తూర్పుగోదావరి

ఎ కేటగిరి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎ క్యాటగిరికి చెందిన రాజమహేంద్రవరం, సామర్లకోట, కాకినాడ టౌన్, తుని రైల్వే స్టేషన్లను ప్రణాళికాబద్దంగా మరింతగా అభివృద్ధిచేసి రానున్నరోజుల్లో రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) ఆర్ ధనుంజేయులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రైల్వేస్టేషన్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఆర్‌ఎం పలు అంశాలపై మాట్లాడారు. జిల్లాలో సామర్లకోట రైల్వే జంక్షన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉందని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణీకుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. సాధారణ ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పద్ధతిలో అభివృద్ధి పనులు నిధుల లభ్యతను ప్లాట్‌ఫారాల అభివృద్ధి, రెండో పుట్ పాత్ వంతెన నిర్మాణం, ఎస్కలేటర్ ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. డివిజన్ పరిధిలో రైల్వే స్థలాల ఆక్రమణలు తొలగించి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి మరింత చర్యలు చేపడతామన్నారు. అయితే ఆక్రమణల తొలగింపు అంశంలో స్థానికులు సహకరించాలన్నారు. సామర్లకోట రైల్వేస్టేషన్‌లో డ్రెయిన్ వరకూ ఉన్న ఆక్రమణలు తొలగించి డ్రెయిన్ అవతల ప్రహరీ ఏర్పాటు చేసి రెండు వైపులా లోపలికి, బయటకు ఆర్జిగేట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఒక్కో స్టేషన్‌కు ఇన్ని రిజర్వేషన్ సీట్లు అంటూ కోటా ఉండేదని అయితే ఇప్పుడు తాజాగా ఆన్‌లైన్‌లో, ఐఆర్‌సిటిసి ద్వారా అధికంగా 60 శాతం సీట్లు బుకింగ్ అవుతున్నట్లు చెప్పారు. రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద చాంతాడు క్యూలు తగ్గుముఖం పట్టాయని, ఆన్‌లైన్ వల్ల ఈ బెడద తప్పిందన్నారు. అయినప్పటికీ ప్రయాణీకులు ఇబ్బంది లేకుండా బుకింగ్ కౌంటర్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో రోజుకు 200 పైగా రిజర్వేషన్లు నమోదు అవుతున్నట్లు చెప్పారు. తమ పరీశీలనలు, తనిఖీల్లో వచ్చిన సమాచారం ప్రకారం సమస్యల పరిష్కారానికి, సౌకర్యాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. శిధిలస్థితిలో ఉన్న రైల్వే క్వార్టర్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
అక్రమ విక్రేతలపై కఠిన చర్యలు:డిఆర్‌ఎం హెచ్చరిక
రైళ్లలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా నాణ్యతలేని పదార్ధాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొంటున్నట్లు డిఆర్‌ఎం ధనుంజేయులు ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విజయవాడ డివిజన్ పరిధిలో, మొత్తం రైల్వే పరిధిలో కూడా ఈ విక్రేతలపై పట్టుకుని జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. మళ్ళీ మళ్ళీ పట్టుబడితే దాడుల్లో అటువంటివారిపై కేసులు నమోదు చేసి అవసరమైతే జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అనుమతులు పొంది అక్రమాలకు పాల్పడే వారి లైసెన్స్ రద్దుచేస్తామని ఈ సందర్భంగా డిఆర్‌ఎం హెచ్చరించారు.
రైల్వే స్టేషన్లో జోరుగా తనిఖీ
తొలుత సుమారు గంటన్నరపాటు స్వచ్చ్భారత్ కార్యక్రమంలో భాగంగా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిసరాలు, బయటి ప్రాంతాలు, క్వార్టర్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్రయాణీకులు వేచివుండే వెయిటింగ్ రూమ్‌లు, చీప్ టికెట్ బుకింగ్ సూపర్‌వైజర్ కార్యాలయం, ఎస్‌ఎం ఛాంబర్, ఇతర విభాగాలను, రైల్వే ఉద్యోగులు విశ్రాంతి తీసుకునే గదులు, క్యాంటిన్లను డిఆర్‌ఎం క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఎంకు తొలుత సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ విఆర్‌ఎన్ శాస్ర్తీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో డిఆర్‌ఎం వెంట సీనియర్ డివోఎం చైతన్య, సీనియర్ డిసిఎం షీదాలీ, సీనియర్ డిఇఇ (ఎలక్ట్రికల్) వరప్రసాద్, సీనియర్ డిఇఎన్ (ఇంజనీర్) అప్పారావు, సీనియర్ డిఇఎన్ (హెచ్ ఎన్) సత్యనారాయణ, డిఎస్‌టిఇ శంకర్, సామర్లకోట రైల్వే స్టేషన్‌లో పలు విభాగాల అధికారులు, రైల్వే, ఆర్పీఎప్ పోలీసులు పాల్గొన్నారు.