ఆటాపోటీ

‘కూల్’గా సమాధానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ ఒక జర్నలిస్టు ప్రశ్నకు చిత్రంగా స్పందించాడు. 2016లో జరిగిన టి-20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత విలేఖరుల సమావేశంలో ధోనీ పాల్గొన్నాడు. ఒక్కో ప్రశ్నకు నింపాదిగా సమాధానమిస్తున్న ధోనీని ‘ఎప్పుడు రిటైర్ అవుతారు? అంతర్జాతీయ కెరీర్‌ను ముగించడానికి ఇదే సరైన సమయమని అనుకుంటున్నారా?’ అని ప్రశించాడు. అలాంటి మాటలకు ఇంకెవరైనా అయతే సహనం కోల్పోయి, తీవ్రంగా స్పందించేవారు. కానీ, ధోనీ తన కోపాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. తనను ప్రశ్నించిన జర్నలిస్టును పిలిచి, వేదికపై తన పక్కనే కూర్చోవాల్సిందిగా కోరాడు. అతను కూర్చున్న తర్వాత ‘నేను 2019 వరకూ బతికి ఉంటాననే అనుకుంటున్నావా?’ అని అడిగాడు. ధోనీ హఠాత్తుగా అలాంటి ప్రశ్న వేయడంతో కంగుతిన్న ఆ జర్నలిస్టు ‘ఎందుకు ఉండరు’ అని సమాధానమిచ్చాడు. ‘అయితే, నువ్వు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు జవాబు నీకు దొరికినట్టే’ అనడంతో అప్పటి వరకూ ఎంతో టెన్షన్ నెలకొన్న ఆ సమావేశం ఒక్కసారిగా నవ్వులతో మారుమోగింది. 2019 వరకూ రిటైరయ్యే అలోచన తనకు లేదని ధోనీ చెప్పకనే చెప్పాడు.