భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం- 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మసీదే పెద్ద దేవాలయంగా మారుతోంది. ఈ భారతదేశంలోని వారే కాక విదేశాల నుంచి కూడా నన్ను చూడడానికి గుంపులు గుంపులుగా వస్తుంటారు. వారంతా నన్ను దర్శించడానికి బారులు తీరి నిల్చుంటారు. వెనుకగా వచ్చిన వారికి నా దర్శనం లభించదేమో అన్న అశాంతితో కొట్టుమిట్టాడుతూ ప్రత్యేక దర్శనాలు అంటూ మరో దారిలో నా దగ్గరకు వస్తారు. మరికొందరు ఎవరికో ఏదో తాయిలం పెట్టి నన్ను అతి దగ్గరగా కలుసుకోవాలని ఉవ్విళ్లూరి పరుగెత్తి వస్తుంటారు.
మరికొందరు నా భజన చేస్తూ చుట్టుప్రక్కలవారిని కూడా బృందాలుగా చేసుకుని నా కోసం నా దర్శనం కోసం వస్తుంటారు. వీరందరూ ఇక్కడ ఉండటానికి ఎన్నో భవంతులు ఇక్కడకు వస్తాయి. ఎందరో ఎక్కడెక్కడినుంచో వచ్చి తినుబండారాలు అమ్ముకుంటూ వుంటారు. మరికొందరు నా ఫొటోలను అమ్ముతుంటారు. ఇంకొంతమంది నా తాయెత్తులని అమ్ముతుంటారు.
మరికొంతమంది నా ముద్ర ఉన్న బిళ్లలని కాసులను తీసుకుని అమ్ముకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా జనమే జనంగా ఉంటారు. అపుడు నా దర్శనం కోసం రోజుల తరబడి బారుల్లో నిలబడి వేచి చూస్తుంటారు. ఒక్కసారి నా దర్శనం జరిగితే చాలనే వాళ్లు కోట్ల సంఖ్యలో ఇక్కడ గుమికూడి ఉంటారు.
దీనినంతా ఆయన చూస్తున్నాడు. ప్రతిరోజు ఇతను నన్ను నా మహిమలను చూపమని అడుగుతుంటాడు. నేనేమో నేను సామాన్యమైన వాణ్ణి. నా గురువు నాకు మహిమలు చూపలేదు. నేను నీకెలా చూపుతాను అంటూ ఉంటాను. కాని అతడు మాత్రం నన్ను నిరంతరం నమ్ముతాడు. నిరంతరమూ అవిశ్వాసంతో వుంటూ ఉంటాడు. కష్టం రాగానే బాబా అంటాడు. సుఖం రాగానే బాబా అని నన్ను వదిలేసి ఆ సుఖాల జోలిలో మునిగిపోతాడు. మరలా నన్ను బాబా నీవు బాబావైతే నిజంగా దైవత్వం నీలో ఉంటే నాకు మహిమలు చూపు అని మరలా మరలా అడుగుతుంటాడు. వీని బాధ పడలేక రాబోయే రోజుల్లో శిరిడీని చూడమని చెప్పాను. అంతే అప్పటినుంచి జరగండి జరగండి తొందరగా కదలండి అని అరుస్తూ నా చెంతనే ఉంటున్నాడు’’ అని ఇంకా ఏదో చెబుతూనే ఉన్నాడు సాయి.
‘‘బాబా! నిజంగా నీవు నాకు నాతో నేనే.. కాదు నాతో నీవు మాట్లాడుతావా.. ఎప్పుడూ నా చెంతనే ఉంటావా’’ అంటూ మరలా ఆ బాబు కన్నీరు కారుతుండగా వచ్చి బాబా పాదాలపై పడి ఏడుస్తున్నాడు.
‘‘అరే దీక్షితులూ! ఇటు చూడు నీవు..’’ అంటూ ఉండగానే కనుల నీరు ఇంకిపోయాయి. వింతగా ఆ దీక్షితులే..
‘‘బాబా నీవు ఇక్కడే ఉన్నావా? నేను ఎక్కడినుంచి వచ్చాను. నేను ఎంత యోగాభ్యాసం చేస్తున్నానో నీకు తెలుసు కదా. నాకు నీ మహిమలను చూపించు బాబా, ఒకే ఒక్క మహిమ చూపించు’’ దీనంగా వెడుకుంటున్నాడు.
మరలా బాబా అతడి తల నెమిరి ‘‘చూడు దీక్షితులు, నీవు కూడా ఇక్కడే ఉండు. నీవు వీరితోపాటు హాయిగా నాతో ఉండు. అంతేకాని మహిమలు అంటే నేను ఎక్కడినుంచి చూపించగలను. నీవేమో మంచి యోగాభ్యాసం చేసి రాబోయే రోజులను చూస్తుంటావు. కాని నేను ఏమీ యోగాభ్యాసం చేయను కదా. మరి నీకు నేను ఏం చూపగలను. నీవే నాకు చూపించు, నేను చూస్తుంటాను. కాని నిన్ను నేను ఈ బడిలో కూర్చుని పాఠాలు చెప్పమని పంపాను గదా. అక్కడినుంచి ఎందుకు వచ్చేశావు’’ అన్నాడు.
‘‘ఆ గుర్తువచ్చింది బాబా. నేను యోగాభ్యాసంలో ముందుకు వెళ్లాను. రాత్రి సమాధినిష్ఠుడిని అయ్యాను. అప్పుడు నాకేవో కనిపించాయి. అవి నీకు చెప్దామనే వచ్చాను’’ అన్నాడు.
చిరునవ్వుతో ‘‘నేను మీకందరికీ చెప్పాను కదా, వీడు మంచి యోగాభ్యాసపరుడు. మీరంతా కూడా యోగాభ్యాసం వీని దగ్గరే నేర్చుకోండి. ఈ దీక్షితులు మంచి గురువు’’ అన్నాడు బాబా.
ఆ మాటలకు అపుడే వచ్చిన దీక్షితులు ఒళ్లు గర్వంగా విరుచుకుని ఇపుడే వస్తాను బాబా అంటూ ముందుకు కదిలిపోయాడు.
మహిల్సాపతి బాబా ఇతడిని చూస్తుంటే నాకు యశోదమ్మ గుర్తుకువచ్చింది అన్నాడు...
నాడు దేవకీ వసుదేవులకు పుట్టిన బిడ్డడిని తన బిడ్డడనుకుని పెంచింది. అందరూ ఆ బిడ్డడిమీద ఎగ్గులు చెప్పారని విని బిడ్డనే కట్టడి చేద్దామనుకుని బెదిరించింది.
లోకాలన్నింటిని శాసించే శాసనకర్త అయిన ఆ బిడ్డడు ఎంతో ముద్దులు గుడుస్తూ ‘‘అమ్మా అమ్మా వీరంతా నామీద చాడీలు చెబుతున్నారు. కాని నేనేమో చాలా మంచివాడిని. వీరంతా మట్టిలో ఆడుకుంటూ నేను వద్దని అంటే నాకు కూడా మట్టి పూసి నీమీదే చెబుతాం అంటూ నీతో వచ్చి నేను మన్ను తిన్నానని చెప్పారమ్మా’’ అంటూ ఎంతో బేలగా చెప్పాడు ఆ లోకపాలకుడు.
‘‘నిజమా! నీవు నిజంగా మన్ను తినలేదా, ఏది నీ నోరు చూపు’’ అంటూ పరమాత్మనే గట్టిగా పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని నోరు తెరిపించి మరీ చూడసాగింది ఆ యశోదమ్మ.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743