ఆటాపోటీ

ట్వీట్ల వీరుడు సెవాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరేందర్ సెవాగ్ కెరీర్ కొనసాగించినంత కాలం, మైదానంలో సాధ్యమైనంత తక్కువ మాట్లాడేవాడు. కానీ, అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన తర్వాత ట్విట్టర్‌లో చెలరేగిపోతున్నాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, జావేద్ మియందాద్, ఇంజమాముల్ హక్‌తోపాటు షాహిద్ అఫ్రిదీ, ఉమర్ అక్మల్ తదితరులపై సంధించిన విమర్శనాస్త్రాలు అతని ఫాన్ ఫాలోయింగ్‌ను కొన్ని రెట్లు పెంచేశాయి. 2011లో భారత జట్టు ప్రపంచ కప్‌ను గెల్చుకోవడంలో ధోనీ పాత్ర పెద్దగా లేదని అతను చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది. జట్టులోని ఆటగాళ్లంతా ప్రతిభావంతులేనని, వారందరూ కష్టపడడం వల్లే భారత్‌కు ప్రపంచ కప్ దక్కిందని సెవాగ్ ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు. సమర్థులైన ఆటగాళ్లు లేకపోతే, కెప్టెన్ ఒక్కడే ఏ జట్టునూ గెలిపించలేడన్న అతని మాటలు అక్షర సత్యాలే.