాన్ని సెక్టోరల్ అధికారులకు తెలియజేయాలన్నారు. సెక్టోరల్ అధికారులు స్పందించక పోతే రిటర్నింగ్ అధికారికి సమాచారాన్ని అందించాలన్నారు. ఎన్నికల పోలింగ్‌లో ఏచిన్న సంఘటన చోటు చేసుకున్న దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలింగ్‌ను సక్రమ నిర్వహణకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్‌పై శిక్షణ పొందిన అధికారులకు పరీక్ష నిర్వహిస్తానని తప్పులుగా రాస్తే మళ్లీ శిక్షణ కార్యక్రమాన్ని తీసుకోవల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ఎన్నికల సాదారణ పరిశీలకులు హిమాంషుజ్యోతి చౌదరి, ఎన్నికల వ్యయపరిశీలకులు ముకాంబికేయన్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్, అర్డీఓ హుసేన్‌సాహెబ్, జిల్లా పరిషత్ సిఇఓ ఈశ్వర్, ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.