విశాఖపట్నం

స్వచ్ఛతకు ముందడుగు (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏదో ఒకటి చేయాలండీ ఎలాగోలా మార్పు

తీసుకురావాలి’’ అన్నారు మున్సిపల్

ఛైర్మన్ పురుషోత్తమరావు.
‘‘ఆ అదీ ఇదీ ఏదేదో చేశారు కానీ ఏదీ

సాధించలేకపోయారు’’ అంటూ పెదవి

విరిచాడు ప్రతిపక్షవర్గంలో కౌన్సిలర్.

కొందరు పకపకా నవ్వారు. కొందరు గుర్రున

చూశారు. కొందరు వౌనంగా ఉన్నారు.

ఛైర్మన్‌గారు మాత్రం నవ్వుతూ ‘‘ఇది

అందరం సంఘటితంగా పార్టీలకు అతీతంగా

చేయవలసిన పని. అందరూ

సహకరించండి’’ అన్నారు.
స్వచ్ఛ్భారత్ ఉద్యమ ప్రచార అన్ని ప్రసార

మాధ్యమాలలో ప్రతి ఒక్కరిని ప్రేరేపించే

విధంగా సాగుతోంది. చివరికి కరెన్సీ నోటు

మీద కూడా స్వచ్ఛ్భారత్ నినాదం

ముద్రించారు. కానీ సాలూరు పట్టణంలో

చెత్తాచెదారాల విచ్చలవిడి విసిరివేతలు,

ఆరుబయట మలవిసర్జన ఏమాత్రం

తగ్గలేదు. పారిశుద్ధ్య కార్మికులు

ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నప్పటికీ

ప్రజల్లో మూర్ఖత్వం, జాఢ్యం అలాగే

ఉన్నాయి.
వ్యక్తిగత మరుగొదొడ్ల కోసం రాయితీతో

కూడిన రుణాలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో

చలనం రాలేదు. పురుషోత్తమరావుగారు

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యాపారి.

ఎలాగైనా సాలూరుని స్వచ్ఛంగా

తీర్చిదిద్దాలని దృఢసంకల్పంతో ఉన్నారు.

తన వ్యాపారాన్ని తన బిడ్డలకు అప్పజెప్పి

పూర్తి కాలాన్ని తన పదవీ బాధ్యతలక

వెచ్చిస్తున్నారు. సాలూరు పట్టణ సందులు

కొన్ని దుర్గంధభూయిష్టంగా ఉన్నాయి.

ప్రజలను అనాగరిక చేష్టల నుండి

మళ్లించేందుకు రోజుకో స్కీము ఆలోచిస్తాడు

ఆయన. కొన్ని వీధుల కూడళ్లలో సామాజిక

మరుగుదొడ్లు నిర్మించారు. అవి అన్నీ

సొబగులతో ఆకర్షణీయంగా ఉన్నాయి

ఎలాగూ ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు

నిర్మించుకోవడంలేదు. వీటినైనా

వినియోగించుకుంటారేమోనని అతని ఆశ.

అన్నట్టు వీటి ప్రారంభోత్సవానికి ఘనమైన

ఏర్పాట్లు చేశారు. తప్పుతుందా పెద్ద పెద్ద

ఫ్లెక్సీలు, షామియానాలు, వేదిక ఏర్పాటు

చేశారు.
‘‘ఏవండీ ఒక షాపు ఓపినింగ్‌కి

వెళ్లామనుకోండి. ఏదైనా వస్తువు కొంటాం.

సామాజిక మరుగుదొడ్డి ఓపెనింగ్‌కి ఏమిటి

చేయాలండీ’’ అన్నాడు ఒక పెద్ద మనిషి

వెటకారంగా.
‘‘ఏముందీ తలొక్కరు తలో గదిలోకి

వెళ్లడమే. ఏవండోయ్ విలేఖరులు బయటే

ఫొటో తీయండి. లోపలిది కాదు’’ అంటూ

నవ్వుతూ చెప్పారు పురుషోత్తమరావు.

అందరూ భళ్లున నవ్వారు. ఉపన్యాసాలు,

ఉచిత సలహాలు బాగా సాగాయి.

