గుంటూరు

న్యాయవాదులపై గురుతర బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి: బార్, బెంచ్ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థ ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతుందని, ఏ కోర్టులకైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పునాది అని, కోర్టులన్నీ సవ్యంగా ఉంటే కేసులు చేసేందుకు న్యాయవాదులకు సౌలభ్యంగా ఉంటుందని, కొన్ని వ్యవస్థీకృత అంశాలు నిదానంగా దొరుకుతాయని, పాలసీ మేటర్‌ను అనుసరించాల్సి వస్తుందని, ప్రస్తుతం న్యాయవాదులపై గురుతర బాధ్యత ఉందని, అంకితభావం, చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాధ శర్మ అన్నారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి కోర్టును సందర్శించిన ఆయన ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి హరిహరశర్మ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని మంగళగిరి ప్రాంతానికి రావడంతో ఇక్కడ ప్రాధాన్యత పెరిగిందన్నారు. మంగళగిరి కోర్టులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదనపు జిల్లాకోర్టు ఏర్పాటు గురించి వ్యాఖ్యానిస్తూ హైకోర్టు నిర్దేశించిన విధంగా కేసుల గణాంకాలు ఉండాల్సి ఉంటుందన్నారు. డిఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి ఎల్ తేజోవతి మాట్లాడుతూ లోక్ అదాలత్‌ల ద్వారా వీలైనన్ని కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. కక్షిదారులకు కూడా సమయం ఆదా అవుతుందన్నారు. స్థానిక సీనియర్ సివిల్ జడ్జి వేల్పుల భవాని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హేమ స్రవంతి జానకిరామ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రరావు, కె రమేష్, న్యాయవాదులు తొలుత జడ్జికి స్వాగతం పలికారు. న్యాయవాదులు లంకా శివరామ ప్రసాద్, వేమూరి రత్నప్రసాద్, కొమ్మారెడ్డి వీరారెడ్డి, రామ్‌గోపాల్ గౌడ్, దేవదాసు, ఏజిపి కెవి ప్రసాద్, అడిషనల్ పీపీ బి బ్రహ్మానందరావు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి దారుణ హత్య
మాచర్ల రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణంగా హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి మండల పరిధిలోని గన్నవరంలో జరిగింది. గన్నవరానికి చెందిన కొవ్వూరి వెంకటస్వామికి అదే గ్రామానికి చెందిన దుర్గి నాసరమ్మకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. రెండు సంవత్సరాల క్రిందట వీరిమధ్య మనస్పర్థలు రావటంతో వెంకటస్వామిపై నాసరమ్మ మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆ కేసు కూడా కోర్టు కొట్టేసిందని రూరల్ పోలీసులు తెలిపారు. వెంకటస్వామి భార్య చనిపోవటంతో నాగేంద్రమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త వెంకటస్వామి చేష్టలకు విసిగి నాగేంద్రమ్మ వదలి వెళ్ళిపోయింది. గురువారం రాత్రి గ్రామంలో ఓ వేడుకకు హాజరైన వెంటస్వామి మద్యం మత్తులో తన మాజీ ప్రియురాలు నాసరమ్మ ఇంటికి వెళ్ళాడు. అదే సమయంలో ఇంటిలో ఉన్న ఆమె భర్త దుర్గయ్య, నాసరమ్మ వెంకటస్వామితో గొడవపడి రోకలిబండతో వెంటస్వామి(45) తలపై మోది హతమార్చారు. అనంతరం గ్రామం నుండి పరారయ్యారు. మృతుడు వెంకటస్వామి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ లోకేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అమిత్‌షా పర్యటనను విజయవంతం చేయాలి
గుంటూరు: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు యడ్లపాటి రఘునాధబాబు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్ర్తీ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రఘునాధబాబు మాట్లాడుతూ 28వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను జిల్లావ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యేలా చూడాలన్నారు. అసెంబ్లీ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటుచేసి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా సమీక్షలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

