స్పైడర్‌కు రజనీ గెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న స్పైడర్ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై నెలకొని ఉన్న అంచనాల దృష్ట్యా ప్రమోషన్ ఈవెంట్‌లని కూడా గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబ్‌బర్ 8న చెన్నైలో జరిగే స్పైడర్ ఈవెంట్ ద్వారా మహేష్‌బాబుని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ విషయం గురించి రజనీని కలసినట్లు చెబుతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. రజనీ ఈ కార్యక్రమానికి హాజరైతే ఇద్దరు సూపర్‌స్టార్‌లని ఒకే వేదికపై చూసే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైనట్లే.