తూర్పుగోదావరి

ముద్రగడకు మద్దతుగా కాపుల నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం: కాపు రిజర్వేషన్ సాధన కోసం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడాన్ని నిరశిస్తూ శుక్రవారం అమలాపురంలో కాపు ఉద్యమ నాయకులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. కోనసీమ టిబికె జెఎసి కన్వీనర్ కల్వకొలను తాతాజీ ఇంటి వద్ద కాపుయువత వర్షంలో తడుస్తూ నిరసన వ్యక్తం చేయగా, కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సంయుక్త కన్వీనర్ నల్లా పవన్‌కుమార్ ఆధ్వర్యంలో కాపు యువత వర్షంలో రిక్షాలు తొక్కుతూ నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా నల్లా పవన్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేర్చుతామన్న హామీని నమ్మి కాపులంతా చంద్రబాబుకు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక ఆమాటే మర్చిపోయి కాపులపై ఎదురు దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగు దేశం ప్రభుత్వం అధికారం చేపట్టి మూడున్నరేళ్ళు పూర్తయినా రిజర్వేషన్ అంశాన్ని పక్కదారిపట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి రాజు, అరిగెల నాని, సలాది నాగేశ్వరావు, నల్లా శ్రీను, కురసా ఆంజనేయులు, సూదా గణపతి, మామిడిపల్లి రాము, నల్లా అజయ్, నల్లా కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నల్లా రామకృష్ణ, తొట రాము, యలం మణికంఠ, కల్వకొలను పుల్లయ్యనాయుడు, ఏడిద శ్రీను, వర్రే శేషు, నాగులపల్లి సురేష్, కల్వకొలను బాబి, అరిగెల శ్రీరామూర్తి, సాధనాల మురళి, నల్లా చిన్నా తదితరులు పాల్గొన్నారు.

