దక్షిన తెలంగాణ

పర్యావరణ పరిరక్షణ - మన రక్షణ (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చని చీర కట్టుకున్న ప్రకృతి
కాలుష్యం కోరల్లో చిక్కుకుంది
‘్భతాపం’ పుడమి నెత్తిపైన
పెనుభూతమై కూర్చుంది
రోజు రోజుకు పెరుగుతున్న ఉద్గారాలు
పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి
శరవేగంగా విస్తరిస్తున్న పారిశ్రామీకరణ
పట్టణీకరణాలతో పర్యావరణ కాలుష్యం
పెరుగుతుంది నిత్యం విపరీతంగా!
పచ్చని పర్యావరణం మసకబారుతుంది అమితంగా
పర్యావరణ కాలుష్యం పెంచుతుంది సముద్రమట్టం
సముద్ర మట్టం పెరిగితే భూగోళానికే ముప్పు
అందుకే...
హరితహారంలో మొక్కలు నాటండి
పుడమిని పచ్చదనంతో పులకింపజేయండి
ప్రపంచమంతా హరిత సదనంగా మార్చండి
ప్రకృతిమాతకు కాలుష్యం నుండి రక్షించండి
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి
పర్యావరణ పరిరక్షణ - మన రక్షణ కావాలి మన నినాదం
ప్రకృతి మాత సాక్షిగా వృక్షోరక్షతి, రక్షితః అని శ్వాసించండి
- ఇషత్ సుల్తాన, కరీంనగర్
సెల్.నం.9440739159

వెలుతురు పిట్టలు
కులమతాల ఎల్లలు దాటుకుంటూ
కుటిల రాజనీతి కోటగోడలు కూల్చుకుంటూ
మూఢ నమ్మకాల ముసుగు తెరల్లో
గూడుకట్టుకున్న గుడ్డి ఆచారాల్ని మొట్టికాయలేస్తూ
అవినీతి అరాచకాల వీధుల్లో
అచేతనంగా ఆత్మవంచనతో బ్రతుకుతూ
దినదినం దిగజారిపోతున్న
ఆప్యాయతల్ని అడుగడుగునా పలుకరిస్తూ
సంఘ సంస్కర్తల నిజ స్వరూపాలను
సమూలంగా తూర్పారపడుతూ
ప్రశాంత వాతావరణంలో
సత్యం శివం సుందరంగా
సకల హృదయాలు సంబరపడి పోవాలని
మందిర్, మసీద్, చర్చీల మీదుగా
మమతానురాగాల పూలు చల్లుకుంటూ
పాత పద్ధతులను పాత లెక్కలను
పటాపంచలు చేస్తూ
సరికొత్త ప్రగతికి పునాది వేస్తూ
మంచితనం మానవత్వానికి మారుపేరుగా
నవ సమాజంలో సమానత్వాన్ని
స్థాపించడమే ధ్యేయంగా పెట్టుకున్న
అభ్యుదయ భావాల వెలుతురు పిట్టలు
ఆత్మవిశ్వాసంతో అకుంఠిత దీక్షతో
అందరి ఆశీస్సుల ఆలింగనంతో
నిగర్వంగా నిర్మొహమాటంగా
మున్ముందుకు సాగిపోతూనే ఉంటాయి
- రాకుమార, గోదావరిఖని, సెల్.నం.9550184758

