గుంటూరు

కాల్వలో పడి రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను: పొలం నుండి ఇంటికి తిరిగి వస్తూ కొమ్మమూరు కాల్వ దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి రైతు శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని చినకాకుమానుకు చెందిన కర్నాటి నరసింహారావు (51) గురువారం బాపట్లలో వరినారు కొనుగోలు చేసి పొలంలో నారు దించుతూ, కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఇంటికి వస్తుండగా కాల్వ దాటుతూ ప్రమాదవశాత్తు కాల్వలో పడి కొట్టుకుపోయాడు. నీటిలో మునిగి అప్పాపురం శివారు పైలెట్ ప్రాజెక్టు సమీపాన మృతదేహాన్ని గుర్తించినట్లు కాకుమాను ఎస్‌ఐ వీరాంజనేయులు తెలిపారు. ఇదే విధంగా నలుగురు రైతులు గతంలో మరణించినట్లు స్థానికులు వాపోయారు. వంతెన నిర్మాణం కోసం అనేకమార్లు ప్రజాప్రతినిధులను వేడుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కాకుమాను పోలీసులు మృతదేహాన్ని బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.