కుక్కల స్వైర విహారం: ఎనిమిది మందికి గాయాలు
పెదపూడి: మండలంలో కైకవోలు గ్రామంలో శుక్రవారం స్వైరవిహారం చేశాయి. గ్రామంలో వృద్ధులు, చిన్నారులను కరవడంతో వారు గాయాల పాలయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న సర్పంచ్ మట్లపర్తి అలివేలు మంగాదేవి కుక్కకాటుకు గురైన ఎనిమిది మంది బాధితులను హుటాహుటిన పెదపూడి కమ్యూనిటీ హెల్తె సెంటర్‌కు తరలించి చికిత్స చేయించారు. తహసీల్దార్ వెంకటేశ్వరరావు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరగా సంతానోత్పత్తి జరగకుండా శస్తచ్రికిత్సలు చేయడం తప్ప వేరే మార్గం లేదని సమస్య తీవ్రతను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
పెట్రోల్ బంక్‌లో ట్రాక్టర్ విధ్వంసం
ఇరువురికి గాయాలు: డీజిల్ పంపు ధ్వంసం
కోరుకొండ: పెట్రోల్ బంక్‌లో పెట్టిన ట్రాక్టర్‌ను పెట్రోల్ బంక్‌లో పనిచేసే గుమస్తా సరదాగా నడపబోయి ఇరువురుని ఢీకొని, డీజిల్ పంపు పగులకొట్టిన వైనం కోరుకొండ మండలం కాపవరం సెంటరులో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోరుకొండకు చెందిన ట్రాక్టర్‌కు కాపవరంలో ఉన్న పెట్రోల్ బంక్‌లో పెట్రోలు కొట్టించడానికి వెళ్లిన యజమాని ట్రాక్టర్‌ను బంక్‌లో ఉంచి యాజమాని బయటకు వెళ్లడంతో సరదాగా ట్రాక్టర్ నడుపుదామని బంకులో పనిచేస్తున్న గుమస్తా చౌదరి ట్రాక్టర్‌ను నడపడంతో అదుపు తప్పి బంకులో ఉన్న డీజీల్ పంప్‌ను ఢీకొని, పెట్రోలు పోయించుకుంటున్న తొర్రా రాంబాబును, పెట్రోలు కొడుతున్న ఏసురాజులను ఢీకొనడంతో వారి ఇరువురుకి గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా డీజిల్ పంపుతో పాటు, మోటారు సైకిల్ నుజ్జునుజ్జు అయ్యాయి. గాయపడిన ఇరువురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అప్పుల బాధ నుంచి బయటపడదామని..
రావులపాలెం: మద్యానికి బానిసై అప్పులపాలైన ఓ వ్యక్తి ఆ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు తన ఇంట్లోనే చోరీ జరిగినట్టు పెద్ద కథ సృష్టించాడు. తనను తాను గాయపరుచుకుని, దొంగలు తనను కొట్టి నగలు, నగదు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చివరికి అతని పన్నాగాన్ని పోలీసులు కనిపెట్టడంతో కటకటాలపాలయ్యాడు. ఈ వివరాలను శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సిఐ బి పెద్దిరాజు తెలిపారు. నిందితుడితోపాటు చోరీ జరిగిన నగలు, నగదును విలేఖర్ల ఎదుట ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే..రావులపాలెం గ్రామ శివారు కొత్త కాలనీలో నివాసం ఉంటున్న కర్రి విశ్వనాధరెడ్డి అనే వృద్ధుడు తాపీ పని చేస్తుంటాడు. అయితే మద్యానికి బానిసైన ఇతను విపరీతంగా అప్పులు చేశాడు. ఇటీవల అప్పులిచ్చిన వారు అప్పుతీర్చమని వత్తిడి తేవడంతో ఆందోళనకు గురవుతున్నాడు. ఈ సమయంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వంట పనిచేసే భార్య కర్రి నాగమణితోపాటు పనిచేసే హుస్సేన్ బేగం తన కుమార్తె పెళ్లి నిమిత్తం సిద్ధం చేసుకున్న రూ.లక్షను నాగమణి ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చింది. ఇది గమనించిన విశ్వనాధరెడ్డి ఈ నగదును, ఇంట్లో ఉన్న నగలను దొంగిలించాలని పథకం వేసుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 8న ఇంట్లో ఎవరూలేని సమయంలో తనకు తానే కర్రతో తలపై కొట్టుకుని, గాయపరుచుకుని స్పృహకోలిపోయినట్టు నటించాడు. ముగ్గురు వ్యక్తులు వచ్చి తనను కర్రతో కొట్టి, మత్తుమందుపెట్టి బీరువాలోని నగలు, నగదు అపహరించుకుపోయినట్టు ఇంట్లోవారిని నమ్మించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు తాను చేసిన అప్పులు తీర్చి, మిగిలిన సొమ్ముతో జల్సా చేస్తుండగా ఇతని ప్రవర్తనపై నిఘాపెట్టిన ఎస్సై సిహెచ్ విద్యాసాగర్, సిబ్బంది శుక్రవారం కొత్త కాలనీ సమీపంలో అతనిని అదుపులోనికి తీసుకున్నారు. అతని వద్దనుంచి రూ.56,500లు నగదు, నాలుగు కాసుల బరువుగల బంగారు నల్లపూసల తాడు, లక్ష్మీదేవి ఉంగరం, జత చెవి దుద్దులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కొత్తపేట జెఎఫ్‌సిఎం కోర్టులో హాజరుపరుస్తామని సిఐ తెలిపారు. డిఎస్పీ ఎవిఎల్ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్సై విద్యాసాగర్, ఎఎస్సై ఆర్‌వి రెడ్డి, క్రైం హెచ్‌సి శ్రీనివాస్, స్వామి, రమేష్, అమ్మిరాజు, హరికృష్ణలను సిఐ పెద్దిరాజు అభినందించారు.
విద్యుత్ సమస్యలపై నర్సరీ రైతుల ఆందోళన
హామీ ఇవ్వని ముఖ్యమంత్రి
కడియం: నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ బిల్లుల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నర్సరీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. విజయవాడలో గురువారం రాత్రి జరిగిన ఆర్గానిక్ నర్సరీ ఎక్స్‌పో ముగింపు సభలో ముఖ్యమంత్రిని కలిసిన నర్సరీ రైతులు సమస్యపై వినతిపత్రం అందించారు. అయితే సభలో కడియం నర్సరీ రైతుల ఔన్నత్యాన్ని, నర్సరీల ప్రఖ్యాతిని పదే పదే పొగిడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ బిల్లుల సమస్యపై ప్రత్యక్షంగా మాట్లాడకపోవడం నర్సరీ రైతులను నిరాశకు గురిచేసింది. నర్సరీ రైతుల సమస్యలపై ప్రత్యేకంగా సమావేశమై తగిన చర్యలు తీసుకుంటానని చంద్రబాబునాయుడు ప్రకటించడం కాస్త ఊరట కలిగించినా స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం నుండి ఎటువంటి నిర్ణయం వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణాలో అక్కడి ప్రభుత్వం నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేస్తూ జిఒ జారీ చేసిందని, విద్యుత్ బకాయిలను కూడ ప్రభుత్వమే చెల్లించిందని రైతులు చెబుతున్నారు. అత్యధిక నర్సరీలు కలిగిన మన రాష్ట్రంలో ఆ విధానం ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విధంగా తాము మొక్కలు ఉత్పత్తి చేస్తున్నామని, కనీసం విద్యుత్ బిల్లుల్లో రాయితీ ఇవ్వకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. మండలంలో 1200 నర్సరీ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటికి ట్రాన్స్‌కో వరుసగా మీటర్లు బిగిస్తోంది. ఈ కార్యక్రమం పూర్తయితే యూనిట్ విద్యుత్ వినియోగానికి 3.70 రూపాయలు చెల్లించాలని విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ నుండి ఆదేశాలు వచ్చాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నర్సరీ రైతులు చేపడుతున్న ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

పిర్యాదులు తక్షణం పరిష్కరించేందుకు కృషి: ఎస్పీ విశాల్ గున్ని
కాకినాడ సిటీ: వాట్సాప్ ద్వారా వచ్చిన పిర్యాదులు తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని చెప్పారు. గత జూన్ 29వ తేదీన నూతనంగా జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 9404933233కు ఇప్పటి వరకు వచ్చిన పిర్యాదులు, వాటి పరిష్కార వివరాలు గురించి ఆయన తన కార్యాలయంలో సంబంధిత పోలీస్ అధికారులతో సమీక్షించారు. వాట్సాప్ ద్వారా ఇప్పటి వరకు 591మంది పిర్యాదులుచేయగా వాటిలో 583 పిర్యాదులను పరిష్కరించినట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలియజేశారు. వీటిలో 110పిర్యాదులను పరిశీలించి ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 8పిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిన సైతం అధికారులు తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు వాట్సాప్ ద్వారా స్వయంగా ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, రోజుల తరబడి సమస్యలు పరిష్కారం కోసం నిరీక్షించవలసిన అవసరం లేదని ఎస్పీ విశాల్ గున్ని చెప్పారు. ఈసమీక్షా సమావేశంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.