8న నయన్ సరసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు, నయనతార జంటగా ఆండ్రియా, ఆదాశర్మ క్రేజీ కాంబినేషన్‌లో జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకంపై పాండీరాజ్ దర్శకత్వంలో రూపొందించిన చితం ‘సరసుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ- నయనతార, తాను బ్రేక్‌అప్ అయ్యాక తిరిగి కలిసి నటించిన ఈ చిత్రానికి యూత్, ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అయ్యారని, మంచి ప్రేమకథతో రూపొందించిన ఈ సినిమాలో సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా వుంటాయని తెలిపారు. నిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ- సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని, శింబు పాడిన మెలోడీ పాట వైవిధ్యంగా సాగుతుందని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. చిత్రానికి దర్శకత్వం:పాండీరాజ్.