హరికథా పితామహుడు ఆదిభట్ల
గుంటూరు (కల్చరల్): హరికథే కాదు లోకం మెచ్చే రీతిలో గిరికథను కూడా శ్రావ్యంగా రచించి, గానంచేసిన ఆదిభట్ల నారాయణదాసు హరికథా ప్రపంచాన జగద్గురువు అని పలువురు వక్తలు కొనియాడారు. నగరంలోని బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదిభట్ల నారాయణదాస కధాగాన కళాపరిషత్ గుంటూరు, హైదరాబాద్ వారి ఆధ్వర్యాన 153వ జయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య కళావేదికపై శుక్రవారం జరిగిన సభలో సంస్కృత పండితులు డాక్టర్ డిఎన్ దీక్షితులు ఆదిభట్ల నారాయణదాసు రచించిన కాశీ శతకంపై వివరణాత్మకమైన ప్రసంగాన్ని అందించారు. కార్యక్రమంలో వెంకన్న ఆలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, ఆర్‌విఆర్ విద్యా కళాశాల అధ్యాపకుడు మోదుగుల రవికృష్ణ, సింగరేణి కాలరీస్ మాజీ అధికారి ఎంవి శాస్ర్తీ, నారాయణదాసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పర్యాటక కేంద్రంగా సత్తెనపల్లి
స్పీకర్ కోడెల శివప్రసాదరావు భరోసా
సత్తెనపల్లి: నవ్యాధ్రప్రదేశ్‌కు ముఖ ద్వారమైన సత్తెనపల్లిని రాష్ట్రంలోనే అత్యంత సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సత్తెనపల్లిలో పలు అభివృద్ధి పనులకు స్పీకర్ కోడెల శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రైల్వేస్టేషన్ రోడ్డులోల చెరువు వద్ద చేస్తున్న పనులను పరిశీలించారు. సంబంధిత ప్లాన్‌ను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలను అందించారు. స్పీకర్ వెంట మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, కమిషనర్ బొల్లినేని శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు చౌటా శ్రీనివాసరావు, సయ్యద్ పెదకరిముల్లా, యెల్లినేడి వాసు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

తగ్గిన కీళ్లమార్పిడి ఇంప్లాంట్ ధరలు
* డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి వెల్లడి
గుంటూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారం కీళ్లమార్పిడి శస్తచ్రికిత్సలకు వినియోగించే ఇంప్లాంట్స్ ధరలు భారీగా తగ్గాయని ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. స్థానిక హోటల్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఇంప్లాంట్స్ ధరల తగ్గుదల, ఈ కారణంగా ప్రజలకు చేకూరే ప్రయోజనాల గురించి వివరించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అమెరికన్ ఇంప్లాంట్‌కు కంపెనీని బట్టి, దానిలో ఉపయోగించే మెటీరియల్ ఆధారంగా రూ.25 వేల నుంచి లక్ష రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు ఉన్నతవర్గాలకే పరిమితమైన మోచిప్ప, తొంటి కీళ్లమార్పిడి శస్తచ్రికిత్సలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. తొలి నుంచి ఈ తరహా శస్తచ్రికిత్సల్లో అమెరికన్ ఇంప్లాంట్స్‌నే వినియోగిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. అమెరికన్ జాయింట్‌ను వినియోగించి ఒక కాలుకు ప్రాథమిక ప్యాకేజీ కింద శస్తచ్రికిత్స నిర్వహించినట్లయితే రూ.1.60 లక్షలు ఖర్చవుతుందని, ప్రస్తుతం ఈ ప్యాకేజీ కింద 25 వేల రూపాయలు తగ్గుతుందన్నారు. దీంతో ఇకపై రూ.1.35 లక్షలకే శస్తచ్రికిత్స నిర్వహిస్తామన్నారు. అలాగే ఆక్సీనియం కంపెనీకి సంబంధించిన ఇంప్లాంట్‌ను వినియోగించినట్లయితే గతంలో రూ.2.50 లక్షలు ఖర్చు అయ్యేదని, ప్రస్తుతం రూ.1.80 లక్షలకే చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన అట్యూన్ ఇంప్లాంట్‌ను అమర్చి శస్తచ్రికిత్స నిర్వహించినట్లయితే రూ.3 లక్షలు ఖర్చు అయ్యేదని, ప్రస్తుతం కేంద్రప్రభుత్వం సవరించిన ధరల మేరకు రూ.2 లక్షలకే శస్తచ్రికిత్స నిర్వహించేందుకు వీలు కలుగుతుందన్నారు. విలేఖర్ల సమావేశంలో సాయిభాస్కర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సిఇఒ డాక్టర్ యరగూటి సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్న ‘అమృతహస్తం’పై అభిప్రాయ సేకరణ
శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ కుమార్
తాడికొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న అమృత హస్తం పథకంపై శిశుసంక్షేమ శాఖ కమిషనర్ అరుణ కుమార్ శుక్రవారం తాడికొండ నార్త్ స్కూల్లోని అంగన్‌వాడీ సెంటరును పరిశీలించారు. అన్న అమృతహస్తం పథకంపై గర్భిణీలు, బాలింతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా గర్భిణీలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని కమిషనర్‌కు చెప్పారు. ప్రతిరోజు పౌష్టికాహారం కోసం తమ ఇళ్ళ వద్దనుండి అంగన్‌వాడీ సెంటరుకు రావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని స్పష్టం చేశారు. కమిషనర్ వెంట ఆ శాఖ కార్యదర్శి సునీత, జెడిలు రాజ్యలక్ష్మి, సర్వలత, పిడి సుఖజీవన్ బాబు, సిడిపిఒ శ్రీదేవి, ఎంపిపి షేక్ రిజ్వానా, సర్పంచ్ నూతక్కి నవీన్ కుమార్, కంతేటి నాగేశ్వరావు, అన్న హస్తం కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.