ఇంకేముంది రేపటి నుండి రోడ్డుకి

ఇరువైపులా టీములు ఉండవు అని ఛైర్మన్,

కౌన్సిలర్లు అనుకున్నారు.
మర్నాడు ఉదయం మున్సిపల్ సిబ్బందితో

కలసి రోడ్లను పరిశీలిస్తే షరా మామూలే.
‘‘్ఛఛీ ఇలా కాదు కానీ సామాజిక

మరుగుదొడ్లు ఎక్కువ వాడిని వారికి

బహుమతులు ఇద్దాం సార్’’ అన్నారు

సిబ్బందిలో ఒకరు.
‘‘ఎలాగయ్యా’’ అడిగారు ఛైర్మన్‌గారు.
‘‘ఏముంది టాయ్‌లెట్ (లెట్రిన్) వాడిన వారికి

ప్రతిరోజు ఓ టోకెన్ చొప్పున మరుగుదొడ్డి

నిర్వాహకులచే ఇప్పిద్దాం. అలా ఎవరు

నెలకు ఇరవై అయిదు టోకెన్లు చూపిస్తారో

వారికి నాలుగు సబ్బులు ఇద్దాం’’ అన్నాడు.
‘‘సరే అలాగే చేద్దాం’’ అన్నారు ఛైర్మన్‌గారు.
ఆరోజు నుండి టోకెన్స్ తెగ చెల్లుబాటు

అయిపోతున్నాయి కానీ, రోడ్లు

మునుపటిలాగే కనిపించాయి.
మున్సిపల్ కమిషనర్ గారికి, ఛైర్మన్‌కి

సహనం టపాకాయలా పేలిపోయింది.

‘‘ఏవండీ ఏమిటండీ ఇది? స్ట్రీల్‌లైట్లు

పగలగొట్టేస్తున్నారు. హెచ్చరికలు

పట్టించుకోవడంలేదు. మనమిచ్చే

ప్రోత్సాహకాలు తీసుకుంటున్నారు కానీ

మనకు ప్రోత్సాహం ఇవ్వడంలేదు. మనలో

పొరపాట్లుంటే కట్టగట్టుకుని వచ్చి దాడికి

దిగుతారు. ఏం జనాలండీ’’ అంటూ

చిర్రెత్తిపోయారు. ఛైర్మన్ తన అనుచరుడిని

పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. ఆ అనుచరుడు

హడావుడిగా నలుగురిని వెంటేసుకుని

బళ్లపై వెళ్లారు. ఛైర్మన్ వౌనంగా

నడుచుకుంటూ కిలోమీటర దూరంలో

ఉన్న బోసు బొమ్మ సెంటర్‌కు వెళ్లేసరికి

అక్కడ ఒక షామియానా, స్వచ్ఛత కోసం

నిరాహారదీక్ష అనే బ్యానర్, కుర్చీలు రెడీగా

ఉన్నాయి.
ఛైర్మన్ పురుషోత్తమరావుగారు

నిరాహారదీక్షకు ఉపక్రమించారు. ‘‘వ్యక్తిగత

స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుడి

బాధ్యత, సంస్కారం, ప్రతివారినీ బతిమాలి

పద్ధతి నేర్పడం ఇబ్బందికరంగా ఉంది.

ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు నేను దీక్ష

విరమించను’’ అని గంభీరస్వరంతో

పలికారు.
‘‘ఇదేమిటి ఈ వింత నిరసన’’ అనే ఆశ్చర్యం

కొందరిలో కలిగినప్పటికీ తొందరలో

అందరిలో మందగించిన చైతన్యం మేల్కొని

ముందడుగు వేసింది. సామాజిక

కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు,

వ్యాపారులు, పార్టీలకు అతీతంగా ఛైర్మన్‌ను

సముదాయించి మూడు రోజుల తర్వాత

దీక్ష విరమింపజేశారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా

ఉద్యమంలో పాల్గొన్నారు. ర్యాలీలు చేశారు.

గ్రూపులుగా మారి వివిధ కూడళ్లలో

గస్తీకాశారు. అన్నివర్గాలు సంఘటితంగా

స్వచ్ఛ సాలూరు కోసం కృషి చేశారు. గస్తీలు

కాశారు, కుస్తీలు పడ్డారు. జబర్‌దస్త్‌గా

అందరూ విస్తుపోయేలా స్వచ్ఛతను

సాధించారు.

- చావలి శేషాద్రి సోమయాజులు, పాచిపెంట, విజయనగరం జిల్లా. సెల్ : 9032496575.