తూర్పుగోదావరి

ముద్రగడ బైఠాయంపుతో బలగాల మోహరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు: ముందుగా ప్రకటించినట్టుగా పాదయాత్రను అడ్డుకున్న చోటే జెఎసి నేతలతో కలిసి శుక్రవారం ముద్రగడ బైఠా యంచడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాపు జెఎసి సభ్యులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, వైవి దాసు, స్వామి, తుమ్మలపల్లి రమేష్, ఆచ్చుతరామయ్య తదితరులు ముద్రగడతో పాటు అక్కడే బైఠాయించారు. వారంతా అప్పటికప్పుడు కుర్చీలు వేసుకుని గేటు వద్ద కుర్చుని నిరసన తెలియజేశారు. తాను ఏ క్షణంలోనైనా జంపుజిలానీగా రోడ్డు మీదుగా పాదయాత్ర చేసేస్తానని ముద్రగడ ప్రకటించారు. దీనితో పోలీసులు అప్పటికప్పుడు భారీ సంఖ్యలో బలగాలను రప్పించి మోహరించారు. దీనితో కిర్లంపూడిలో ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ గేటు వద్ద బైఠాయించారని తెలుసుకున్న కిర్లంపూడి, జగపతినగరం, వేలంక, రాజుపాలెం, వీరవరం, గెద్దనాపల్లి, కొత్తూరు, సింహాద్రిపురం, ప్రత్తిపాడు, ధర్మవరం గ్రామాలకు చెందిన భారీ సంఖ్యలో కాపులు అక్కడకు చేరుకుని శిబిరంలో కుర్చున్నారు.
కాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాపు సంఘం ఆధ్వర్యంలో బస్సులు, కార్ల మీద కాపులు చలో కిర్లంపూడి పిలుపులో భాగంగా కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాలకొల్లు కాపు జెఎసి నేత ముత్యర్ల శ్రీరామ్ మాట్లాడుతూ ముద్రగడను కలుసుకోవడానికి వస్తున్న దారి పొడవునా పోలీసులు అడ్డుకుని అడ్రస్‌లు, కులాన్ని వివరాలు అడగటం దారుణమన్నారు. పాలకొల్లులో అన్ని వర్గాలకు చెందిన వారు ముద్రగడకు మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ క్రమంలో తమతోపాటు పాలకొల్లు నుండి బ్రాహ్మణ సామాజికవర్గం, మైనార్టీ సామాజికవర్గం సోదరులు కూడా తమతో పాటు ముద్రగడ నివాసానికి వచ్చారన్నారు. పాలకొల్లు ప్రాంతం నుండి మహిళలు కూడా ఒక బస్సులో తమ వెంట వచ్చారన్నారు.
తనను కలిసిన కాపు సంఘాల నాయకులతోను, కాపు యువతతోను ముద్రగడ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కాపు జాతిని రిజర్వేషన్ కల్పిస్తానని మాటిమాటికీ అబద్ధలు చెబుతున్నారన్నారు. తాను పోలీస్ అధికారులు, ప్రభుత్వం తన పాదయాత్రను నిత్యం అడ్డుకోవడంతో పందా మార్చుకుని బైఠాయించవలిసి వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు వెంటనే కాపులను బిసిల్లో చేర్చుతున్నట్లు ప్రకటించాలని అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసే వరకు ఉద్యమాన్ని ఇలా కొనసాగిస్తునే ఉంటామని అన్నారు.