తూర్పుగోదావరి

నిబంధన మార్పుతో కారుణ్య నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ప్రభుత్వం చేసిన నిబంధన మార్పు వల్ల రాష్ట్రంలో ఎంతో మందికి కారుణ్య నియామాల ఆటంకాలకు అడ్డు తొలగి పోయిందని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ నిబంధన వల్ల ఇతర శాఖలతో పాటు అమర పోలీసు కుటుంబాలకు చాలా ఉపయోగముంటుందని, ఈ విషయంలో సిఎం చంద్రబాబుకు బొప్పరాజు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక రెవెన్యూ కార్యాలయంలో విలేఖర్లతో సమావేశాన్ని నిర్వహించారు. గతంలో కారుణ్య మియామకాలకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంటర్ అర్హత ఉండాలని, 10వ తరగతి పాస్ అయితే షరతులతో కూడి మూడేళ్ళలో ఇంటర్ పూర్తి చేసేలా ఉద్యోగాన్ని ఇచ్చేవారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్‌కు డిగ్రీ ఉండాలని నిబంధన ఉండడం వల్ల ఇంటర్ పూర్తి చేసిన వారికి ఉద్యోగం ఇచ్చి డిగ్రీని ఐదేళ్ళలోపు పూర్తి చేయాలని షరతును తమ జెఎసి నాడు ప్రతిపాదించటంతో తాజాగా ప్రభుత్వం జిఓను విడుదల చేసిందన్నారు. 30 ఏళ్ళు దాటిన ఉద్యోగులను వారి పని సామర్యాన్ని బట్టి తొలగిస్తామని వచ్చిన వార్తల నేపధ్యంలో దీనిపై సిఎంను కలిసి వివరించగా అటువంటి ఏమీ లేదంటూ తమకు చెప్పారని దీనిపై ఉద్యోగులు ఆందోళన చెందవద్దన్నారు. ఉద్యోగ సంఘాలను ప్రయోజనాలే లక్ష్యంగా తమ జెఎసి పనిచేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర జెఎసి సెక్రటరీ జనరల్ టివి ఫణిపేర్రాజు, రెవెన్యూ అసోసియేషన్ కోశాధికారి జి కేశవనాయుడు, జెఎసి జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.