పేదవాడు!
‘జనం’ అనే పదానికి - నిరతమూ
నిండుదనాన్ని చేకూర్చేవాడు,
సాటి మనిషిని - ఆపదలో ఆదుకునే
హార్దిక గుణసంపద అతి పుష్కలంగా
ఉన్నవాడు - పేదవాడు!
పార్టీలన్నింటికీ అవసరమైన
‘ప్రీతి’పాత్రమైన ‘ఓటు బ్యాంక్’ పేదవాడు!
రాజకీయ చైతన్యం పేరిట - ఎప్పుడూ
భిన్న రకాలుగా
విభాగించబడుతూండేవాడు - పేదవాడు!
ఏ ర్యాలీనైనా, ఏ సభనైనా
‘మహా’గా మార్చివేసి
తన నినాదాలతో హోరెత్తిస్తూ
విజయవంతం చేసే సత్తా గలవాడు పేదవాడు!
ఏ ఉద్యమంలోనైనా
ప్రళయ ప్రభంజనమై వీచి,
భూకంప ప్రకంపనలు కూడా
సృష్టించగలవాడు పేదవాడు!
తన దగ్గర ఆర్థిక కళ లేకున్నా
చిన్న మార్గాల నుండి రాజమార్గాల వరకూ
చిన్న పల్లెల నుండి పెద్ద పట్టణాల వరకూ
శ్రమకు విశ్వరూపంగా
అంతటా తానై కనిపిస్తూ
తన ఉనికితో
కళకళలూ, తళతళలూ,
మిలమిలలతో మెరిపించగలవాడు పేదవాడు!
ఆదర్శాలు పలికేవారి
నాలుకలపై మాత్రమే
ఊయల లూగగలిగేవాడు పేదవాడు!
బాధల మధ్య విరామాలనే
సంతోషాలు అనే ‘మొలం’గా పూసుకుంటూ
మనస్సుకు అయ్యే గాయాలను
మాన్పుకునే ప్రయత్నం చేస్తుండేవాడు పేదవాడు!
ఏ అందాలూ, ఆనందాలూ
మనస్ఫూర్తిగా కరుణించని,
ఆది తప్ప అంతం కనిపించని
అష్టవిధ కష్టాల పరంపరకు
చిరునామా కూడా పేదవాడే!
- రఘువర్మ, జగిత్యాల, సెల్.నం.9290093933

యుద్ధ గీతం
నింగి నేల రెండూ నావి కావు
అన్నీ నావేననే స్వాతంత్య్ర భ్రమలో
అరువది సంవత్సరాలు గడిచిపోయాయి!
ఏదీ నాది కాదనే నిజం
గుండెల్లో మంటలు రగిలిస్తు
పిడికిలికి ప్రాణం పోస్తూ
ఆశను యుద్ధంగా మార్చి
ఆశయాన్ని ఆయుధంగా తీర్చిన తరువాత
ఎవడ్రా నా ముందు వీరుడు?
నా నెనుకా ముందు జనమున్నారు
వాళ్లు వీరులు!
నింగి నేల అంతా వాళ్లవే!
నీ చట్టాల వలలో
జనం ఆశలను బూడిద చేసావు
బూడిద నుండి నిప్పు కణం ఎగిసిపడే
రోజు రేపే నేటి కసి రేపటి యుద్ధం
అన్నీ నీవేనని అధికార గుండెల చప్పుడుకు
ఆకాశం భయపడదు!
లాఠీలు, జైళ్లు, చట్టాలు, కోర్టులు
అన్నీ నీవేననే నీవు కూసే మాటలకు
అరణ్యం తలవంచదు
నింగి నేల గాలి నీరు
అన్నీ జనంవే!
ఇక్కడే నీవు ఓడిపోతావు!!
- సిహెచ్.మధు, నిజామాబాద్, సెల్.నం.9949486122

పుస్తకాల షెల్ఫ్
ప్రపంచ విజ్ఞాన సారమంతా
తనలో ఇముడ్చుకొన్నట్లు..
తూకం వేయలేని జీవితపు కొలమానానికి
నిర్వచనంలా..
మోయలేనన్ని పుస్తకాలతో
నిండు గర్భిణిలా.. పుస్తకాల షెల్ఫ్
అదొక జంతర్ మంతర్ - మాయా మంత్రనగరి!
ఏ అదృశ్య హస్తమో
నా చేతిలో ఏదో ఒక పుస్తకాన్ని
కాకతాళీయంగా తీయిస్తుంది!
ప్రపంచపు సాహితీవేత్తలంతా
దానిలో ముడుచుకొని కూర్చున్నట్లు..
తమ వంతు వచ్చేవరకు ఎదురుచూస్తున్నట్లు..
పుస్తకాల షెల్ఫ్ తలుపులు తీయగానే
అత్తరు పరిమళాల్లాంటి..
కొత్త పుటల పుస్తకాల ఊపిరి!
గ్లోబును మోసే అట్లాస్ మహావీరునిలా..
పుస్తకాల షెల్ఫ్..
ప్రపంచ సాహిత్యాన్నంతా మోస్తూ..
నిశ్శబ్దంగా.. ధీరత్వంతో..
తన విజ్ఞానపు దివిటీలతో వెలిగిపోతూ..
కుంగిన జీవితాలకు వెలుగుదారి చూపుతూ
ఏకాంతంలో ఆత్మీయ మిత్రుని పలకరింపుగా
పుస్తకాల షెల్ఫ్
గాయపడిన బతుకుకు సంజీవనిగా
నా అంతరంగ సహచరుడు!

- బి.కళాగోపాల్, నిజామాబాద్, సెల్.నం.9441631029