ష్.. సీక్రెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన శైలిలో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రియాసేన్. అయితే ఈ బెంగాలీ భామ రీసెంట్‌గా పూణెలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. గత కొంతకాలంగా శివమ్ తివారి అనే ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్‌ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లిచేసుకుంది. అయితే ఆమే అంత సీక్రెట్‌గా పెళ్లిచేసుకోవడానికి కారణం ఏమిటా అని మీడియాలో అనేక అనుమానాలు వెలువడుతున్నాయి. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, అందుకే త్వరగా పెళ్లి చేసేసుకుంది అని బాలీవుడ్‌లో పుకార్లు వస్తున్నాయి. ఇక ఆమె వివాహానికి కేవలం ఇరు కుటుంబాల దగ్గరివాళ్ళే హాజరయ్యారట. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను రియాసేన్ సోదరి రీమాసేన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. రియాసేన్ హిందీ, తమిళ మరియు ఒరియా, మలయాళ భాషల్లోని చిత్రాలతోపాటు తెలుగులో కూడా మంచు మనోజ్ సరసన నేను మీకు తెలుసా సినిమా చేసింది.